S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/04/2019 - 01:23

హైదరాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మంగళవారం విడుదల చేసింది. మార్చి 19వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటి వరకు పరీక్షలు జరుగుతాయని బోర్డు ఆఫ్ సెకండరీ డైరెక్టర్ పేర్కొన్నారు. పరీక్షల వేళలు ఉదయం 9.30 గంటల నుంచి 12.15 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. మార్చి 19న తెలుగు పేపర్-1, 20న తెలుగు పేపర్-2, 21న సెకండ్ ల్యాంగ్వేజ్, 23న ఇంగ్లీష్

12/04/2019 - 01:18

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ, హైకోర్టు సింగిల్ జడ్డి జస్టిస్ ఏ. రాజశేఖర్‌రెడ్డి 2019 నవంబర్ 29 న ఉత్తర్వులు జారీ చేయడంతో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడింది.

12/03/2019 - 14:17

హైదరాబాద్: దిశ నిందితులను చర్లపల్లి జైలులో ఉంచటంతో పోలీసులు అక్కడ బారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జైలు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఆందోళనలకు పోలీసుల అనుమతి లేదు.

12/03/2019 - 05:27

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి ఈనెల చివరలో పదవీ విరమణ చేస్తుండటంతో ఆయన స్థానంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ-సీఎస్)గా ఎవరు నియామకం అవుతారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. సీనియారిటీని పరిశీలిస్తే జోషి తర్వాత అజయ్ మిశ్రా ఉన్నారు. 1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన మిశ్రా 1960 జూలై 16న జన్మించడంతో ఆయన పదవీ విరమణ 2020 జూలై వరకు ఉంటుంది.

12/03/2019 - 05:59

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం నుంచి ఆర్టీసీ బస్సు చార్జీలను అధికారికంగా పెంచేశారు. కిలోమీటర్‌కు 20 పైసలు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఆర్టీసీ అధికారులు ప్రకటించిన చార్జీలను పరిశీలిస్తే మాత్రం ప్రయాణికులపై భారం వేశారు. ప్రయాణికుడు కండక్టర్ మధ్య చిల్లర (పైసల) గొడవలు లేకుండా ప్రతి టికెట్‌పై ఐదు రూపాయాలు పెంచేశారు. పట్టణ ప్రజలపై చార్జిల భారం అధికంగా బాదేశారు.

12/03/2019 - 01:21

హైదరాబాద్, డిసెంబర్ 2: వచ్చే నాలుగేళ్లలో ఎలక్ట్రానిక్స్ అండ్ మానుఫాక్చరింగ్ రంగాల్లో 3 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఐటీ రంగంలో ఒకనాడు బెంగళూరు ముందంజలో ఉంటే ప్రస్తుతం ఈ స్థానాన్ని హైదరాబాద్ అక్రమించిందని అన్నారు.

12/02/2019 - 17:44

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం బస్ ఛార్జీలను భారీగా పెంచింది. కనీస బస్ ఛార్జీని రూ.10లు చేశారు. పల్లె వెలుగు నుంచి ఏసీ స్లీపర్ వరకు భారీ ఎత్తున బస్ ఛార్జీలను పెంచారు. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.15, డీలక్స్ బస్సుల్లో కనీస ఛార్జీ రూ.12లకు పెంచింది. బస్‌పాస్‌లను సైతం భారీగా పెంచారు. బస్‌పాస్ ఛార్జీ రూ.770ల నుంచి రూ.950లకు, మెట్రో బస్‌పాస్ ఛార్జీ రూ.990 నుంచి రూ.1180కి పెంచగా..

12/02/2019 - 17:44

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యోదోంతంలోని నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు షాద్‌నగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మరింత విచారణ జరిపేందుకు పది రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

12/02/2019 - 06:35

నాగర్‌కర్నూల్, డిసెంబర్ 1: ప్రపంచంలోనే వలసల జిల్లాగా పేరుగాంచిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంతో సస్యశ్యామలంగా ఉండటమే కాక వ్యవసాయ పనులు చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాకు వలసలు వస్తున్నారని, ఈ ఘనత సీఏం కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు.

12/02/2019 - 06:33

కరీంనగర్, డిసెంబర్ 1: మిడ్‌మానేరు నుంచి వాటర్ లీకవుతోందని, నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిచ్చి అవినీతికే ప్రభుత్వం పెద్దపీట వేసిందని, అక్రమాలు బహిర్గతం చేస్తాం, జ్యుడీషియల్ విచారణకు సిద్ధమేనా? అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు.

Pages