S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/07/2019 - 16:37

హైదరాబాద్: అబ్దుల్లాపూర్ మేట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యకేసులో నిందితుడు కూర సురేశ్ చికిత్స పొందుతూ ఉస్మానియా ఆసుపత్రిలో చనిపోయాడు. దాదాపు 60 శాతం గాయాలతో తొలుత అపోలో డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. తదనంతరం మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మధ్యాహ్నాం 3.30 గంటలకు మృతిచెందాడని వైద్యులు వెల్లడించారు.

11/07/2019 - 05:53

హైదరాబాద్, నవంబర్ 6: ఆర్టీసీ సమ్మె సందర్భంగా ముఖ్యమంత్రి మూడు మార్లు డెడ్‌లైన్లు పెట్టి బెదిరించినా, రెచ్చగొట్టినా కార్మికులు ఎవరూ బెదరలేదని, ఎవరూ తమ విధుల్లో చేరలేదనీ.. దీంతో ముఖ్యమంత్రి కెసీఆర్ నైతికంగా ఓటమి చెందారని, తక్షణమే కేసీఆర్ రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు.

11/07/2019 - 05:59

హైదరాబాద్: భారత ప్రజాస్వామ్యంలో ప్రజలే అధిపతులని, ప్రజల సమ్మతితో పనిచేయకుంటే ప్రభుత్వాలపై తిరుగుబాటు తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెలో భాగంగా బస్సులను డిపోల వద్ద అడ్డుకోవాలని అఖిలపక్షం, ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నాడు కాచీగూడ బస్సు డిపో వద్ద అఖిలపక్షం, ఆర్టీసీ జాక్ నేతలు, సీపీఐ నేతలు కలిసి బస్సులను అడ్డుకుని ధర్నా నిర్వహించారు.

11/07/2019 - 05:44

హైదరాబాద్, నవంబర్ 6: ప్రజలు ఇచ్చిన మ్యాండేట్‌తో ప్రజారంజక పాలన అందించకుండా నియంతృత్వ విధానాలతో పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం ప్రారంభమైందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా అన్నారు.

11/07/2019 - 05:23

హైదరాబాద్, నవంబర్ 6: హైదరాబాద్ అంబర్‌పేటలోని జిందా తిలిస్మాత్ కార్మిక సంఘం అధ్యక్షుడుగా మాజీ ఎంపీ డాక్టర్ జీ సంజీవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన కార్మిక సంఘ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడుగా అబ్దుల్ ఖాదర్, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ జిలా-ఉల్-హసన్ ఖాద్రీ, కార్యదర్శిగా మహ్మద్ ఇనాయత్ అలీ, సంయుక్త కార్యదర్శిగా షేక్ జహంగీర్ కోశాధికారిగా మస్మద్ ముక్తార్ అలీ ఎన్నికయ్యారు.

11/07/2019 - 05:20

హైదరాబాద్, నవంబర్ 6: సీఎం కేసీఆర్ బెదిరింపులను లెక్కచేయకుండా సమ్మెను కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మికులను కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశంసించారు. ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నేతల ధైర్యాన్ని మెచ్చుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ కార్మికులకు డెడ్‌లైన్ పెట్టినా, హక్కుల కోసం సమ్మెను కొనసాగించడం నిజంగా సాహసమేనన్నారు.

11/07/2019 - 05:19

హైదరాబాద్, నవంబర్ 6: భారతీయ జనతా పార్టీ రానున్న మున్సిపల్ ఎన్నికల సన్నద్ధత వ్యూహంతో బుధవారం నాడు కీలక భేటీ నిర్వహించింది. ఈ భేటీకి బీజేపీ జాతీయ సంస్థాగత ఎన్నికల ఎన్నికల అధికారి, మాజీ కేంద్ర మంత్రి రాధా మోహన్‌సింగ్ హాజరయ్యారు.

11/07/2019 - 05:19

హైదరాబాద్, నవంబర్ 6: ప్రజాస్వామ్యంలో చట్టసభలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందో అదే విధంగా శాసనసభ ఏర్పాటు చేసిన కమిటీలకు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుందని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ సంస్థల పనితీరును సమగ్రంగా పర్యవేక్షించడం ప్రభుత్వ రంగ సంస్థల బాధ్యతని గుర్తుచేశారు.

11/07/2019 - 05:18

హైదరాబాద్, నవంబర్ 6: తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వంటేరు ప్రతాప్‌రెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు.

11/07/2019 - 05:18

హైదరాబాద్, నవంబర్ 6: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ హత్య సంఘటనపై వెంటనే జ్యుడీషియల్ విచారణ జరిపించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా), రెవెన్యూ జేఏసి డిమాండ్ చేశాయి. ట్రెసా, రెవెన్యూ జేఏసీ నాయకులు బుధవారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంచార్జి సీసీఎల్‌ఏ అయిన సోమేశ్ కుమార్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.

Pages