S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/06/2019 - 05:53

హైదరాబాద్, నవంబర్ 5: రెవెన్యూ అధికారి విజయారెడ్డి సజీవ దహనం కేసు విచారణను సీబీఐకు అప్పగించాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మెజిస్ట్రేట్ అదికారాలు ఉన్న అధికారిపై దాడి దారుణమన్నారు. రాష్ట్రంలోశాంత భద్రతలు క్షీణించాయన్నారు. ఐదు వందల ఎకరాల భూ వివాదంలో ఈ సంఘటన జరిగిందన్నారు. విజయారెడ్డిపై ప్రజాప్రతినిధుల వత్తిడి ఉందన్నారు.

11/06/2019 - 05:52

హైదరాబాద్, నవంబర్ 5: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఈనెల 5వ తేదీలోపు విధుల్లో చేరాలని, సమ్మెకు దిగిన ఆర్టీసీ సిబ్బందికి ముఖ్యమంత్రి కేసీఆర్ డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరే అవకాశం ఉందని భావించిన పోలీసు ఉన్నాతాధికారులు రాష్ట్రంలోని వివిధ జిల్లాలో ఉన్న ప్రధాన బస్‌డిపోల వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

11/06/2019 - 05:51

హైదరాబాద్, నవంబర్ 5: ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదల వీడి, ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు కోరారు. ముఖ్యమంత్రి బెదిరింపులు మానుకోవాలని సూచించారు. మంగళవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సమ్మె ఎంతకాలం కొనసాగితే అంత మంచిది అన్నట్టు సీఎం వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

11/06/2019 - 05:49

హైదరాబాద్, నవంబర్ 5: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా మరో రెండు రోజుల పాటు రెవెన్యూ ఉద్యోగులంతా విధులు బహిష్కరిస్తున్నట్టు రెవెన్యూ జేఏసీ ప్రకటించింది. తెలంగాణ రెవెన్యూ జేఏసీ నేతలు వి. లచ్చిరెడ్డి, ఎస్. రాములు, గరికే ఉపేంద్రరావు, ఎన్. లక్ష్మీనారాయణ, ఏ. బాలనర్సయ్య, సంతోష్, వంగూరు రాములు, బి. సుధాకర్ తదితరులు ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు.

11/06/2019 - 05:49

హైదరాబాద్, నవంబర్ 5: కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన కింద పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయడం లేదని, కేంద్రం నిధులు ఇస్తున్నా వాటిని రాష్ట్రం దారిమళ్లిస్తోందని ఎంపీ అరవింద్ ధర్మపురి ఆరోపించారు.

11/06/2019 - 05:48

హైదరాబాద్, నవంబర్ 5: తెలంగాణలో విత్తనోత్పత్తి, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. నెదర్లాండ్స్ రాజధాని హేగ్ నగరంలోని క్రౌన్‌ప్లాజాలో డచ్ ట్రేడ్‌మిషన్ పెట్టుబడిదారులు సమావేశంలో మంగళవారం ఆయన ప్రసంగించారు. భారత దౌత్య కార్యాలయం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

11/06/2019 - 05:47

హైదరాబాద్, నవంబర్ 5: మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్వాసితులకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్‌ను కోరారు. మంగళవారం ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నేతలు టీ జీవన్ రెడ్డి, డీ శ్రీ్ధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎం సత్యం, ఏ శ్రీనివాస్, ఎన్ సత్యనారాయణ్ గౌడ్ తదితరులు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలుసుకున్నారు.

11/06/2019 - 05:47

హైదరాబాద్, నవంబర్ 5: తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహన ఘటన నేపథ్యంలోనైనా రెవిన్యూ చట్టాల మార్పులపై అఖిలపక్ష పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పాటైన తర్వాత తప్పులతడకగా ఉన్న రెవిన్యూ చట్టాలను సవరించాలని 2017లోనే తాము కోరామని, నిజాం పాలన తర్వాత చట్టాల్లో మార్పులు తీసుకురాలేదని అన్నారు.

11/06/2019 - 05:42

హైదరాబాద్, నవంబర్ 5: రాష్ట్రప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రైతు వాగ్దానాలను గాలికి వదిలేసిందని ఆరోపిస్తూ బీజేపీ కిసాన్‌మోర్చ నేతల బృందం మంగళవారం నాడు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా వారు రెండు పేజీల వినపతిపత్రాన్ని సమర్పించారు.

11/06/2019 - 05:23

బాలాపూర్, నవంబర్ 5: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల తహశీల్దార్ విజయా రెడ్డి అంత్యక్రియలు మంగళవారం నాగోల్‌లోని శ్మశానవాటికలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ దహన సంస్కారాలు నిర్వహించారు. గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. విజయా రెడ్డి చితికి భర్త సుభాష్ రెడ్డి నిప్పంటించారు.

Pages