S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/08/2017 - 02:37

హైదరాబాద్, జూలై 7: రాష్ట్రంలో ఈ నెల 8 నుంచి 14వ తేదీ వరకు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మాదిరి వర్షాలు, మరి కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిశోధనా కేంద్రం తెలిపింది.

07/08/2017 - 02:35

న్యూఢిల్లీ, జూలై 7: అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి జమ్ముకాశ్మీర్‌లో చిక్కుకున్న 44 మంది క్షేమంగా ఉన్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి 44 మంది అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి జమ్ముకాళ్మీర్‌లో చిక్కుకున్నారు. ఈ మేరకు వారందరిని సురక్షితంగా జమ్మూకాశ్మీర్ నుంచి స్వరాష్ట్రానికి చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులను ఆదేశించింది.

07/08/2017 - 02:35

హైదరాబాద్, జూలై 7: జమ్మూ-కాశ్మీర్, అనంతనాగ్, కాజిగుండా ప్రాంతంలో ఓ పర్యాటక బస్సులో సిలెండర్ పేలుడుతో కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడడం పట్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం కాశ్మీర్ ప్రధాన కార్యదర్శికి ఓ లేఖ రాశారు. మృతి చెందిన వ్యక్తి భౌతికకాయాన్ని వెంటనే విమానం ద్వారా పంపించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆయన కోరారు.

07/08/2017 - 02:34

హైదరాబాద్, జూలై 7: నిరుద్యోగులకు తీపి కబురు. తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో 1506, పంచాయతీరాజ్ శాఖలో 359 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. పత్యక్ష నియామక పద్దతిలో ఈ పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి)కి అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

07/08/2017 - 02:34

హైదరాబాద్, జూలై 7: తెలంగాణ రాష్ట్రంలో ఇ సెట్ ద్వారా 12,234 మందికి సీట్లు కేటాయించినట్టు కన్వీనర్ ఎ వాణి ప్రసాద్ తెలిపారు. ఇసెట్‌లో 22,702 మంది అర్హత సాధించగా, 15,644 మంది సర్ట్ఫికేట్ల పరిశీలనకు హాజరయ్యారని, 14,496 మంది తమ వెబ్ ఆప్షన్లను నమోదుచేశారని, అందులో 12,234 మందికి సీట్లు కేటాయించగా ఇంకా 7767 సీట్లు మిగిలే ఉన్నాయని చెప్పారు.

07/08/2017 - 02:33

హైదరాబాద్, జూలై 7: విద్యార్ధుల హక్కులపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ మరోమారు రాజుకుంటోంది. దాదాపు 50 మంది విద్యార్ధులు యూనివర్శిటీ విధిస్తున్న ఆంక్షలను వ్యతిరేకిస్తూ తమ హక్కులను కాపాడాలంటూ ఉద్యమిస్తున్నారు. 2017-18 విద్యాసంవత్సరానికి జరుగుతున్న అడ్మిషన్లలో రోస్టర్ విధానం సక్రమంగా పాటించడం లేదని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.

07/08/2017 - 02:23

హైదరాబాద్, జూలై 7: రాష్ట్రంలో వేస్ట్ మేనేజ్‌మెంట్ రంగంలో ఏకీకృత విధానాన్ని అవలంభించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె. తారక రామారావు మున్సిపల్ వ్యవహారాల శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంత్రి కెటిఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెత్త నిర్వహణ ప్రాజెక్టులపై సమీక్షించారు.

07/08/2017 - 01:53

హైదరాబాద్, జూలై 7: కేంద్రప్రభుత్వం విద్యకు, ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తోందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. శుక్రవారం నాడు ఆయన హైదరాబాద్‌లోని కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం వెల్‌నెస్ సెంటర్ -5 పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని విద్య, ఆరోగ్యవిభాగాలకు 120 కోట్ల రూపాయిలను కేంద్రం మంజూరు చేసిందని అన్నారు.

07/08/2017 - 01:50

హైదరాబాద్, జూలై 7: ఒకప్పుడు ప్రపంచ దేశాలను ఆకర్షించి ఐటి హబ్‌గా పేరొందిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను డ్రగ్స్ హబ్‌కు దిగజార్చిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందని టిటిడిపి నేత, పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి విమర్శించారు.

07/08/2017 - 01:50

హైదరాబాద్, జూలై 7: ఈ ఖరీఫ్ సీజన్‌లో 7.65 లక్షల మంది రైతులకు రూ.4,700 కోట్ల పంట రుణాలు పంపిణీ చేసినట్టు బ్యాంకర్లు ప్రభుత్వానికి వెల్లడించారు. రాష్టస్థ్రాయి బ్యాంకర్ల స్టీరింగ్ కమిటీ శుక్రవారం వ్యవసాయశాఖ కార్యదర్శి సి పార్థసారథి అధ్యక్షతన సమావేశమైంది. ఖరీఫ్ రుణాల పంపిణీ, పంటల బీమాపై బ్యాంకర్లతో సమావేశంలో చర్చించినట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు.

Pages