S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/09/2020 - 05:57

వరంగల్, ఫిబ్రవరి 8: ఆసియాలోనే గిరిజన జాతరైన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర శనివారం విజయవంతంగా ముగిసింది. దీంతో పోలీసు అధికారులు ప్రశాంతంగా ఊపరి పీల్చుకున్నారు.

02/09/2020 - 05:54

హైదరాబాద్, ఫిబ్రవరి 8: మహానగరవాసులకు ముఖ్యమైన, అత్యవసరమైన సేవలను అందించే జీహెచ్‌ఎంసీ అభివృద్ధి పనులు, పరిపాలన వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించే కౌన్సిల్ సమావేశంలో ఈసారి ‘పౌర’ చట్టంపై రగడ చోటుచేసుకుంది.

02/09/2020 - 04:51

కేసముద్రం/ ఏటూరునాగారం, ఫిబ్రవరి 8: మేడారాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ప్రశాంతంగా జాతర జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం భక్తులను తడిసి ముద్దచేసింది. లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకొని ఇంటి ముఖం పట్టే సమయంలోనే వర్షం రావడంతో భక్తజనం చెల్లాచెదురయ్యారు. అదే విధంగా అమ్మవార్ల వనప్రవేశానికి కూడా భారీ వర్షం ఆటంకంగా నిలిచింది.

02/09/2020 - 01:25

హైదరాబాద్: మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి న ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు శనివారం సంతకం చేశారు. రాష్ట్ర కేబినెట్ హోదా కలిగిన ఈ పదవిలో సుధీర్‌రెడ్డి మూడేళ్లపాటు కొనసాగుతారు. సుధీర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఎల్‌బీనగర్ ఎమ్మెల్యేగా గెలిచారు.

02/09/2020 - 01:21

వరంగల్, ఫిబ్రవరి 8: తెలంగాణ మహా కుంభమేళా శనివారం రాత్రితో ముగిసింది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తల్లులు గద్దెపైకి చేరి మళ్లీ వనంప్రవేశం జరిగే వరకు కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు నాలుగు రోజుల పాటు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు.

02/09/2020 - 05:33

హైదరాబాద్: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు రాష్ట్ర పరిపాలనను కొంతపుంతలు తొక్కించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 11న జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతిభవన్‌లో ఆరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశం సాయంత్రం వరకు కొనసాగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

02/07/2020 - 06:22

కీకారణ్యం కాస్తా జనారణ్యంగా మారిపోయంది. మహాజాతరలో మరో ఘట్టం ఆవిష్కృతమైంది.. తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతికెక్కిన మేడారం జాతరలో భాగంగా బుధవారం సారలమ్మ గద్దెపైకి రాగా.. గురువారం రాత్రి 9:10 గంటలకు సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకొంది. సమ్మక్క వేదికపైకి చేరుకొనే వేళ.. ఇసుకేస్తే రాలనంతగా ఉన్న భక్తుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయ.

02/07/2020 - 01:33

హైదరాబాద్, ఫిబ్రవరి 6: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రణాళిక ప్రకారం కారిడార్-2ను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్భాటం చేస్తున్నారని ఎఐసీసీ అధికార ప్రతినిధి జీ నిరంజన్ ధ్వజమెత్తారు. రెండో కారిడార్ జూబ్లీ బస్టాండ్ నుంచి ఫలకునుమా వరకు ఉండాలన్నారు. కాని దీన్ని టీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీ నేతలు అడ్డుకున్నారన్నారు. గతంలో మెట్రో కారిడార్-2లో పనులు జరగకుండా ప్రభుత్వం తరఫున అడ్డంకులు సృష్టించారన్నారు.

02/07/2020 - 01:32

హైదరాబాద్, ఫిబ్రవరి 6: తెలంగాణ న్యాయ నియామకాల్లో దివ్యాచంగులైన అభ్యర్ధులకు పరీక్ష ఫీజు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ కార్యదర్శికి యువ న్యాయవాదుల జాక్ కన్వీనర్ పొన్నం రవీందర్ వినతిపత్రాన్ని అందజేశారలు.

02/07/2020 - 01:29

హైదరాబాద్, ఫిబ్రవరి 6: వచ్చే పక్షం రోజుల్లో రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలోప్రవేశపెట్టేందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో నిధుల సమీకరణపై దృష్టిని సారించింది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధిరేటు 21 శాతం నుంచి తగ్గుమముఖం పట్టనుండడంతో, ఆ మేరకు నిధుల లోటును భర్తీ చేసే విషయమై ప్రభుత్వం అనేక మార్గాలను ఆనే్వషిస్తోంది.

Pages