S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/05/2019 - 02:56

హైదరాబాద్, నవంబర్ 4: ఆర్టీసీ కార్మికులు బేషరతుగా విధుల్లో చేరాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మంగళవారం అర్ధరాత్రితో ముగుస్తుంది. విధుల్లో చేరిన కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చెప్పడంతో రాష్టవ్య్రాప్తంగా పలు డిపోల్లో కార్మికులు విధుల్లో చేరడానికి సిద్ధం అవుతున్నారు. కార్మికులు విధులకు సిద్ధం అవుతుండడంతో జేఏసీ నేతల్లో నైరాశ్యం నెలకొంది.

11/05/2019 - 02:55

హైదరాబాద్, నవంబర్ 4: ప్రపంచంలోని 13 విదేశీ భాషల అధ్యయనానికి అవసరమైన కోర్సు మెటీరియల్‌ను రూపొందించామని ఇఫ్లూ వీసీ ప్రొఫెసర్ ఈ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. ఈ మెటీరియల్‌ను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని చెప్పారు. జపాన్ లాంగ్వేజి ఎడ్యుకేషన్ ఇన్ సౌత్ ఏషియా అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన సందర్భంగా సురేష్‌కుమార్ మాట్లాడారు.

11/05/2019 - 02:06

హైదరాబాద్, నవంబర్ 4: హుజూర్‌నగర్‌లో సాధించిన విజయంతో ప్రతిపక్షాలు ఇన్నాళ్లుగా చేస్తూ వచ్చిన దుష్ప్రచారాలు, అసత్య ఆరోపణలు, లేవనెత్తిన అర్ధరహిత ప్రశ్నలకు ప్రజలే తగిన సమాధానం చెప్పారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఈ విజయం ద్వారా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై ఉన్న అచంచల విశ్వాసానికి నిదర్శనంగా నిలిచిందన్నారు.

11/05/2019 - 02:03

హైదరాబాద్, నవంబర్ 4: ఆర్టీసీ కార్మికులు మంగళవారం అర్ధరాత్రి లోగా విధుల్లో చేరకుంటే ఆ తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ వారిని ఉద్యోగంలో చేర్చుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం విధించిన గడువులోగా విధుల్లో చేరకుంటే ఆ తెల్లారో, మర్నాడో మిగిలిన 5 వేల రూట్లను కూడా ప్రైవేట్ వాహనాలకు పర్మిట్లు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.

11/05/2019 - 02:00

హైదరాబాద్, నవంబర్ 4: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ దారుణ హత్యపై విచారణ వేగవంతం చేస్తామని, డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు సేకరించి నిందితుడికి శిక్షపడేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. పట్టపగలే ఒక మహిళా ఉద్యోగినిని క్రూరంగా హత్య

11/05/2019 - 05:47

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని హత్య చేసిన సంఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లోని

11/05/2019 - 02:23

హైదరాబాద్, నవంబర్ 4: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని సజీవ దహనం చేసిన ఘటన రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రగతిభవన్‌లో ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్న సమయంలోనే ఈ ఘటనపై సీఎంవోకు సమాచారం అందింది.

11/04/2019 - 16:58

హైదరాబాద్:నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఘోరం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డిపై ఓ ఆగంతకుడు పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. భోజన విరామ సమయంలో ఆగంతుకుడు తహశీల్దార్ గదిలోకి వెళ్లాడు. అనంతరం కాసేపటికి విజయారెడ్డి మంటలతో అరుచుకుంటూ బయటకు వచ్చారు. ఆమెను కాపాడేందుకు ఇద్దరు సిబ్బంది ప్రయత్నించినా వారికి సైతం గాయాలయ్యాయి.

11/04/2019 - 04:54

గుంటూరు, నవంబర్ 3: అప్పాజోస్యుల - విష్ణ్భుట్ల కందాళం ఫౌండేషన్, కోన ప్రభాకర్‌రావు నాటక కళా పరిషత్ సంయుక్త నిర్వహణలో అజోవిభో కందాళం 27వ వార్షికోత్సవాలు వచ్చే ఏడాది జనవరి 2 నుండి 5 వరకు గుంటూరు జిల్లా బాపట్లలో నిర్వహించనున్నట్లు శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి తెలిపారు. ఆదివారం నగరంలోని ఆర్ అండ్ బీ అతిథిగృహంలో అజోవిభో కందాళం వార్షికోత్సవ వివరాలను విలేఖరులకు తెలిపారు.

11/04/2019 - 04:53

హైదరాబాద్, నవంబర్ 3: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మీడియా సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై మాట్లాడిన విధానం కార్మికుల ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా ఉందని జెఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం హైదారాబాద్‌లో జెఏసీ నేతలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు నాబిడ్డలు అంటూ సీఎం మొసలి కన్నీరు కార్చుతున్నారని వారు ఎద్దేవ చేశారు.

Pages