S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/06/2019 - 23:04

గజ్వేల్, నవంబర్ 6: దేశ అభివృద్ధిలో రాష్ట్రం నెంబర్-1గా నిలుస్తుండగా, రాష్ట్రంలో గజ్వేల్ నెంబర్-1గా నిలువడం గజ్వేల్ ప్రజలు చేసుకున్న పుణ్యమని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బుధవారం బంజారా ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన వంటేరు ప్రతాప్‌రెడ్డి సన్మాన, అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు.

11/06/2019 - 23:01

వరంగల్, నవంబర్ 6: సమ్మక్క-సారలమ్మల జాతరను జాతీయ పండుగగా గుర్తించేందుకు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క-సారలమ్మలను ఎంపీ మాలోతు కవితతో కలిసి మంత్రి దర్శించుకున్నారు.

11/06/2019 - 22:58

నర్వ, నవంబర్ 6: భగీరథ పైపులైన్‌ను వెంటనే తొలగించకపోతే నిన్ను పెట్రోల్ పోసి తగలబెడతా అంటూ పంచాయతీ కార్యదర్శిని ఒక వ్యక్తి బెదిరించిన సంఘటన వనపర్తి జిల్లాలో జరిగింది. నర్వ మండల పరిధిలోని కల్వాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న కర్ణం లోకేష్‌ను అదే గ్రామానికి చెందిన బోయ వెంకటయ్య బుధవారం బెదిరింపులకు గురి చేశాడు.

11/06/2019 - 22:56

గరిడేపల్లి, నవంబర్ 6: అబ్దుల్లాపుర్ రెవెన్యూ కార్యాలయంలో జరిగిన ఘటనలో గాయపడి మృతి చెందిన డ్రైవర్ కామళ్ల గురునాథం అంత్యక్రియలు బుధవారం అశ్రునయనాల మధ్య స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా వెలిదండ గ్రామంలో ప్రశాంతంగా జరిగాయి.

11/06/2019 - 22:53

నాగార్జునసాగర్, నవంబర్ 6: నాగార్జునసాగర్ జలాశయం నుండి ఎడమ కాల్వకు విడుదల చేస్తున్న నీటిని బుధవారం తెల్లవారుజామున డ్యాం అధికారులు నిలిపివేశారు. ఎడమ కాల్వ పరిధిలో వారబందీ పద్ధతిలో నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయంలో నీటిమట్టం 589.80 అడుగులుగా ఉంది.

11/06/2019 - 22:52

నాగర్‌కర్నూల్, నవంబర్ 6: రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో ఏ వర్గంవారు కూడా సంతోషంగా లేరని, ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు ఆర్టీసీ కార్మికులతో మొదలైందని పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లురవి అన్నారు.

11/06/2019 - 14:04

హైదరాబాద్: ఈ నెల 9న ఆర్టీసీ కార్మికులు మిలియన్ మార్చ్ నిర్వహిస్తారని జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆయన బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ నిబంధనల మేరకు ఆర్టీసీ విభజన జరగలేదని అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు ఆర్టీసీ కార్మికులు స్పందించలేదని. కొంతమంది సిబ్బంది మాత్రమే విధుల్లో చేరారని తెలిపారు. ప్రభుత్వానికి కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.

11/06/2019 - 14:00

హైదరాబాద్: విధుల్లో చేరే ఉద్యోగుల సంఖ్య క్రమేణ పెరుగుతుంది. రాష్టవ్య్రాప్తంగా 487 మంది ఆర్టీసీ సిబ్బంది సమ్మతి పత్రాలు అందజేశారు. ఈనెల 5వ తేదీ అర్థరాత్రిలోగా ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ గడువు విధించిన విషయం విదితమే. గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో 111, హైదరాబాద్ జోన్‌లో 73, బస్ భవన్‌లో 216, కరీంనగర్ జోన్ పరిధిలో 87 మంది సమ్మతి పత్రాలను అందజేశారు.

11/06/2019 - 12:45

హైదరాబాద్: సీఎం కేసీఆర్ డెడ్‌లైన్ విధించినప్పటికీ ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట వీడలేదు. విధుల్లోకి వచ్చి చేరలేదు. ఈ రోజు డిపోల ఎదుట బస్సులు నడవకుండా ఆందోళన చేశారు. పలు డిపోల్లో కార్మికుల ఆందోళనలు జరిగాయి. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ డిపో ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు. సూర్యాపేట డిపో ఎదుట చేస్తున్న ధర్నాకు రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి.

11/06/2019 - 12:42

హైదరాబాద్: గత నెలరోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె, సమ్మెలో పాల్గొంటున్న కార్మికులకు ఇచ్చిన గడువు నిన్న అర్థరాత్రికి ముగియటంతో తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై సీఎం కేసీఆర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు.

Pages