S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/08/2019 - 04:25

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించడానికి దయచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలకు పిలవాలని జేఏసీ నేతలు కోరారు. చర్చలు జాప్యం చేస్తే మరింత మంది కార్మికులు బలవన్మరణం చేసుకుంటారని, దీంతో ఆయా కుటుంబీకులు అనాథలు అవుతారని జేఏసీ నేతలు సీఎంకు సూచించారు.

11/08/2019 - 04:24

హైదరాబాద్, నవంబర్ 7: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఐ సహా వివిధ సంఘాలు నిర్వహించిన భారీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఎఐకేఎస్, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు, టీజీఎస్, ఎఐఎస్‌ఎఫ్, టీపీఎన్‌ఎం, బీసీ సబ్ ప్లాన్ సంఘాల ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఇందిరాపార్కు వరకూ నిర్వహంచగా, ర్యాలీనీ పోలీసులు అడ్డుకుని నాయకులను అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

11/08/2019 - 04:22

హైదరాబాద్, నవంబర్ 7: తహసీల్దార్ విజయారెడ్డి హత్య బాధాకరమని, ఆ ప్రాంతంలోని భూకుంభకోణాలకు సంబంధించి అధికార టీఆర్‌ఎస్ నేతలపైనే ఆరోపణలు వస్తున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు చేశారని, ఈ ఆరోపణలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని చెప్పారు.

11/08/2019 - 04:08

హైదరాబాద్, నవంబర్ 7: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ వాహనాల దోపిడీ గత 34 రోజులుగా యథేచ్చగా కొనసాగుతోంది. నగరాల్లో, పట్టణాల్లో 45 మంది ఎక్కాల్సిన బస్సులో 100 నుండి 120 మంది వరకు ప్రయాణిస్తున్నారు. సిటీ బస్సుల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సాధారణ రోజుల్లో 50 రూపాయల వరకు వసూలు చేసే చార్జీ స్థానంలో 100 రూపాయలు వసూలు చేస్తున్నారు.

11/08/2019 - 04:06

హైదరాబాద్, నవంబర్ 7: తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సీఎం కేసీఆర్ సహకరించడంతో రాష్ట్ర క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి ఎంతో పేరుప్రతిష్టలు తేస్తున్నారని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

11/08/2019 - 04:05

హైదరాబాద్, నవంబర్ 7: గత ప్రభుత్వాలు కనీసం కులవృత్తులను పట్టించుకున్న పాపాన పోలేదు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని, కుల వృత్తులకు అండగా ప్రభుత్వం నిలిచిందని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జీవో నెంబర్ 314 ద్వారా ప్రభుత్వం రూ. 10.09 కోట్లు మంజూరు చేసింది.

11/08/2019 - 05:40

హైదరాబాద్: ప్రపంచానికి పెనుముప్పుగా తయారైన ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలు అన్నీ కలిసి రావాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఉగ్రవాదంపై వచ్చే ఏడాది భారత్‌లో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.

11/08/2019 - 03:59

హైదరాబాద్, నవంబర్ 7: మేడారం జాతర నేపధ్యంలో రవాణ సౌకర్యాలు మెరుగ్గా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజనశాఖ మంత్రి మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా రోడ్లను అభివృద్ధి చేయాలని, అవసరమైన మరమ్మత్తులు పూర్తి చేయాలని మంత్రులు ఉన్నతాధికారులను ఆదేశించారు.

11/08/2019 - 01:33

హైదరాబాద్: భవిష్యత్తు జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని, అందుకు అనుగుణంగా పట్టణాల్లో మాస్టర్ ప్రణాళికలను రూపొందించుకోవాలని పట్టణాభివృద్ధి సంస్థలను మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశించారు. దీని కోసం పట్టణాభివృద్ధి సంస్థలు కార్యాచరణ తయారు చేసుకొని స్వయం సమృద్ధిగా మారేందుకు కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

11/07/2019 - 16:38

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ చర్చలకు పిలిస్తే సమస్య వెంటనే పరిష్కారం అవుతుందని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు హైకోర్టుకు సమర్పించిన నివేదికలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని, సీఎం కేసీఆర్ 9 గంటల పాటు అధికారులతో సమీక్ష చేసే బదులు 90 నిమిషాలు తమతో చర్చిస్తే సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు.

Pages