S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/07/2019 - 05:17

హైదరాబాద్, నవంబర్ 6: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ ఇస్తామని ముఖ్యమంత్రి ఇటీవల చేసిన ప్రకటన మేరకు ప్రభుత్వం బుధవారం జీఓ (ఎంఎస్ నెంబర్ 88, ఆర్థిక శాఖ) జారీ చేసింది. జనవరి 1 నుండి డీఏ వర్తిస్తుందని వివరించారు. డీఏ 3.144 శాతం ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటి వరకు ఉద్యోగుల బేసిక్‌లో 30.392 శాతం ఉన్న డీఏ ఇక నుండి కొత్త జీఓతో 33.536 శాతానికి పెరుగుతుంది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.

11/07/2019 - 05:17

హైదరాబాద్, నవంబర్ 6: రాష్ట్రంలో భూ వివాదాలపై హైకోర్టు సిటింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. బుధవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళన విపరీత పరిస్థితులకు దారితీస్తోందన్నారు. భూ వ్యవహారాలకు సంబంధించి గతంలో అనేక ఉద్యమాలు వచ్చాయన్నారు. అందులోనిది ఒక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమన్నారు.

11/07/2019 - 02:48

హైదరాబాద్, నవంబర్ 6: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్‌సీఎస్) లో చేరాలని విద్యార్థులు, యువతకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపు ఇచ్చారు. ఐఆర్‌సీఎస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా గవర్నర్ పనిచేస్తున్నారు. 2019 నవంబర్ 1 న యువతను ఐఆర్‌సీఎస్‌లో చేర్చడం ప్రారంభం కాగా, ఈ కార్యక్రమం డిసెంబర్ 31 వరకు కొనసాగుతుంది.

11/07/2019 - 02:48

హైదరాబాద్, నవంబర్ 6: ఎన్టీపీసీ (సౌత్) రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా డాక్టర్ ప్రమోద్ ప్రభాకర్ కులకర్ణి నియమితులయ్యారు. ఆయన రాష్ట్రంలోని రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టు హెడ్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. అంతుక ముందు ఆయన ఆరావళి పవర్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు. 1982లో ఆయన ఎన్టీపీసీలో ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్‌గా చేరారు.

11/07/2019 - 02:46

కరీంనగర్, నవంబర్ 6: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చేపట్టిన సమ్మె తీవ్రరూపం దాల్చగా మరో కార్మికుని గుండె ఆగింది. బుధవారం కరీంనగర్ 2-డిపోకు చెందిన మెకానిక్ మహమ్మద్ కరీంఖాన్ గుండెపోటుతో మృతి చెందాడు. తెలంగాణ చౌక్‌లో జాఫ్రీ మజీద్‌లో జనాజా నమాజ్ చేసి (దువ్వా) చేశారు.

11/07/2019 - 01:19

హైదరాబాద్: అయ్యప్ప దీక్ష చేపట్టిన పోలీసులు విధులు నిర్వహించేందుకు అనుమతించబోమని పోలీసులు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడాన్ని విశ్వహిందూ పరిషత్ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ తప్పుపట్టారు. ఇది హిందూ విశ్వాసాలను కించపరిచే చర్యేనని పేర్కొన్నారు. ఇతర మతస్తులకు వారి ఆచార వ్యవహారాలను కొనసాగించడానికి అనుమతిస్తూ కేవలం హిందువులపైనే ఆంక్షలు విధించడం సెక్యులరిజం అవుతుందా? అని ఆయన ప్రశ్నించారు.

11/07/2019 - 01:17

సిద్దిపేట, నవంబర్ 6 : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అనంతగిరి జలాశయంలో ముంపునకు గురవుతున్న చిన్నకోడూరు మండలం కొచ్చగుట్టపల్లి గ్రామ భూ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట మున్సిపాల్టీ లింగారెడ్డిపల్లిలో సకల వసతులతో పునరావాసం కల్పించింది.

11/07/2019 - 01:11

హైదరాబాద్, నవంబర్ 6: ఆపదలో ఉన్న కార్యకర్తలు, వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అండ ఎప్పుడూ ఉంటుందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు అన్నారు. కార్యకర్తల కృషితోనే పార్టీ అధికారంలోకి వచ్చిందని, వారిని అధినేత, సీఎం కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారని అన్నా రు. వివిధ కారణాలతో మృతి చెందిన 1,581 మం ది కార్యకర్తల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పు న రూ.

11/07/2019 - 01:08

హైదరాబాద్: ఆర్టీసీ ఇక ప్రైవేటుపరం కానుందా? ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో హెచ్చరించిన విధంగానే నూరు శాతం ప్రైవేటీకరణవైపే సర్కారు అడుగులు వేస్తున్నదా? ఇందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాల్సిందిగా అధికారులను ఇప్పటికే ఆదేశించిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తున్నది. పరిస్థితులను చూస్తుంటే, ఇది నిజమేనన్న అభిప్రా యం ఏర్పడుతున్నది.

11/07/2019 - 01:07

హైదరాబాద్, నవంబర్ 6: ఆర్టీసీ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని, ఇందులో భాగంగా ఈ నెల 9న మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. మిలియన్ మార్చ్‌కు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో పాటు ఉద్యోగ సంఘాల మద్ద తు కోరుతామని తెలిపారు. విధుల్లో చేరడానికి సీఎం కేసీఆర్ విధించిన గడువుకు, బెదిరింపులకు ఆర్టీసీ కార్మికులు లొంగలేదని స్పష్టం చేశారు.

Pages