S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/13/2018 - 15:53

తిరుపతి: చిత్తూరు జిల్లా బిఎన్ కండ్రిగ మండలం మయూర షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఆటోను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు మరణించారు. తెల్లవారుజామున శ్రీకాళహస్తి వాయలింగేశ్వరుని దర్శించుకొని తిరిగి ఫ్యాక్టరీలో కూలి పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతానికి చెందిన వారు.

02/13/2018 - 15:28

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరో రికార్డు సృష్టించారు. దేశంలోని అత్యంత సంపన్న సీఎంగా రికార్డులకెక్కారు. ఆయన మొత్తం (స్థిర, చర) ఆస్తుల విలువ సుమారు రూ.177 కోట్లని అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) అనే సంస్థ వెల్లడించింది. ఏడీఆర్ నివేదిక ప్రకారం..రూ.15 కోట్ల విలువైన ఆస్తులతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాలుగో స్థానంలో నిలిచారు.

02/13/2018 - 13:49

భూపాలపల్లి: జిల్లాలో కాళేశ్వరంలో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మాహత్యాయత్నం చేసింది. హన్మకొండ హంటర్‌ రోడ్డుకు చెందిన మేరుగు హరిప్రియ, పెండ్యాల సాయికుమార్ ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి వీరు ఆత్మహత్యాయత్నం చేయగా.. హరిప్రియ మృతి చెందింది. ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

02/13/2018 - 13:40

జమ్ముకశ్మీర్‌: సుంజ్వాన్‌ సైనిక శిబిరంపై ఉగ్రవాదుల కాల్పుల ఘటనలో మంగళవారం మరో జవాను మృతి చెందాడు.
గత శనివారం నుంచి ఇప్పటి వరకు ఉగ్రవాదుల కాల్పుల్లోఆరుగురు సైనికులు, ఒక పౌరుడు మృతి చెందగా.. భద్రతా
బలగాల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. సైనిక చర్యలు కొనసాగుతున్నాయి.

02/13/2018 - 13:34

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వ నిధుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట మారుస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ, సీనియర్‌ నేత సోము వీర్రాజు మండిపడ్డారు.మంగళవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 5 వేల కోట్లు ఇచ్చిందని, కేంద్రప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చిన నిధులు ఎక్కడ ఖర్చుచేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

02/13/2018 - 12:31

గుంటూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం కోటప్పకొండపై మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కోటప్పకొండ తిరునాళ్లు త్రికోటేశ్వరునికి ప్రభుత్వం తరుపున మంత్రి మాణిక్యాలరావు, స్పీకర్‌ కోడెల శివప్రసాద్ పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మరోవైపు త్రికోటేశ్వరున్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

02/13/2018 - 12:30

మిర్యాలగూడ : నల్గొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన చింతలపాలెం గ్రామ ఉపసర్పంచి ధర్మానాయక్‌ దారుణహత్యకు గురయ్యారు.మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్‌ ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేశారు. రాజకీయ కోణంతో పాటు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ధర్మానాయక్‌ ఇద్దరు భార్యలు. దీంతో ఈ హత్య వెనుక కుటుంబ కలహాల నేపధ్యం ఏమైనా ఉందా?

02/13/2018 - 11:49

రాజన్న సిరిసిల్ల : వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, టీటీడీ తరపున జేఈవో శ్రీనివాస్ రాజు పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.

02/13/2018 - 04:10

హైదరాబాద్, ఫిబ్రవరి 12: హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని వివిధ పట్టణాలు, గ్రామాల్లో ఒకవైపు రోడ్లు వేస్తుంటే, మరోవైపు ఏదో ఒక ఏజెన్సీ సదరు రోడ్డును తవ్వేస్తోంది. ప్రైవేట్ సంస్థలు జరిపిన సర్వే అంచనాల ప్రకారం మంచిరోడ్లను ఏదో ఒక పనిపేరుతో తవ్వకం వల్ల ప్రభుత్వానికి ఏటా దాదాపు 200 కోట్ల రూపాయల వరకు నష్టం వస్తోంది.

02/13/2018 - 03:44

విశాఖపట్నం, ముంచంగిపుట్టు, ఫిబ్రవరి 12: మావోయిస్ట్ అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్కే మరోసారి తప్పించుకున్నాడా? పోలీసులకు, మావోయిస్ట్‌లకు ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున పెదబయలు, చిత్రకొండ మధ్య జగన్నాథపురం గ్రామం వద్ద సుమారు 50 మంది మావోయిస్ట్‌లు సమావేశమయ్యారు. ఇదే సమయంలో ఆంధ్రా, ఒడిశా పోలీసులు జాయింట్ కూంబింగ్ ఆపరేషన్ అక్కడ నిర్వహిస్తున్నారు.

Pages