S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/11/2020 - 05:09

హైదరాబాద్, ఫిబ్రవరి 10: తన ఫొటో మార్ఫింగ్ చేయడమే కాకుండా, తన భర్తపై ట్విట్టర్‌లో అసభ్యకర పోస్టు పెట్టారని పేర్కొంటూ ప్రముఖ టీవీ యాంకర్, నటి అనసూయ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. అనసూయ లఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు.

02/11/2020 - 05:09

మేళ్లచెర్వు, ఫిబ్రవరి 10: సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పలు గ్రామాల్లో సంభవిస్తున్న వరుస భూకంపాలతో ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా ఆదివారం రాత్రి భూప్రకంపనలు చింతలపాలెం, మేళ్లచెర్వు మండలాల్లో చోటుచేసుకోవడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రిక్టర్‌స్కేలుపై 3.3 భూకంప తీవ్రత నమోదైనట్టు తహశీల్దార్ కమలాకర్ తెలిపారు.

02/11/2020 - 05:08

సికిందరాబాద్, ఫిబ్రవరి 10: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా అనుమానిత లక్షణాల వ్యక్తులకు నిర్వహించిన వైద్య పరీక్షలకు సంబంధించి లీకులిచ్చి, ప్రజల్లో లేనిపోని భయాన్ని సృష్టించాడంటూ గాంధీ ఆసుపత్రి వైద్యుడికి అధికారులు వేటు వేశారు.

02/11/2020 - 01:09

హైదరాబాద్, ఫిబ్రవరి 10: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని వివిధ కేసులను ఎదుర్కొంటున్న ఉద్యమకారులను ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. నియోజకవర్గాల వారీగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి ఎంపిక చేసే బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించింది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేల నుంచి అందిన ఉద్యమకారుల జాబితాకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరయ్యాయి.

02/11/2020 - 01:06

హైదరాబాద్, ఫిబ్రవరి 10: ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మంగళవారం నిర్వహించే జిల్లా కలెక్టర్ల సమావేశానికి ప్రగతిభవన్ సిద్ధమైంది. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. సమావేశం అజెండాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తొలుత చదివి వినిపిస్తారు. ఇప్పటికే అజెండా అంశాలను కలెక్టర్లకు పంపించారు. దాని ఆధారంగానే వారు అవసరమైన సమాచారంతో రానున్నారు.

02/10/2020 - 06:43

హైదరాబాద్, ఫిబ్రవరి 9: తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు 12 ఏళ్ల కిందటనే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నారు. ఆలనాటి తన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ దొరికిందని కేటీఆర్ ట్విట్టర్‌లో ఆదివారం పోస్ట్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1998 సంవత్సరంలో పొందిన డ్రైవింగ్ లైసెన్స్ కాపిని కూడా ట్విట్టర్‌లో కేటీఆర్ పంచుకున్నారు.

02/10/2020 - 06:41

హైదరాబాద్, ఫిబ్రవరి 9: శాసనసభ ఆవరణలో ఏర్పాటు చేసిన తన చాంబర్‌లో ప్రభుత్వ విప్‌గా నియామకమైన కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్ ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు బీబీ పాటిల్, శాసనసభ కార్యదర్శి వేదాంతం నరసింహాచార్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

02/10/2020 - 06:35

వరంగల్: అమ్మవార్లు వనంలోకి వెళ్లినా భక్తుల హోరు ఏమాత్రం తగ్గలేదు. ఆదివారం సెలవుదినం కావడంతో లక్షలాది మంది భక్తులు జాతరకు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు.

02/10/2020 - 06:17

హైదరాబాద్, ఫిబ్రవరి 9: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం సమావేశమైన సమాచార హక్కు చట్టం కమిషనర్ల ఎంపికకు ఏర్పాటైన సెర్చ్ కమిటీ ఐదుగురిని ఎంపిక చేసినట్టు తెలిసింది. సెర్చ్ కమిటీ ఎంపిక చేసిన కమిషనర్ల నియామకాలను గవర్నర్ తమిళిసై ఆమోదం లభించాక అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..

02/10/2020 - 06:16

హైదరాబాద్, ఫిబ్రవరి 9: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆదివారం నిర్వహించిన ప్రాక్టికల్స్ పరీక్షలకు 22,972 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమై ఆదివారం వరకు తొమ్మిదిరోజులైంది. ఈ పరీక్షలకు మొత్తం 23,971 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోగా 22,972 మంది హాజరయ్యారు.

Pages