S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/19/2018 - 14:16

ఒంగోలు: వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. సోమవారం ఉదయం కందుకూరు నుండి జగన్ 92వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. వెంకటాద్రి పాలెం, అనంత సాగరం క్రాస్‌ రోడ్డు, యెద్లూరు పాడు, పెద్ద వెంకన్నపాలెం, విప్పగుంట వరకు పాదయాత్ర కొనసాగనుంది.

02/19/2018 - 12:30

తిరుమల : శ్రీవారిని రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన స్వామి వారిని దర్శించుకొని మ్రొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామి వారి తీర్ధప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు.

02/19/2018 - 14:10

హైదరాబాద్: ప్రముఖ సినీ హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన గతకొంతకాలంగా మూత్రం సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఎస్సార్‌నగర్‌లోని స్వగృహంలో తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అనారోగ్యానికి గురైన ఆయన్ని కుటుంబసభ్యులు ఎర్రగడ్డలోని సెయింట్‌ థెరిసా ఆస్పత్రికి తరలించారు.

02/19/2018 - 06:10

కాకినాడ, ఫిబ్రవరి 18: ఇండియన్ కోస్ట్‌గార్డ్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తీరంలో ఆదివారం నిర్వహించిన డే ఎట్ సీ కార్యక్రమం సాహసోపేతంగా సాగింది. తూర్పు తీర ప్రాంతంలో నిత్యం గస్తీ నిర్వహించే కోస్ట్‌గార్డ్ సిబ్బంది సముద్రంలో చేసిన సాహస కృత్యాలు చూపరులకు గగుర్పాటు కలిగించాయి. విశాఖ తీరం నుండి వచ్చిన ఐసిజిఎస్ షానక్ అనే నౌక, హెలీకాప్టర్ల సహాయంతో సైనికులు విన్యాసాలు చేశారు.

02/18/2018 - 03:48

గన్నవరం: గన్నవరం ఎయిర్‌పోర్ట్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో మరింత ముందుకు తీసుకువెళ్లే బాధ్యత ఇమ్మిగ్రేషన్ సిబ్బందిపై ఉందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న ఇమ్మిగ్రేషన్ సిబ్బంది శిక్షణా శిబిరం శనివారం ముగిసింది.

02/18/2018 - 02:03

విజయవాడ, ఫిబ్రవరి 17: తరతరాల చరిత్రకు తరగని గని కొండపల్లి కోట అని ప్రముఖ చరిత్రకారుడు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి చెప్పారు.

02/18/2018 - 01:47

హైదరాబాద్, ఫిబ్రవరి 17: ఇటీవల ఇంటర్నెట్‌లో ప్రసారమైన లఘు చిత్రం గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ (జిఎస్టీ)ని తాను నిర్మించలేదని, ఆ చిత్రానికి సంబంధించిన కాన్సప్ట్ మాత్రమే తనదని వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. ఓ అమెరికా నిర్మాణ సంస్థ ఆ చిత్రాన్ని తీసిందని, తనకేమీ సంబంధం లేదని స్పష్టం చేశారు.

02/18/2018 - 01:28

హైదరాబాద్, ఫిబ్రవరి 17: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్‌ఆర్‌ఎస్‌పి)లో భాగమైన వరద కాలువ నుండి కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో చెరువులను నింపేందుకు ప్రభుత్వం బృహత్ పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉండగా వరద కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కాలువ నిర్మాణమే దశాబ్దకాలంగా కొనసాగింది. ఎస్‌ఆర్‌ఎస్‌పి పూర్తిస్థాయిలో నిండితే వరద కాలువకు అదనపు నీటిని విడుదల చేస్తారు.

02/18/2018 - 01:02

హైదరాబాద్, ఫిబ్రవరి 17: పార్లమెంటులో ఎంపీలు సవ్యంగా వ్యవహరించకపోవడం వల్లే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా దక్కలేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా టీడీపీ, వైకాపా నేతలు తమ పదవులకు రాజీనామాలు చేయాలని లేదా అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టాలని ఆయన పేర్కొన్నారు. రెండు రోజులపాటు జరిగిన జాయింట్ ఫైండింగ్ కమిటీ ముగింపు కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం పాత్రికేయులతో మాట్లాడారు.

02/18/2018 - 03:45

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన మరో మూడు నెలల్లో నాలుగేళ్లు కావస్తున్నా, 9, 10 షెడ్యూళ్లలో వివిధ సంస్థల ఆస్తులు, అప్పుల విభజనపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది.

Pages