S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/18/2018 - 03:25

విజయవాడ/విశాఖపట్నం ఏప్రిల్ 17: రానున్న ఐదురోజుల్లో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటాయని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ మంగళవారం హెచ్చరించింది. ఏప్రిల్ 18 నుంచి 20 వరకూ పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 43 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ నమోదు అయ్యే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో 41 డిగ్రీలు నమోదు కావచ్చు.

04/18/2018 - 00:56

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: లోక్‌పాల్ సెలక్షన్ కమిటీ సారథి ఎంపిక ప్రక్రియ సాగుతోందని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. కమిటీ చైర్మన్‌గా న్యాయ నిపుణున్ని నియమించదలిచామని, ఆయన ఎంపిక ప్రక్రియ సాగుతోందని ప్రభుత్వం తెలిపింది. ప్రక్రియ పూర్తయిన వెంటనే లోక్‌పాల్ నియామకం పూర్తిచేస్తామని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వెల్లడించారు.

04/17/2018 - 22:35

హైదరాబాద్, ఏప్రిల్ 17: కాంగ్రెస్, బిజేపీల నేతృత్వంలోని ఫ్రంట్‌లకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో టిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటు కాబోతున్న ఫెడరల్ ఫ్రంట్‌కు మరో ముందడుగు పడింది. ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించడానికి మే మొదటి వారంలో భువనేశ్వర్ రావాల్సిందిగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నుంచి సిఎం కేసిఆర్‌కు మంగళవారం ఆహ్వానం అందినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

04/18/2018 - 03:23

అమరావతి:బీజేపీ నేతలు మమ్మల్ని తిట్టడం మానేసి... విభజన హామీలను నెరవేర్చాలని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షం కంటే బీజేపీయే మమ్మల్ని ఎక్కువగా విమర్శిస్తోందని అన్నారు. ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరతారన్న వార్తలు అవాస్తవమని అన్నారు. ఆనం టీడీపీలోనే కొనసాగుతారని సోమిరెడ్డి స్పష్టం చేశారు.

04/17/2018 - 17:42

హైదరాబాద్: దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఏర్పడిన నగదు కొరత తాత్కాలికమేనని కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. బ్యాంకుల్లో నగదు కొరత హైదరాబాద్ నగరంలో గత కొన్ని నెలలుగా నెలకొన్నదని అన్నారు. ఈ సమస్యపై లోతుగా చర్చించి చర్యలు తీసుకోవాలని కోరారు. బ్యాంకింగ్ వ్వవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పోగొట్టవద్దని అన్నారు.

04/17/2018 - 17:41

హైదరాబాద్: మక్కామసీదు పేలుళ్ల కేసులో నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు అని బీజేపీ నేత కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో జరిగే అల్లర్లు, పేలుళ్లకు మూలాలు హైదరాబాద్‌లో ఉన్నాయని అన్నారు. కోర్టు తీర్పును ప్రధాని మోదీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దేశంలో మతకలహాలకు కాంగ్రెస్స్ కారణమని అన్నారు.

04/17/2018 - 17:40

హైదరాబాద్: రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణ పూర్తిచేయాలని సీఎస్ ఎస్‌కే జోషి ఆదేశించారు. ఆయన ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ..ఇప్పటికే ముద్రించిన పట్టాదార్ పాసుపుస్తకాలను జిల్లాలకు పంపించామన్నారు. ధరణి వెబసైట్, భూరికార్డుల ఆధునీకరణపై సిఎం సమీక్ష చేస్తున్నారని అన్నారు.

04/17/2018 - 17:40

హైదరాబాద్: నాపై, నా కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తున్న చానెల్‌పై కేసు పెడతానని నటి జీవితా రాజశేఖర్ అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళా సంఘ నేతల ఆరోపణలను ఆమె ఖండించారు. మహిళా సంఘ నేత సంధ్య ఆరోపణలు అవాస్తం. నాపై నిరాధారమైన ఆరోపణలు చేశారు. నాపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని ఆమె సవాల్ చేశారు.

04/17/2018 - 16:55

హైదరాబాద్‌: కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల కేసులో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. . హైకోర్టు తీర్పుతోనైనా కేసీఆర్‌ సర్కార్‌ మేల్కొని ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేయాలని హితవు పలికారు.

04/17/2018 - 16:19

హైదరాబాద్ : రాష్ట్ర చేనేత, పవర్‌లూమ్, టెక్స్‌టైల్స్ కార్పొరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఇటీవలే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో చేనేత, జౌళి రంగానికి రూ. 1200 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.

Pages