S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/17/2017 - 02:36

హైదరాబాద్, ఫిబ్రవరి 16: సికిందరాబాద్ మోండా మార్కెట్‌లోని ఓ ఫుట్‌పాత్ వ్యాపారిపై దాడి కేసులో ఎక్సైజ్ శాఖ మంత్రి టి పద్మారావు తనయుడు రాజేశ్వర్‌గౌడ్ సహా ఏడుగురిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 14న సికిందరాబాద్‌లోని ఫుట్‌పాత్‌పై పచ్చళ్ల వ్యాపారి రాజేష్‌పై మంత్రి కొడుకు రాజేశ్వర్‌గౌడ్, అతని అనుచరులు కలసి దాడికి పాల్పడ్డారు.

02/17/2017 - 02:35

హైదరాబాద్, ఫిబ్రవరి 16: శాసనమండలికి జరుగుతున్న ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నియోజకవర్గం ఉపాధ్యాయుల స్థానానికి యుటిఎఫ్ తన అధికార అభ్యర్ధిని ప్రకటించింది. పాపన్నగారి మాణిక్‌రెడ్డి అధికార అభ్యర్థిగా ఈ నెల 17వ తేదీ ఉదయం 11 గంటలకు తన నామినేషన్ దాఖలు చేస్తారని యుటిఎఫ్ ప్రధానకార్యదర్శి చావా రవి తెలిపారు.

02/17/2017 - 02:33

హైదరాబాద్, ఫిబ్రవరి 16: ప్రయాణికుల ఆదరణకు మెరుగైన సేవలే తార్కాణమని, ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలు అందించే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. గురువారం జోనల్ ట్రాన్స్‌పోర్ట్ అకాడమిలో మూడురోజుల పాటు జరిగిన డిపో మేనేజర్ల పునశ్చరణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.

02/17/2017 - 02:33

హైదరాబాద్, ఫిబ్రవరి 16: బాలీవుడ్‌కు చెందిన జాక్విలిన్ ఫెర్నాండెజ్‌ను తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసినట్లు 128సంవత్సరాలుగా అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో పేరున్న లీ జీన్స్ సంస్ధ ప్రకటించింది. భారతీయ మహిళల కోసం లీ రూపొందించిన అత్యాధునిక ఆవిష్కరణ బాడీ ఆప్టిక్స్‌ను జాక్విలిన్ ఫెర్నాండెజ్ ద్వారా ప్రచారం చేయనున్నట్లు లీ జీన్స్ జనరల్ మేనేజర్ షరత్ వాలియా తెలిపారు.

02/17/2017 - 02:32

హైదరాబాద్, ఫిబ్రవరి 16: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా ఎ.వాణిప్రసాద్ నియమితులయ్యారు. గురువారం సర్వీస్ కమిషన్ కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌గా పని చేస్తున్న వాణి ప్రసాద్‌ను గత కొంత కాలంగా ఖాళీగా ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పోస్టుకు ప్రభుత్వం బదిలీ చేసింది.గతంలో సాంకేతిక విద్య కమిషనర్‌గా కూడా పని చేశారు.

02/17/2017 - 02:31

హైదరాబాద్, ఫిబ్రవరి 16: రెండు తరాలు పోరాటం చేసి అలసిపోయి నిరాశ నిస్పృహలో ఉన్న తెలంగాణ సమాజానికి విశ్వాసం కలిగించిన వ్యక్తి కెసిఆర్ అని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఉద్యమపార్టీ అయినప్పటికీ పాలనలో పట్టు సాధించి కెసిఆర్ చతురత, నైపుణ్యంతో విజయం సాధించారని అన్నారు. దీంతో దేశానికే పోరాట స్ఫూర్తిని నేర్పిన నేల తెలంగాణ అని ఈటెల పేర్కొన్నారు.

02/17/2017 - 02:31

హైదరాబాద్, ఫిబ్రవరి 16: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఓ దుండగుడి కాల్పుల్లో తెలుగు విద్యార్థి వంశీ మామిడాల మృత్యువాత పడటంపై కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విదేశాల్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు అక్కడ దురాగతాలకు గురై ప్రాణాలను కోల్పోవడం మనసు కలచివేసిందని అన్నారు.

02/16/2017 - 04:35

హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ కెవి రమణాచారి తెలిపారు. రాజ్యాంగం పరిధిలో ఎవరికీ ఇబ్బంది లేకుండా పేద బ్రాహ్మణ పిల్లల విద్య, పెళ్లిళ్లు ఇతర సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టనున్నట్లు తెలిపారు. బ్రాహ్మణులు, అర్చకుల జీవన స్థితిగతులను మెరుగుపరచేందుకు ముఖ్యమంత్రి కె.

02/16/2017 - 04:29

హైదరాబాద్, ఫిబ్రవరి 15: నీటి ప్రాజెక్టుల నిర్మాణం పేరిట ప్రజాధనం దోపిడీకి గురవుతున్నదని వామపక్షాలు, విప్లవ రచయితల సంఘం, తెలంగాణ జల సాధన సమితి, తదితర ప్రజా సంఘాలు మండిపడ్డాయి. బుధవారం మేధావులు, వివిధ ప్రజా సంఘాల నేతలు మఖ్దూం భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండ రామ్ ప్రసంగిస్తూ కాళేశ్వరం కంటే తుమ్మిడిహెట్టే అన్ని విధాల మేలని అన్నారు.

02/16/2017 - 04:29

సిద్దిపేట, ఫిబ్రవరి 15 : రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పిన సిఎం కెసిఆర్...బొందల గడ్డగా మార్చారని తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నదాతల ఆత్మహత్యల్లో రాష్ట్రం రెండోస్థానంలో నిలిచిందన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను మూడేళ్ల కెసిఆర్ పాలనలో 1.07 లక్షల అప్పుల రాష్ట్రంగా మార్చారని దుయ్యపట్టారు.

Pages