S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/14/2017 - 01:10

హైదరాబాద్, మే 13: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబల్ బెడ్‌రూంల ఇళ్ల నిర్మాణం ఏడాదిలోగా పూర్తి చేయాలని భావిస్తున్నట్టు రాష్ట్ర గృహనిర్మాణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేలందరికీ శనివారం ఆయన లేఖలు రాస్తూ, డబల్ బెడ్‌రూంల నిర్మాణం పారదర్శకంగా ఉండాలని, అర్హతగలవారికే ఇవి చేరాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు భావిస్తున్నారన్నారు.

05/14/2017 - 01:09

హైదరాబాద్, మే 13: రాష్ట్రంలో రోడ్లకు సంబంధించి సరైన ప్రణాళికలు లేకపోవడం వల్ల ఏటా దాదాపు వందకోట్ల రూపాయల వరకు ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతోంది. ఒకవైపు రోడ్లు వేస్తుండగా, మరోవైపు ఆ రోడ్లను తవ్వివేస్తుండటంతో ప్రభుత్వ నిధులు వృథాఅవుతున్నాయి. అలా తవ్వడం వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. రోడ్లు సాధాణంగా మూడు రకాలుగా ఉన్నాయి. జాతీయ రహదారులు, రాష్టర్రహదారులు, పంచాయతీరోడ్లు ప్రధానమైనవి.

05/14/2017 - 01:09

హైదరాబాద్, మే 13: దేశం సంక్షోభం నుండి బయటపడాలంటే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయమే పరిష్కారమని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. ప్రభుత్వం రూ. 50 వేల కోట్లతో ప్రధాన మంత్రి కృషి సించాయి యోజనను ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ప్రతి వ్యవసాయ క్షేత్రానికి నీరు, ప్రతి నీటి బిందువుకూ అధిక పంట ఈ పథకం ఇచ్చే ఫలం అని అన్నారు.

05/14/2017 - 01:07

హైదరాబాద్, మే 13: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 15వ తేదీ నుండి నిర్వహించేందుకు బోర్డు భారీ ఏర్పాట్లు చేసింది. ఉదయం ఫస్టియర్, సాయంత్రం సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి రోజు ఉదయం 9 నుండి 12 వరకూ ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుండి 5.30 వరకూ సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తారు. మే 23 నాటికి పరీక్షలు పూర్తవుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు మే 24 నుండి 28 వరకూ నిర్వహిస్తారు.

05/14/2017 - 01:07

హైదరాబాద్, మే 13: రానున్న వర్షాకాలంలో హైదరాబాద్ నగర ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. శనివారం జిహెచ్‌ఎంసి, జలమండలి, జాతీయ రహదారులు, పోలీసు అధికారులతో మంత్రి కెటిఆర్ సమీక్షించారు. వర్షాకాలం పూర్తయ్యే వరకు జలమండలి, జిహెచ్‌ఎంసి అధికారులకు సెలవులు రద్దు చేయాలని ఆయా శాఖాధిపతులను ఆదేశించారు.

05/13/2017 - 06:16

న్యూఢిల్లీ, మే 12: కంటి ఆపరేషన్ కోసం దేశ రాజధాని ఢిల్లీకి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పంటికి రూట్ కెనాల్ చికిత్స చేయించుకుని శుక్రవారం సాయంత్రం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. దాదాపు వారం రోజుల పాటు ఢిల్లీలో గడిపిన కెసిఆర్ తన వ్యక్తిగత వైద్యుడి చేత కంటికి చికిత్స చేయించుకున్నారు. ఆయన కంటి ఆపరేషన్ కోసం ఢిల్లీకి రావటం తెలిసిందే.

05/13/2017 - 06:13

కొత్తూరు, మే 12: అతివేగమే అనర్థానికి దారితీసింది. ఐదుగురి ప్రాణాలు బలిగొంది. గురువారం అర్ధరాత్రి 12.30 సమయంలో హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్తున్న ఇండికా కారు బైపాస్ రోడ్డులో నిలిచివున్న లారీని ఢీకొంది. నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ జాతీయ రహదారి బైపాస్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఇండికాలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు.

05/13/2017 - 05:57

హైదరాబాద్, మే 12: గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ప్రతి ఏటా ఎంత ప్రచారం చేస్తున్నా ఈ ఏడాది కూడా అభ్యర్థులు అవే తప్పులు చేయడంతో దాదాపు వంద మంది వరకూ ఎమ్సెట్ పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు.

05/13/2017 - 01:16

హైదరాబాద్, మే 12: గ్యాంగ్‌స్టర్ నరుూం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న 20 మందికిపైగా పోలీసు అధికారులపై విచారణ జరిపేందుకు ఒక సీనియర్ ఐపిఎస్ అధికారిని నియమించాలని రాష్ట్ర పోలీసు శాఖ నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే సీనియర్ పోలీసు అధికారిని నియమిస్తారు. నరుూం కేసులో అవినీతితో సంబంధం ఉన్న అనుచరులపై, నరుూం ఆగడాలు, హత్యలపై సిట్ దర్యాప్తుచేస్తోంది.

05/13/2017 - 01:16

హైదరాబాద్, మే 12: విదేశాంగ శాఖ కార్యకలాపాలు, వివిధ పథకాలు, పాస్‌పోర్టు, వీసా అంశాలతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో రాష్ట్రాలకు ఉండే అనుబంధం, పరిధి, పరిమితులు తదితర అంశాలపై ‘విదేశీ సంపర్క్’ పేరిట విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం హైదరాబాద్‌లో జాతీయ సదస్సు నిర్వహించనుంది.

Pages