S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/16/2017 - 05:44

హైదరాబాద్, మే 15:ప్రభుత్వం చేస్తున్న మంచి పనులతో ఇక తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న అక్కసుతో రెచ్చిపోతే చచ్చిపోతారని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి హెచ్చరించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి సోమవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. శాంతియుతంగా ధర్నా చౌక్‌లో ధర్నా చేస్తున్న స్థానికులపై దాడులు చేయడం దారుణమని మండిపడ్డారు.

05/16/2017 - 05:43

హైదరాబాద్, మే 15: రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారు ఎకె ఖాన్, నగర శాసన సభ్యులు, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

05/16/2017 - 03:07

హైదరాబాద్, మే 15: సికిందరాబాద్ రైల్వేస్టేషన్‌లో బస్సు టర్మినెళ్లు కొత్తరూపు సంతరించుకోనున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బస్సు టర్మినెళ్లను తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రయాణికులు సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా టర్మినెళ్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ యోచిస్తోంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో ఓ కమిటీని ఇటీవలే వేసింది.

05/16/2017 - 03:05

హైదరాబాద్, మే 15: ఇంటర్మీడియట్ కోర్సును నిర్వహించే జూనియర్ కాలేజీల్లో ఆన్‌లైన్ అడ్మిషన్లు చేపట్టాలని ఎబివిపి కార్యకర్తలు సోమవారం ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడించారు. దాంతో బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. అనంతరం అరెస్టు చేసి బేగంబజార్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

05/16/2017 - 03:03

హైదరాబాద్, మే 15: తెలంగాణ రాష్ట్రంలో ఒంటరి మహిళలకు అందించే పెన్షనకు దరఖాస్తు చేసుకునేవారికి ఈ నెల 21వ తేదీ వరకు గడుపు పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అర్హులైన ప్రతిఒక్కరికి ఈ పెన్షన్ అందించే దిశగా ప్రయత్నించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

05/16/2017 - 03:02

హైదరాబాద్, మే 15: డిగ్రీ కాలేజీల్లో ఈ ఏడాది ఆన్‌లైన్ అడ్మిషన్లు చేపట్టనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ వెంకటాచలం, ప్రొఫెసర్ మల్లేశంలు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలోని 1167 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలల్లో 4.09 లక్షల సీట్ల భర్తీకి ఆన్‌లైన్ వెబ్ ఆధారిత అడ్మిషన్లకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేశామన్నారు.

05/16/2017 - 03:01

హైదరాబాద్, మే 15: అన్ని జిల్లాల్లో కెసిఆర్ కిట్ల పంపిణీకి సర్వం సిద్దం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం కెసిఆర్ కిట్లపై సచివాలయం నుంచి వీడియో కానె్ఫరెన్స్ నిర్వహించారు.

05/16/2017 - 03:01

హైదరాబాద్, మే 15: బీహార్ రాజ్‌గిర్‌లో ఏర్పాటు చేసిన నలందా విశ్వవిద్యాలయం రెండో వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ సునైనాసింగ్ సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. తొలి వైస్ ఛాన్సలర్ గోపా సబర్వాల్ పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించడంతో 200 మంది దరఖాస్తు చేశారు. వారి నుండి ఆరుగుర్ని సెర్చి కమిటీ ఇంటర్వ్యూలు చేసి ముగ్గురి పేర్లను రాష్టప్రతి ఆమోదానికి పంపించారు.

05/16/2017 - 03:00

హైదరాబాద్, మే 15: మిషన్ భగీరథ పథకం ప్రభావంపై మే 29 నుంచి ఆగస్టు 31 వరకు ఇంటింటి సర్వే జరుపుతారు. సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు డాటా విశే్లషణ చేస్తారు. నవంబర్ 1 నుంచి 30 వరకు తుది నివేదిక ఇస్తారు. 1422 గ్రామాలను సర్వే కోసం ఎంపిక చేశారు. వీటిలో 126 గ్రామాల్లో ఎస్సీ జనాభా, 320 గ్రామాల్లో ఎస్టీ జనాభా ఎక్కువగా ఉంది. పట్టణ ప్రాంతాల్లోని 480 వార్డుల్లో సర్వే చేస్తారు.

05/16/2017 - 03:00

హైదరాబాద్, మే 15: వ్యాయామ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న పిఇసెట్ వాయిదా పడింది. ఈ నెల 29 నుండి జరగాల్సిన శారీరక దారుఢ్య పరీక్షలు జూన్ 5 నుండి నిర్వహించనున్నట్టు పిఇసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వి సత్యనారాయణ తెలిపారు. వాయిదా నేపథ్యంలో దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 22 వ తేదీ వరకూ పొడిగించామని ఆయన చెప్పారు. ఆలస్య రుసుంతో జూన్ 1వ తేదీ వరకూ సమర్పించవచ్చని చెప్పారు.

Pages