S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/01/2017 - 01:41

అమరావతి, నవంబర్ 30: ఆటుపోట్లకు చలించకుండా సహనంతో వ్యవహరించే ఎపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రం తీరుతో అసహనం చెందుతున్నారా? కేంద్రం ఇప్పటివరకూ అనుసరిస్తున్న సహాయ నిరాకరణతో విసిగి వేసారిపోయారా? తాను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం కావాలనే అడ్డుపుల్లలు వేస్తోందని ఆయన అనుమానిస్తున్నారా?

11/30/2017 - 03:47

ఆదోని/గొనెగండ్ల, నవంబర్ 29: వైసీపీ అధికారంలోకి రాగానే రైతులు పండించిన ఉత్పత్తుల ధరలు స్థిరీకరిస్తామని ప్రతిపక్ష నేత జగన్ అన్నారు. ప్రజా సంకల్పయాత్ర 21వ రోజు బుధవారం కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా కైరుప్పలలో పత్తి రైతులు హుసేనమ్మ, రమీజాబీ తదితరులు కలిసి పత్తికి గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టపోయామని మొరపెట్టుకున్నారు.

11/30/2017 - 02:12

హైదరాబాద్, నవంబర్ 29: నిబంధనలకు విరుద్ధంగా నకిలీ ట్రాన్సిస్టర్ల సరఫరా వేర్వేరు కేసుల్లో హైదరాబాద్‌లోని మిసెస్ కెంప్ట్రానిక్స్ యజమాని అనిల్ సింఘ్వీకి 15ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ. 9 లక్షలు జరిమానా విధిస్తూ సీబీఐ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. నకిలీ డాక్యుమెంట్లతో రూ.

11/30/2017 - 02:11

హైదరాబాద్, నవంబర్ 29: దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఈ ఏడాది తొలి పది నెలల్లో గత ఏడాదితో పోల్చితే గణనీయంగా తగ్గినట్లు కేంద్ర రవాణా శాఖ వెల్లడించింది. నిరుడిపై దాదాపు మృతుల సంఖ్య ఐదు వేల వరకు తగ్గింది. 2016లో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు తొలి పదినెలల్లో 1,13,890 మంది మృతి చెందగా, ఈ ఏడాది అదే కాలంలో 1,08,887 మంది మృతి చెందారు. దేశం మొత్తం పైన ప్రమాదాల్లో మరణాల రేటు -4.40 శాతం నమోదైంది.

11/30/2017 - 02:18

హైదరాబాద్, నవంబర్ 29: విశాఖపట్నం నగరం ద్వారా వెళ్లే జాతీయరహదారి-16 భాగాన్ని మినహాయించినప్పుడు , నగరంలోని టోల్ ఫ్లాజా వాహనాల నుంచి ఫీజు ఎందుకు వసూలు చేస్తున్నారని హైదరాబాద్ హైకోర్టు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను ప్రశ్నించింది.

11/30/2017 - 02:02

హైదరాబాద్, నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార పార్టీ టిడిపికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలపై ఉన్న క్రిమినల్ కేసులను ఉపసంహరించుకుంటూ జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిల్ కేసులో హైకోర్టు ధర్మాసనం బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం, ఏపి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

11/30/2017 - 02:01

హైదరాబాద్, నవంబర్ 29: పదవ తరగతి చదువుతున్న బాలికలకు ‘మెరిట్ స్కాలర్‌షిప్ టెస్ట్ 2018’ను డిసెబంర్ 10న నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎండి నారా భువనేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. గత మూడేళ్లగా నిర్వహిస్తున్న ఈ పరీక్షను గండిపేటలోని ఎన్టీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

11/30/2017 - 02:00

హైదరాబాద్, నవంబర్ 29: తార్నా క రైల్వే జూనియర్ కళాశాలలో జూనియర్ ఇంటర్ చదువుతున్న మాస్టర్ యశ్ వర్మకు జాతీయ స్కూల్ గేమ్స్‌లో మెడల్స్ గెలుచుకున్నాడు. ఈ నెల 26 నుంచి 30 వరకు ఢిల్లీలో నిర్వహించిన 63వ నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో 400 మీటర్ల ఇండివిడ్యువల్ మెడ్‌లేలో బంగారు పతకం, 200 మీటర్ల బట్టర్‌ఫ్లై స్విమ్మింగ్‌లో బ్రోంజ్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు.

11/30/2017 - 01:51

హైదరాబాద్, నవంబర్ 29: హైదరాబాద్ నగరానికి పెట్టుబడులతో రావాలని తెలంగాణ ఐటి మంత్రి కె తారకరామారావు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. పరిశ్రమలకు అత్యంత స్నేహపూరితమైన ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని, అనుమతులపై దేశంలో ఎక్కడాలేని కొత్త విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు.

11/30/2017 - 01:46

వరంగల్, నవంబర్ 29: వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి గ్రామ సమీపంలో వివాహితపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రికి బాధితురాలిని తరలించారు. అయతే, ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు.

Pages