S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/17/2018 - 04:38

హైదరాబాద్: అగ్నిమాపక శాఖలో 325 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నాలుగు టైపిస్ట్ ఉద్యోగాలు, రెండు జూనియర్ అసిస్టెంట్, ఒక స్టెనో ఉద్యోగాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీచేయాలని, మిగిలిన 20 స్టేషన్ ఫైర్ ఆఫీసర్, 169 ఫైర్‌మెన్, 129 డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు భర్తీచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

04/17/2018 - 02:51

హైదరాబాద్, ఏప్రిల్ 16: హైదరాబాద్ పాతబస్తీ మక్కా మసీదులో పదకొండేళ్ల కిందటి సంచలన బాంబు పేలుళ్ల కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. కేసులో చార్జిషీట్లు ఎదుర్కొంటున్న ఐదుగురు నిందితులు దేవేందర్ గుప్తా, లోకేశ్ శర్మ, స్వామి అసీమానంద, భరత్ భాయ్, రాజేందర్ చౌదరిలను నిర్దోషులుగా పేర్కొంటూ సోమవారం సంచలన తీర్పు వెలువరించింది.

04/17/2018 - 02:55

హైదరాబాద్, ఏప్రిల్ 16: హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం నాలుగో కోర్టు న్యాయమూర్తి రవీందర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈమేరకు రాజీనామా లేఖను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపించారు. మక్కా మసీదు పేలుడు కేసు తీర్పును సోమవారం ప్రకటించగా, సాయంత్రం పదవికి రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.

04/17/2018 - 02:56

హైదరాబాద్, ఏప్రిల్ 16: తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభ నిర్వహణకు హైకోర్టు సోమవారం అనుమతినిచ్చింది. సరూర్‌నగర్ గ్రౌండ్‌లో తెలంగాణ జన సమితి (తెజస) 29న నిర్వహించనున్న ఆవిర్భావ సభకు అనుమతి ఇవ్వాలంటూ జనసమితి నేతలు పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే సభకు అనుమతి ఇవ్వలేమంటూ అటు పోలీసు శాఖ, ఇటు సరూర్‌నగర్ మైదానం నిర్వాహకులు నిరాకరించారు. దీంతో తెలంగాణ జన సమితి నేతలు హైకోర్టును ఆశ్రయించారు.

04/17/2018 - 04:29

హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో వెయ్యి కోట్ల రూపాయలతో వౌలిక సదుపాయాల కల్పనకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పాతబస్తీని వరదలకు ఆస్కారం లేకుండా, మురికి నీరు రోడ్లపై ప్రవహించకుండా, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా, మంచినీటి ఎద్దడి లేకుండా, ట్రాఫిక్ సమస్యలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయనున్నట్టు వెల్లడించారు.

04/17/2018 - 02:58

విజయవాడ, ఏప్రిల్ 16: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు సోమవారం జరిగిన రాష్ట్ర బంద్ సక్సెస్ అయింది. వ్యాపారులు తమంతట తాముగా స్వచ్ఛందంగా దుకాణాలు, షోరూంలు మూసి రోడ్డెక్కారు. రాజధాని ప్రాంత విజయవాడ నగరంలో బంద్ విజయవంతమైంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని చోట్లా బంద్ ప్రశాంతంగా, విజయవంతంగా జరిగింది.

04/17/2018 - 04:30

హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీ మక్కా మసీదులో పదకొండేళ్ల కిందటి సంచలన బాంబు పేలుళ్ల కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. కేసులో చార్జిషీట్లు ఎదుర్కొంటున్న ఐదుగురు నిందితులు దేవేందర్ గుప్తా, లోకేశ్ శర్మ, స్వామి అసీమానంద, భరత్ భాయ్, రాజేందర్ చౌదరిలను నిర్దోషులుగా పేర్కొంటూ సోమవారం సంచలన తీర్పు వెలువరించింది.

04/17/2018 - 03:12

విజయవాడ, ఏప్రిల్ 16: ఈ ఏడాది జూన్ నుంచే రైతులకు సాగునీరు అందించాలని సకాలంలో సేద్యం పనులు పూర్తిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి నీరు-ప్రగతి, వ్యవసాయంపై ఆయన సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రెయిన్‌గన్స్‌ను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, ఖరీఫ్ సేద్య ప్రణాళికలు పటిష్ఠంగా అమలుచేయాలన్నారు.

04/17/2018 - 04:37

విజయనగరం: జిల్లాలోని పూసపాటిరేగ మండలానికి చెందిన దళిత యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి బాధితురాలు సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. పూసపాటిరేగ ఎస్సీ కాలనీకి చెందిన ఆమె దివ్యాంగురాలు. తన పెద్దమ్మ ఇంటికి వెళ్లేందుకు ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఆటోలో బయలుదేరి విజయనగరం పట్టణంలోని కోట జంక్షన్ వద్దకు చేరుకుంది.

04/16/2018 - 16:58

హైదరాబాద్ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఉస్మానియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మృతదేహాలను భద్రపరిచే గదులు, కోల్డ్ స్టోరేజ్, ఫోరెన్సిక్ విభాగాలను పరిశీలించారు. ఫ్రీజర్ల పని తీరును స్వయంగా పరిశీలించిన మంత్రి రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

Pages