S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/28/2017 - 03:54

హైదరాబాద్, నవంబర్ 27: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రపంచ పారిశ్రామికత సదస్సు మంగళవారం నాడు హైటెక్స్‌లోని నోవాటెల్‌లో ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ ఈ సదస్సును ప్రారంభిస్తారు.

11/28/2017 - 03:52

హైదరాబాద్, నవంబర్ 27: చిన్న చిన్న ఆలోచనల నుండి ఆవిర్భవించిన అబ్బురపరిచే వ్యాపార ఆవిష్కరణలకు జీఈఎస్ సదస్సు వేదిక కాబోతోంది. సదస్సులో మూడు రోజుల పాటు 500 అంకురాలను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా వారు తమ ఆలోచనలు, అమలులో ఎదురైన ఇబ్బందులు, దానిని పారిశ్రామిక అంశంగా మార్చిన తీరు, మిగిలిన వారికి ఆదర్శం ఎలా అవుతుందో కూడా వివరిస్తారు. మనసులో పుట్టిన చిన్న చిన్న ఆలోచనలకు ఈ సదస్సు పెద్ద పీట వేయనుంది.

11/28/2017 - 03:50

హైదరాబాద్, నవంబర్ 27: ప్రపంచ మహిళ అభివృద్ధికి జీఈఎస్ సదస్సు ముఖద్వారం వంటిదని, మహిళల గెలుపే అందరి గెలుపు అని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లు చేసిందని ఆయన కొనియాడారు.

11/28/2017 - 02:37

హైదరాబాద్, నవంబర్ 27: నాందేడ్- లింబ్‌గాన్-చుడ్వా-పూర్ణ సెక్షన్‌లో మెషిన్ ట్యాంపింగ్ పనుల కారణంగా లైన్ బ్లాక్ చేస్తున్నందున ఆ రూట్లో నడిచే ఒక ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేయగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 28, 29, డిసెబంర్ 1, 2, 3, 5,6 తేదీల్లో రైళ్ల రద్దు, పాక్షిక రద్దు ఉంటుందని పేర్కొంది.

11/28/2017 - 02:30

హైదరాబాద్, నవంబర్ 27: 2007లో మెట్రోరైలు ప్రాజెక్టుకు అంకుర్పారణ జరిగి 2017 నవంబర్ 28న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించే వరకు ఎన్నో సవాళ్లను అధిగమించి ఎట్టకేలకు ప్రారంభయ్యే వరకు సాగిన మెట్రోరైలు ప్రస్థానం ఇది.
వ. తేదీ అంశం
సం.
1 మే 14, 2007 హైదరాబాద్ మెట్రోరైలు ఏర్పాటు
2 సెప్టెంబర్ 19, 2008 రాష్ట్ర ప్రభుత్వం, మైటాస్ మధ్య ఒప్పందం

11/28/2017 - 01:58

తిరుపతి, నవంబర్ 27: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరుడు కొలువుదీరి ఉన్న తిరుమల శ్రీవారి సన్నిధిలో అంతా నా ఇష్టం అంటున్న శ్రీవారి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై సీనియర్ అర్చకుల్లో ఒకరైన ఖాధ్రిపతి నరసింహాచార్యులు మండిపడుతున్నారు. ఆలయ ప్రధాన అర్చకులుగా ఉన్న రమణ దీక్షితుల వ్యవహార శైలిపై ఇటు ఆలయ అర్చక సమాజం, అధికారులు ఆగ్రహంతో ఊగిపోతున్న విషయం పాఠకులకు విదితమే.

11/28/2017 - 01:36

హైదరాబాద్, నవంబర్ 27: ఎంతోకాలంగా హైదరాబాద్ ప్రజలు ఎదురు చూస్తోన్న మెట్రోరైలు అందుబాటులోకి రానున్న తరుణంలో ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేయడం తగదని మున్సిపల్‌శాఖ మంత్రి కె తారకరామారావు హితవు పలికారు.

11/28/2017 - 01:33

హైదరాబాద్, నవంబర్ 27: భాగ్యనగరవాసుల దశాబ్దంనాటి కల నేడు సాకారం కాబోతోంది. చారిత్రక హైదరాబాద్ నగరవాసులు ఎదురు చూస్తోన్న మెట్రోరైలు సౌకర్యం అందుబాటులోకి వచ్చే తరుణం ఆసన్నమైంది.

11/28/2017 - 01:31

హైదరాబాద్, నవంబర్ 27: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రపంచ పారిశ్రామిక సదస్సు మంగళవారం హైటెక్స్‌లోని నోవాటెల్‌లో ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ సదస్సును ప్రారంభిస్తారు.

11/28/2017 - 01:21

విజయవాడ (రైల్వేస్టేషన్), నవంబర్ 27: బెజవాడ అంటేనే బేఖాతరిజం. సర్కారు ఎన్ని సంస్కరణలు పెట్టినా బెజవాడలో తప్ప అన్నిచోట్లా అమలవుతుంది. రాష్టమ్రంతా రోడ్డు వెడల్పు చేస్తుంటే బెజవాడలో మాత్రం అధికారులు ఆ సాహసం చేయరు. కారణం.. భయం. రాజకీయ నేతలపై నుంచి వచ్చే ఒత్తిళ్లు. కోర్టు తీర్పులయినా అంతే. అందుకే బెజవాడ రూటే సెపరేటు.

Pages