S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/10/2020 - 06:13

హైదరాబాద్, ఫిబ్రవరి 9: తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీవోఏ) ఎన్నికల్లో అధ్యక్షునిగా రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ విజయం సాధించారు. 13 ఓట్ల మెజారిటీతో రంగారావుపై జయేష్‌రంజన్ గెలిచారు. జయేష్ రంజన్‌కు 46 ఓట్లు లభించగా, రంగారావుకు 33 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో కే.రంగారావు, కే.జగదీశ్వర్ యాదవ్ ప్యానెల్ అధికంగా స్థానాలు గెలుచుకుని ఘనవిజయం సాధించింది.

02/10/2020 - 06:07

హైదరాబాద్: విత్తనోత్పత్తిలో భారతదేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని, విదేశాలకు నాణ్యమైన ఎగుమతులు చేస్తోందని తెలంగాణ రాష్ట్ర విత్తన సంస్థ డైరెక్టర్ డాక్టర్ కే. కేశవులు తెలిపారు.

02/10/2020 - 06:08

హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌కి సినీ హీరోయిన్లు స్పందించారు. ఆదివారం హైదరాబాద్‌లో హీరోయిన్లు కీర్తి సురేష్ (మహా నటి ఫేమ్), కౌసల్య మొక్కలు నాటారు. వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్ సూరారంలోని టెక్ మహేందర్ కశాశాల ఆవరణలో కీర్తి సురేష్ మొక్కలు నాటారు.

02/10/2020 - 01:18

హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్‌లు, కలెక్టర్లను ఇటీవల భారీ ఎత్తున బదిలీలు చేసిన రాష్ట్ర ప్రభు త్వం తాజాగా ఆదివారం అన్ని జిల్లాలకు అదనపు కలెక్టర్లతో పాటు స్థానిక సంస్థలకు అదనపు కలెక్టర్లుగా నియమించింది. వీరిలో చాలామంది అధికారులు ప్రస్తుతం జాయింట్ కలెక్టర్లుగా, జిల్లా రెవెన్యూ అధికారులుగా పనిచేస్తుండగా వారిని అదనపు కలెక్టర్లుగా నియమించింది.

02/10/2020 - 01:17

హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ న్యాయాలయాల వ్యవస్థకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలిదశలో భాగంగా 33 జిల్లాల్లో 55 గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేయనుంది. గ్రామన్యాయాలయాల చట్టం 2008లో వచ్చింది. సుప్రీంకోర్టు కూడా అనేకసార్లు ఈ చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించింది. కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ చట్టం అమలులో ఉంది.

02/10/2020 - 01:15

హైదరాబాద్, ఫిబ్రవరి 9: మెట్రో రైలు ప్రాజెక్టును హైదరాబాద్ పాతబస్తీతో అనుసంధానం చేయనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సంబంధిత అధికారులతో సమావేశమై త్వరలోనే పనులు ప్రారంభించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ మేరకు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి సీఎం వివరించారు.

02/09/2020 - 06:14

హైదరాబాద్, ఫిబ్రవరి 8: తెలంగాణ బ్లాక్ చైన్ ప్రాజెక్టు టీ చిట్స్ ఈ- గవర్నెన్స్ విభాగానికి కొత్త టెక్నాలజీని అందించి విజయవంతంగా అమలు చేస్తున్నందుకు ఉత్తమ్ గోల్డ్ అవార్డుకు ఎంపికైంది. ముంబయిలో శనివారం జరిగిన 23వ నేషనల్ కాన్ఫరెన్స్ ఈ-గవర్నెన్స్‌లో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డును కేంద్రమంత్రి చేతుల మీదుగా ఐటీ శాఖ అధికారులు అందుకున్నారు.

02/09/2020 - 06:12

హైదరాబాద్, ఫిబ్రవరి 8: గత ఐదేళ్లలో సింగరేణి సంస్థ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అమ్మకాలు, లాభాల్లో అత్యధిక వృద్ధి రేటును సాధించడానికి కృషి చేసిన సంస్థ సీఎండీ శ్రీ్ధర్ అవార్డుల పంట పండింది. ప్రముఖ ఏషియా వన్ మ్యాగ్‌జైన్ ఆధ్వర్యంలో బ్యాంకాక్ (్థయ్‌లాండ్)లో జరిగిన కార్యక్రమంలో శ్రీ్ధర్ భారతీయ మహంతం పురస్కార్ అవార్డు అందుకున్నారు.

02/09/2020 - 06:11

హైదరాబాద్, ఫిబ్రవరి 8: హైదరాబాద్ మెట్రో చార్జీలు తగ్గించాలని టీఎస్ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంధ్రశేఖర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

02/09/2020 - 06:10

హైదరాబాద్, ఫిబ్రవరి 8: ఉస్మానియా యూనివర్శిటీ ప్రకటించిన యుజీ సెమిస్టర్ ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని వారు ఆరోపించారు. పరీక్షలు రాసినా రాయలేదని, పరీక్షలు బాగా రాసిన వారి ఫలితాలు కూడా గల్లంతయ్యాయని, చాలా తక్కువ మార్కులు వచ్చాయని వారు పేర్కొంటున్నారు.

Pages