S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/06/2019 - 00:48

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరడానికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగిసింది. అయితే, ప్రభుత్వం ఆశించిన స్థాయిలో విధుల్లో చేరడానికి కార్మికులు ముందుకు రాలేదని సమాచారం. మంగళవారం రాత్రి 10 గంటల వరకు కేవలం 520 మంది కార్మికులు మాత్రమే సమ్మతి పత్రాలు ఇచ్చినట్టు అధికార వర్గాల సమాచారం. దీంతో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.

11/05/2019 - 17:24

హైదరాబాద్: దుండగుడి చేతిలో సజీవదహనమైన అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. నాగోలు స్మశానవాటికలో ప్రభుత్వలాంఛనాలతో నిర్వహించారు. పోలీసులు గౌరవ సూచకంగా గాలిలోకి కాల్పులు జరిపారు. భర్త సుభాష్‌రెడ్డిఆమె చితికి నిప్పంటించారు. ఈ అంత్యక్రియల్లో సీపీ మహేశ్ భగవత్, తెజస అధ్యక్షుడు కోదండరాం, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

11/05/2019 - 04:57

హైదరాబాద్, నవంబర్ 4: ఢిల్లీలో న్యాయవాదులపై పోలీసుల కాల్పులను ఖండిస్తూ తెలంగాణలో న్యాయవాదులు సోమవారం నాడు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. హైకోర్టు సహా రాజధాని నగరంలోని మెట్రోపాలిటన్, సివిల్, క్రిమినల్ కోర్టులతో పాటు ఫ్యామిలీ కోర్టుల వద్ద న్యాయవాదులు నిరసన తెలిపారు. న్యాయవాదుల విధుల బహిష్కరణతో న్యాయస్థానాల్లో కార్యకలాపాలకు కొంత అంతరాయం ఏర్పడింది. కక్షిదారులకు కూడా ఇబ్బంది ఏర్పడింది.

11/05/2019 - 04:54

హైదరాబాద్, నవంబర్ 4: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు రాష్ట్రానికి గొప్పవరమని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్-చైర్మన్ బి. వినోద్‌కుమార్ పేర్కొన్నారు.

11/05/2019 - 04:52

హైదరాబాద్, నవంబర్ 4: తెలంగాణ రాష్ట్రాన్ని ‘గ్లోబల్ సీడ్ హబ్’గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇందుకోసం నెథర్లాండ్స్ సహకరించాలని తెలంగాణ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. నెదర్లాండ్స్‌లోని సీడ్ వ్యాలీ హాలండ్‌ను నిరంజన్‌రెడ్డి నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం సోమవారం సందర్శించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విత్తనోత్పత్తికి తెలంగాణలో మంచి వాతావరణం ఉందన్నారు.

11/05/2019 - 04:45

హైదరాబాద్, నవంబర్ 4: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి, సమ్మె ఉద్ధృతం అయ్యేందుకు సీఎం కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనుగుల రాకేష్‌రెడ్డి ఆరోపించారు. ఆర్టీసీని మూసేస్తామని అందుకు కేంద్రం చట్టం చేసిందని అంటున్నారని, సీఎం అవాస్తవాలు చెబుతున్నారని అన్నారు.

11/05/2019 - 04:45

హైదరాబాద్, నవంబర్ 4: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం అత్యంత దురదృష్టకరమని వామపక్ష పార్టీల నేతలు, విద్యార్ధి, యువజన సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొన్నారు. వివిధ సంఘాల నేతలు వేర్వేరుగా విడుదల చేసిన వివిధ ప్రకటనల్లో విజయారెడ్డిపై దాడి , సజీవదహనం చాలా దారుణమని పేర్కొన్నారు.

11/05/2019 - 04:44

హైదరాబాద్, నవంబర్ 4: రాష్ట్రంలో రెవిన్యూ సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టకపోవడం వల్లనే అబ్దుల్లాపూర్ ఘటన జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు.

11/05/2019 - 04:43

హైదరాబాద్, నవంబర్ 4: ఏకపక్షంగా , నిరంకుశంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తూ, ఐదోతేదీలోగా చేరాలని డెడ్‌లైన్ పెట్టడాన్ని సీపీఐ ఎంఎల్ న్యూ డెముక్రసీ , తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండిస్తోందని సహాయ కార్యదర్శి పీ రంగారావు పేర్కొన్నారు. సీఎంది దురహంకార చర్య అని ,కార్మిక వ్యతిరేక చర్య అని అన్నారు.

11/05/2019 - 02:58

హైదరాబాద్, నవంబర్ 4: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పిన వారికి అందించే బిర్లా ఆర్కియలాజికల్, కల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ గోల్డెన్ జూబ్లీ అవార్డును డీఆర్‌డీఓ చైర్మన్ డాక్టర్ జీ. సతీష్‌రెడ్డికి సోమవారం అందించారు.

Pages