S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/10/2017 - 01:22

హైదరాబాద్, జూలై 9: తెలంగాణ రాష్ట్రంలో గురుపూర్ణిమ పెద్దఎత్తున నిర్వహించారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్, చాదర్‌ఘాట్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లోని షిర్డీసాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు వేల సంఖ్యలో రావడంతో ఈ ఆలయాలు కిటకిట లాడాయి. పూర్ణిమ శనివారం ఉదయం నుండి ఆదివారం ఉదయం వరకు ఉండటంతో చాలా మంది రెం డురోజుల పాటు ఉత్సవాలను నిర్వహించారు.

07/10/2017 - 01:21

హైదరాబాద్, జూలై 9: రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, దళారుల మోసాలను అరికట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూరగాయలు పండించే రైతులకు గిట్టుబాటు ధర లభించక విలవిలలాడుతున్నారని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. రెండు నెలల క్రితం టమాట రైతుకు ధర రాక రోడ్లపై పారబోశారని ఆయన తెలిపారు.

07/10/2017 - 01:21

హైదరాబాద్, జూలై 9: పన్ను ఎగవేతదారులే జిఎస్‌టి (వస్తు, సేవా పన్ను)తో ఆందోళన చెందుతున్నారని కేంద్ర అల్పసంఖ్యాకవర్గాల వారి వ్యవహారాల శాఖ సహాయ (స్వతంత్ర హోదా), పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు. జిఎస్‌టిపై ఆదివారం ఏర్పాటు చేసిన జన జాగృతి కార్యక్రమానికి కేంద్ర మంత్రి నక్వీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

07/10/2017 - 01:20

హైదరాబాద్, జూలై 9: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి కాకుండా డిజిటల్ టెక్నాలజీతో జియో ట్యాగింగ్ చేసే పద్ధతిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి భూ పరిపాలన శాఖ, రెవెన్యూ శాఖ కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశాయి. ఇప్పటికే రాష్ట్రంలో చెరువు లు ఆక్రమణకు గురికాకుండా జియో ఫెన్సింగ్ విధానాన్ని అమలు చేస్తే మంచి ఫలితాలు వచ్చాయి.

07/09/2017 - 02:52

హైదరాబాద్, జూలై 8: ముస్లిం మైనారిటీ యువతుల వివాహ సమయంలో ఆర్ధిక సాయం అందించేందుకు ఒక పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలుచేయనున్నట్టు కేంద్ర మైనార్టీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ వెల్లడించారు. ఎంసిహెచ్‌ఆర్‌డిలో శనివారం నాడు జరిగిన ఎస్‌సిఎ వార్షిక సదస్సులో ఆయన మాట్లాడారు.

07/09/2017 - 02:50

హైదరాబాద్, జూలై 8: నిఘా నేత్రాల బారి నుంచి తప్పించుకునేందుకు డ్రగ్ మాఫియా తొక్కని అడ్డదారి లేదు. గత కొనే్నళ్ల నుంచి చాపకింద నీరులా విస్తరించిన మాదక ద్రవ్యాల చలామణి ముఠాలు హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని చెలరేగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో సంచలనం రేపిన డ్రగ్స్ సరఫరా కేసులో విదేశీయుల పాత్ర చాలా కీలకంగా కనిపిస్తోంది.

07/09/2017 - 02:49

హైదరాబాద్, జూలై 8: రాష్టప్రతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామ్‌నాథ్ కోవింద్‌కు తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతునివ్వడం మిత్రపక్షమైన మజ్లిస్‌కు మింగుడుపడడం లేదు. ఉన్నఫళంగా ఎన్డీఏ వైపు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మొగ్గు చూపడం వెనుక మర్మం, ఆంతర్యం ఏమిటో మజ్లిస్‌కు అంతుచిక్కడం లేదు.

07/09/2017 - 02:47

హైదరాబాద్, జూలై 8: భూ కుంభకోణాలు కలిగిస్తున్న భూ ప్రకంపనలతో రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దీనిపై భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఇందులో భాగంగానే మరో విడత సమగ్రంగా పరిశీలన (రీ-సర్వే) చేయాలన్న పట్టుదలతో ఉంది.

07/09/2017 - 03:11

హైదరాబాద్, జూలై 8: ఆషాఢ మాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకునే బోనాల పండుగలో భాగంగా ఆదివారం సికిందరాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి బోనాల జాతరకు జరగనుంది. సోమవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్న రంగంతో రెండురోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలకు పోలీసులు పకడ్బందీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.

07/09/2017 - 02:43

హైదరాబాద్, జూలై 8: ప్రకృతి వైద్యానికి తమ (తెలంగాణ) ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో అత్యాధునిక వసతులతో ప్రకృతి చికిత్సా కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కర్నాటక రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న ప్రకృతి చికిత్సా విధానాలను పరిశీలించేందుకు ఆయుష్ కమిషనర్ డాక్టర్ ఎ.

Pages