S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/02/2019 - 06:32

సూర్యాపేట, డిసెంబర్ 1: నిరంతరం అధికారిక కార్యక్రమాలతో తీరికలేకుండా ఉండే రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తన మిత్రుని కుమార్తె వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పొరుగు రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తూ అటు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఇటు దర్శనీయ ప్రాంతాలను చూస్తు ఉత్సహంగా, ఉల్లాసంగా గడుపుతున్నారు.

12/02/2019 - 06:31

భువనగిరి: తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న కల్వకుంట్ల నియంతృత్వ పాలనకు చరమగీతం భువనగిరి నుండే ప్రారంభమవుతుందని, అంతర్జాతీయ చరిత్ర కలిగిన భాగ్యనగరాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాందీనగరంగా మార్చివేసారని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు.

12/02/2019 - 01:59

చేర్యాల, డిసెంబర్ 1: మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని, రాష్ట్రంలో ప్రియాంకరెడ్డి ఘటన దురదృష్టకరమని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం గొల్మకుర్మల ఆత్మీయ సన్మాన కార్యక్రమం సిద్దిపేట జిల్లా చేర్యాలలోని స్థానిక షాదిఖానాలో జరుగగా ఆయన పాల్గొని మాట్లాడారు. గొల్లకుర్మలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని అన్నారు. విద్యపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు.

12/02/2019 - 01:58

నాగర్‌కర్నూల్, డిసెంబర్ 1: ఎంజెఆర్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి ఆదివారం నిర్వహించిన సామూహిక వివాహమహోత్సవంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుతోపాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖుల సమక్షంలో 165 జంటలు ఏకమయ్యాయి.

12/02/2019 - 01:52

హైదరాబాద్, డిసెంబర్ 1: టీఎస్‌ఆర్టీసీ కార్మికులపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు. సమ్మె సందర్భంగా కార్మికులు చేసిన డిమాండ్ల కంటే ఎక్కువగా.. అదీ ఉహించని విధంగా అనేక తీపి కబుర్లు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించడం, వారిని షరతులు లేకుండా విధుల్లో చేర్చుకున్న నేపథ్యంలో ప్రగతి భవన్‌లో ఆదివారం కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

12/02/2019 - 01:47

హైదరాబాద్ : రాష్ట్రంలో సోమవారం నుంచి కాకుండా మంగళవారం నుంచి బస్సు చార్జీలు పెంచుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో కార్యక్రమం అధికారులు పాల్గొన్నందున చార్జీల పెంచే యోచన మంగళవారానికి వాయిదా వేశామన్నారు.

12/02/2019 - 05:41

సికిందరాబాద్: స్వాతంత్య్ర సమరయోధురాలు, సంఘ సంస్కర్త జే.ఈశ్వరీబాయి జయంతిని పురస్కరించుకొని సికిందరాబాద్, ఈస్ట్ మారేడ్‌పల్లిలోని ఆమె విగ్రహానికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి, ఈశ్వరీబాయి కుమార్తె గీతారెడ్డి పూలమాలలు వేసి

12/02/2019 - 01:27

హైదరాబాద్, డిసెంబర్ 1: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాజీలేని పోరాటం చేసిన ధీర వనిత ఈశ్వరీ బాయి అని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఈశ్వరీబాయి జయంతిని పురస్కరించుకొని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్‌కు ఈశ్వరీ బాయి సార్మక అవార్డును గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రదానం చేశారు.

12/02/2019 - 01:36

హైదరాబాద్, డిసెంబర్ 1: ప్రియాంకారెడ్డి హత్య కేసును దర్యాప్తును వేగవంతం చేసి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ కేసు సత్వర విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను కోరారు. ఇటీవల వరంగల్‌లో ఓ బాలిక హత్య సంఘటనలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు

12/01/2019 - 06:15

బాన్సువాడ, నవంబర్ 30: తెలంగాణాలో నో ప్లాస్టిక్...నో ఫ్లెక్సీ అనే నినాదాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, పారిశుద్ధ్య నివారణతో పాటు పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రమైన వాతావరణాన్ని ప్రజానికానికి అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ నిషేధంపై శాసనసభలో చేసిన తీర్మానం హర్షణీయమన్నారు.

Pages