S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/07/2020 - 01:28

సికిందరాబాద్, ఫిబ్రవరి 6: గాంధీ అసుపత్రిలో కరోనా ఆనుమాణిత లక్షణాలతో 11మందికి వ్యాధి నిర్దారణ నిమిత్తం వైద్య పరీక్షలు చేయటంతో పాటు, అవరమైన చికిత్సను అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రావణ్ కుమార్ తెలిపారు.

02/07/2020 - 06:28

హైదరాబాద్, ఫిబ్రవరి 6: ప్రజలే కేంద్రంగా పురపాలన జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. పట్టణ ప్రజలతో పురపాలక శాఖాధికారులు మమేకం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అందాల్సిన పౌర సేవలు అత్యంత పారదర్శకంగా, అవినీతిరహితంగా వేగవంతంగా అందించాలనే లక్ష్యంతోనే కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకవచ్చామని అన్నారు.

02/07/2020 - 06:26

మేడారం, ఫిబ్రవరి 6: తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధికెక్కిన మేడారం మహాజాతరలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. గురువారం చిలకలగుట్ట నుండి సమ్మక్క తల్లి మేడారం గద్దెకు చేరడంతో జాతర మహా సంబరం అంబరాన్ని తాకింది. ప్రతి రెండేళ్లకోమారు మాఘ శుద్ధ పౌర్ణమి రోజున జాతరను పురస్కరించుకొని సమ్మక్క తల్లి గద్దెకు చేరడం ఆనవాయితీగా వస్తోంది.

02/06/2020 - 23:17

మేడారం ఆంధభూమి బృందం, ఫిబ్రవరి 6: మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రానుండడంతో మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, ఈటల రాజేందర్, ఎంపీ మాలోతు కవిత, ములుగు జడ్పీ చైర్‌పర్సర్మన్ కుసుమ జగదీశ్ అధికారులతో సమాలోచనలు జరిపారు.

02/06/2020 - 23:14

నల్లగొండ, ఫిబ్రవరి 6: అభం శుభం తెలియని ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి హతమార్చిన కిరాతక సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్‌రెడ్డికి సరైన శిక్ష పడిందన్న భావన ప్రజలు, బాధిత కుటుంబాలు, మహిళ, ప్రజా సంఘాల నుండి వ్యక్తమైంది. బస్సు సౌకర్యం లేని హాజీపూర్ గ్రామానికి చెందిన విద్యార్థినులు శ్రావణి, మనీషా, కల్పనలను మండల కేంద్రం బొమ్మలరామారం నుండి తమ గ్రామానికి మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సివుంది.

02/06/2020 - 21:49

హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో ఐఎఎస్‌లకు పోస్టింగ్‌లు ఇవ్వడంలో అన్యాయం జరుగుతోందని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల బదిలీ అయిన 20 మంది బీసీ వర్గాలకు చెందిన ఐఎఎస్‌లకు ప్రాధాన్యత లేని పోస్టింగ్‌లు ఇచ్చారని ఆయన విమర్శించారు. బీసీలను పూర్తిగా విస్మరించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

02/06/2020 - 21:48

హైదరాబాద్, ఫిబ్రవరి 5: కొత్త రెవెన్యూ చట్టాల అమలుపై అఖిల పక్ష పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత సమర సింహారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ రెడ్డి రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఇక్కడ వారు గాంధీభవన్‌లో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, రెవెన్యూ చట్టాలు మారిస్తే అవి ప్రజలకు మరింత మేలు చేయాలన్నారు.

02/06/2020 - 21:47

హైదరాబాద్, ఫిబ్రవరి 5: పసుపు బోర్డు మంజూరైనట్టు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రకటనలు చేశారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. వాస్తవానికి మంజురైంది పసుపు బోర్డు కాదని, అది సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయం అన్నారు.

02/06/2020 - 21:46

హైదరాబాద్: తెలంగాణలో భూగర్భ జలాలు గతంతో పోలిస్తే ఈసారి మెరుగ్గా కనిపిస్తున్నాయ. ఈ ఏడాది జనవరి వరకు నమోదైన వివరాలను విశే్లషిస్తే 852 మి.మీ సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా 14 శాతం అదనంగా వర్షపాతం నమోదైంది. దాదాపు 971 మి.మీ వర్షపాతం జనవరి నెల వరకు నమోదైంది.

02/06/2020 - 06:18

హైదరాబాద్, ఫిబ్రవరి 5: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు అవసరమైన మేరకు నిధులు ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మన్ జి. రాజేశంగౌడ్ తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లతో బుధవారం ఆయన బేగంపేటలోని హోటల్ ప్లాజాలో సమావేశమయ్యారు.

Pages