S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/17/2018 - 16:09

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌కు హైకోర్టులో ఊరట లభించింది. వారిపై విధించిన అసెంబ్లీ బహిష్కరణ ఉన్నత న్యాయస్థానం ఎత్తివేసింది. వారి శాసనసభ సభ్యత్వాలను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీచేసింది. వారు తప్పు చేశారని భావిస్తే ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు గానీ.. అసెంబ్లీ బహిష్కరణ సరికాదని న్యాయస్థానం పేర్కొంది.

04/17/2018 - 17:11

హైదరాబాద్: న్యాయం గెలిచిందని, కేసీఆర్ రాజీనామా చేయాలని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కేసీఆర్‌లాంటి ముఖ్యమంత్రి ఉండటం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమని, ఇకనైనా కేసీఆర్ డ్రామాలు కట్టి పెట్టాలని, నెల రోజులపాటు మానసికంగా ఇబ్బందులు పెట్టారని, న్యాయస్థానాలు నాకు రక్షణగా నిలిచాయని కోమటిరెడ్డి అన్నారు.

04/17/2018 - 13:49

అమరావతి: రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశముందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఈమేరకు ఈ ఐదు రోజులు ఎండిలు మండిపోతాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈనెల 18వతేదీ నుంచి 20వరకు పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది.

04/17/2018 - 12:58

హైదరాబాద్ : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్‌తో పాటు 15 జిల్లాలకు సాగు, తాగు నీరు అందిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు వెళ్లనున్న టీఆర్‌ఎస్‌వీ విద్యార్థులకు ఈ ప్రాజెక్టుపై హరీష్‌రావు అవగాహన కల్పించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి 31 జిల్లాల సమన్వయకర్తలు, 119 నియోజకవర్గాల అధ్యక్షులు హాజరయ్యారు.

04/17/2018 - 12:43

నల్గొండ: జిల్లాలోని కట్టంగూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇస్మాయిల్‌పల్లికి చెందిన బండారు పరుశురాములు, పద్మ దంపతులకు తొలుత ఒక కుమార్తె జన్మించింది. తరువాత 2017 మార్చి 17న లాస్య జన్మించింది. రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టడంతో తండ్రి ఆ చిన్నారిని అంతమొందించాలనుకున్నాడు. లాస్యకు జలుబు చేయగా.. మందుల షాపు నుంచి జలుబు మందు తీసుకుని వచ్చేటపుడు ఆ మందులో తండ్రి పురుగుల మందు కలిపాడు.

04/17/2018 - 12:42

కర్నూలు: జిల్లాలో మంగళవారంనాడు జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. బనగానిపల్లె మండలం కొత్తపేట గ్రామం వద్ద లారీ-ఆటో ఢీకొనటంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న రామచంద్రుడు, చెన్నకేశవ, వెంకటశివ అనే వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

04/17/2018 - 12:40

విజయవాడ: భాజాపా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన భాజాపా అధ్యక్షులు అయ్యారు. నాలుగేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగారు. మిత్రధర్మం పాటిస్తూ మృధుస్వభావిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ, టీడీపీతో విభేదాల నేపథ్యంలో కొత్త అధ్యక్షుడ్ని నియమించాలని పార్టీ అధిష్టానవర్గం భావిస్తోంది.

04/17/2018 - 04:36

హైదరాబాద్: పార్టీలతో కాదు ప్రజలతోనే తమ పార్టీ పొత్తు పెట్టుకుటుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ అన్నారు. సోమవారం మహాసభల సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ప్రజలకు చేరువ అవుతున్నట్టు చెప్పారు.

04/17/2018 - 04:34

హైదరాబాద్, ఏప్రిల్ 16: సేద్యం రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండేలా ప్రయత్నిస్తున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. ఢిల్లీలోని కేంద్ర సచివాలయ సేవల విభాగం నుండి హైదరాబాద్ వచ్చిన అధికారుల బృందంతో పార్థసారథి సోమవారం సచివాలయంలో సమావేశమయ్యారు.

04/17/2018 - 04:06

బెంగళూరు, ఏప్రిల్ 16: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపించేకొద్దీ అధికారం నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ మళ్లీ పీఠం ఎక్కాలన్న బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలు మరింత పదునెక్కుతున్నాయి. తాజాగా జరిగిన సర్వేలో ఏ పార్టీకి మెజార్టీ రాదన్న సంకేతాలు వెలువడటంతో అధికారంలోవున్న కాంగ్రెస్ మరింతగా అప్రమత్తమైంది. బీజేపీ సైతం తనదైన శైలిలో మిత్రపక్షాల వేటలో పడింది.

Pages