S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/18/2017 - 00:56

హైదరాబాద్, జూలై 17: తెలంగాణలో రాష్ట్రంలో జాతీయ రహదారులకోసం సేకరించే భూములకు సంబంధించి లబ్దిదారులకు జిల్లా కలెక్టర్ల ద్వారా నిధుల పంపిణీ జరుగుతుందని రాష్ట్ర రోడ్లుభవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. ఆర్ అండ్ బి ఇంజనీర్-ఇన్-చీఫ్ కార్యాలయంలో సోమవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మెదక్ పాత జిల్లాలోని రోడ్ల నిర్మాణం, ప్రగతిపై సవివరంగా చర్చించారు.

07/18/2017 - 00:56

హైదరాబాద్, జూలై 17: రాష్ట్రంలో మాదకద్రవ్యాల సరఫరాను అరికట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామని రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ ఆర్‌వి చంద్రవదన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. మంగళవారం ఆలిండియా రేడియో, ఎఫ్‌ఎం రెయిన్‌బోలో ‘మాదక ద్రవ్యాలు-నివారణకు చర్యలు’పై పలువురి సలహాలు, సందేహాలకు వారు సమాధానమిచ్చారు.

07/18/2017 - 00:55

హైదరాబాద్, జూలై 17: భారత ఉప రాష్టప్రతి అభ్యర్థిగా ఎం వెంకయ్యనాయుడును బిజెపి పార్లమెంటరీ పార్టీ నిర్ణయం తీసుకోవడంపై ఆ పార్టీ నేతలు అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ సరైన నిర్ణయం తీసుకున్నారని, వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వం తెలుగు జాతికే గర్వకారణమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు.

07/18/2017 - 00:55

హైదరాబాద్, జూలై 17: కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై ప్రభుత్వ ప్రోద్బలంతో పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని డిసిసి అధ్యక్షులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం గాంధీ భవన్‌లో నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బిక్షమయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు డిసిసి అధ్యక్షులు, టి.పిసిసి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

07/18/2017 - 00:54

హైదరాబాద్, జూలై 17: కొండ పోచమ్మ రిజర్వాయర్ నిర్మాణం పేరిట పేదల నుంచి ప్రభుత్వం బలవంతంగా భూములు సేకరించడాన్ని అడ్డుకోవడానికి వెళ్ళిన టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్‌ను పోలీసులు అకారణంగా అరెస్టు చేశారని టి.జెఎసి విమర్శించింది. ప్రొఫెసర్ కోదండరామ్ అరెస్టుతో నాంపల్లిలోని కార్యాలయంలో టి.జెఎసి అత్యవసరంగా సమావేశమై చర్చించింది.

07/18/2017 - 00:54

హైదరాబాద్, జూలై 17: తెలంగాణ రాష్ట్రంలో ఐదేళ్ల కాలంలో 230 మొక్కలు నాటాలని నిర్ణయించామని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. హైదరాబాద్ (నల్లగొండ క్రాస్‌రోడ్డు) లోని వికలాంగుల పాఠశాలలో సోమవారం ఆయన హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హరిత తెలంగాణ సాధించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

07/18/2017 - 00:53

హైదరాబాద్, జూలై 17: హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఇంటి నుంచి పారిపోయి ముంబయిలో వెళ్లిన టెన్త్ విద్యార్థిని పూర్ణిమసాయి తల్లిదండ్రుల వెంట వచ్చేందుకు నిరాకరించింది. గత నెల 7న స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పి ముంబయికి వెళ్లిన పూర్ణిమను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే.

07/18/2017 - 00:51

హైదరాబాద్, జూలై 17: తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జనరల్‌గా సీనియర్ న్యాయవాది దేశాయి ప్రకాశ్‌రెడ్డిని (61) రాష్ట్రప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి (న్యాయ) వి. నిరంజన్ రావు పేరుతో సోమవారం జీఓ (ఆర్‌టి నెంబర్ 453) జారీ అయింది. మహబూబ్‌నగర్ జిల్లా అమరచింత (ప్రస్తుతం వనపర్తి జిల్లా) కు చెందిన ప్రకాశ్‌రెడ్డి సొంత గ్రామంలో హైస్కూల్‌వరకు చదివారు.

07/17/2017 - 04:04

హైదరాబాద్, జూలై 16: రాష్టప్రతి ఎన్నికల సందర్భంగా సోమవారం నిర్వహించే పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. శాసనసభ ఆవరణలో కమిటీ హాలు-1లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

07/17/2017 - 04:02

హైదరాబాద్, జూలై 16: రాష్టప్రతి ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రం తరఫున రామ్‌నాథ్ కోవింద్ అభ్యర్థిత్వానికి రాజకీయాలకు అతీతంగా పూర్తి స్థాయిలో మద్దతు నివ్వాల్సిన అవసరం ఉందని టిడిఎల్పీ నేత ఎ.రేవంత్‌రెడ్డి, బిజె ఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి కోరారు. టిడిపి శాసనసభ పక్ష కార్యాలయంలో టిడిఎల్పీ, బిజెఎల్పీలకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు.

Pages