S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/04/2019 - 05:01

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె పట్ల టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కఠిన వైఖరిని అవలంభిస్తుండటంతో మంత్రులు వౌన వ్రతం పాటిస్తున్నారు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ తన స్పష్టమైన వైఖరిని మీడియా సమావేశాల్లో, అధికారుల సమీక్షల సందర్భంగా వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో మంత్రులు ఎవరు కూడా ఈ అంశంపై నోరు మెదపడానికి సహసించడం లేదు.

11/04/2019 - 04:52

హైదరాబాద్, నవంబర్ 3: ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు తొందరపాటు చర్య అని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత విలేఖర్లతో మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల ప ట్ల ప్రభుత్వం కక్షతో వ్యవహరించరాదన్నారు. పాలకులు కార్మికుల విషయంలో సానుభూతితో ఉండాలన్నారు. ఆర్టీసీ అంటే ప్రజలకు సేవ చేసే సంస్థ న్నారు.

11/04/2019 - 04:51

హైదరాబాద్, నవంబర్ 3: ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభుత్వానికి-ఆర్టీసీ కార్మిక సంఘాల మధ్య ‘టగ్ ఆఫ్ వార్’గా మారింది. ఇటు ప్రభుత్వం కాని, అటు కార్మిక సంఘాల నేతలు కాని పట్టు సడలించడం లేదు. రెండు వర్గాలు కూడా ‘ఎత్తుకు పైఎత్తు’ వేస్తున్నారు. దాంతో సమ్మె ప్రారంభం రోజు ఎలాంటి పరిస్థితి ఉందో నేటికీ అదే పరిస్థితి నెలకొని ఉంది.

11/04/2019 - 04:51

కొత్తకోట, నవంబర్ 3: ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం 30 రోజులుగా సమ్మె చేస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ సమస్యలను పరిష్కరించకుండా విధుల్లో చేరాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆర్టీసీ కార్మికుల ఉసురు ఆయనకు తగిలి పతనం ప్రారంభమైందని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకురాలు డీకే అరుణ అన్నారు. ఆదివారం గాంధీ సంకల్పయాత్ర వనపర్తి జిల్లా కొత్తకోటలో ప్రారంభమైంది.

11/04/2019 - 04:37

హైదరాబాద్, నవంబర్ 3: సీఎం కేసీఆర్ మాటలను చూస్తుంటే రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టినట్లుగా ఉందని, తెంలాగణ సమాజం మేఃల్కొని రాష్ట్రాన్ని రక్షించుకోవాలని సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఇక్కడ ఆయన సీఎల్‌పీ కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని దివాలా తీయించి, కేసీఆర్ పాలన చేయలేకపోతున్నారని, ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకు ఆత్రుతపడుతున్నారన్నారు.

11/04/2019 - 04:34

హైదరాబాద్, నవంబర్ 3: ఆర్థికంగా ఎదిగేందుకు పక్కా ప్రణాళిక అవసరమని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్-చైర్మన్ బి. వినోద్‌కుమార్ పేర్కొన్నారు. కొలంబియా యూనివర్సిటీలో జరుగుతున్న ‘సమ్మిట్ ఆన్ ఇండియన్ ఎకనమిక్స్’ చర్చాగోష్టిలో ఆదివారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వమైనా, సంస్థలైనా, వ్యక్తులైనా ఇదే సూత్రం వర్తిస్తుందన్నారు. ఆర్థికాంశాలు అంతర్జాతీయంగా పెనుసవాల్‌గా మారాయన్నారు.

11/04/2019 - 04:33

హైదరాబాద్, నవంబర్ 3: ఆర్టీసీ కార్మికులపై ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న కార్మికులు విధుల్లో చేరాలంటూ డెడ్‌లైన్ విధించడం అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు. ప్రైవేటు, కాంట్రాక్టు సంస్థలతో సీఎం కుదర్చుకున్న అక్రమ ఒప్పందాల వల్లే కార్మికులను అణచివేస్తున్నారని ఆరోపించారు.

11/04/2019 - 04:32

హైదరాబాద్, నవంబర్ 3: రొమ్ము కేన్సర్ అనేది ప్రాణాంతకమైన కణితి అని దేశంలోమహిళల్లో సంభివస్తున్నట్లు వంటి అన్ని రకాల కేన్సర్లలో దాదాపు 14 శాతంగా ఉంటూ అగ్రభాగంగా ఉందని ప్రముఖ కేన్సర్ నిపుణులు డాక్టర్ టీపీఎస్ భండారీ అన్నారు. మొత్తం మీద పతి 28 మంది మహిళల్లో ఒకరికి తమ జీవింలో ఏదో ఒక సమయంలో రొమ్ము కేన్సర్ బారిన పడే అవకాశం ఉందన్నారు.

11/04/2019 - 04:32

హైదరాబాద్, నవంబర్ 3: రాష్ట్ర తాత్కాలిక సచివాలయమైన బూర్గుల రామకృష్ణారావు (బీఆర్‌కే) భవన్‌లోకి మీడియా ప్రతినిధులను అనుమతించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. బీఆర్‌కే భవన్‌లోకి సచివాలయంలోని ప్రధాన శాఖలు మారడంతో ఈ భవనానికి ప్రాధాన్యత వచ్చింది. పాత సచివాలయం నుండి కొత్త సచివాలయంలోకి కార్యాలయాలు మారినప్పటి నుండి ఈ భవనంలోకి మీడియా ప్రతినిధులను అనుమతించడం లేదు.

11/04/2019 - 04:24

గోదావరిఖని, నవంబర్ 3: ఓ పెద్దాయన... పదవీ విరమణ తర్వాత పిల్లల భవిష్యత్ కోసం ఓ స్థలం కొంటాడు... అక్కడకు ఈ భూమి మాదని ఒకడొస్తాడూ... నిలువ నీడ కోసమో... చిన్నపాటి వ్యాపారం కోసమో... కొనుగోలు చేసిన భూమిలో నిర్మాణం మొదలు పెట్టగానే అది మా తాత భూమి అంటూ కాగితం చూపిస్తాడు మరొకడు. ఒకే భూమిని ఇక్కడ పది మందికి అమ్ముతుంటారు..! రిజిస్ట్రేషన్లు కూడా చేస్తుంటారు..! ఈ ఆగడాల నేపథ్యంలో...

Pages