S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/06/2020 - 06:16

హైదరాబాద్, ఫిబ్రవరి 5: రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ను కోరారు. ఈ మేరకు సంఘాల ప్రతినిథులు ఆమెకు ఒక వినతి పత్రాన్ని అందజేశారు. గత ఐదేళ్లలో విద్యామంత్రులు మారిపోయారని, అధికారులు మారిపోతున్నారని టీచర్ల సమస్యలు మాత్రం మారడం లేదని వారు వాపోయారు.

02/06/2020 - 05:39

హైదరాబాద్, ఫిబ్రవరి 5: ఎయిరిండియా ప్రైవేటీకరణపై దేశవ్యాప్త ఉద్యమానికి త్వరలో ముంబైలో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్టు ఎయిరిండియా ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు సుధాకర్ తెలిపారు.

02/06/2020 - 05:35

హైదరాబాద్, ఫిబ్రవరి 5: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలకు అనుగుణంగా జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్నట్టు తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి జీవీ సుబ్రహ్మణ్యం తెలిపారు. తెలంగాణ లోని అన్ని జిల్లా, మండల స్థాయిలో లోక్ అదాలత్‌లను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది జరుగుతున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఇది మొదటిదని అన్నారు.

02/06/2020 - 05:34

హైదరాబాద్, ఫిబ్రవరి 5: విత్తనాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం కొత్త పుంతలు తొక్కుతోందని, దేశ విదేశాలకు నాణ్యమైన విత్తనాలను ఎగుమతి చేస్తోందని, దీన్ని మరింత సమర్థతగా ముందుకు తీసుకువెళ్లేందుకు సహకరించాలంటూ ఐక్య రాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ) అధికారులను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కే. కేశవులు కోరారు.

02/06/2020 - 05:33

హైదరాబాద్, ఫిబ్రవరి 5: రాష్ట్రంలో పశుసంపద పెరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పేర్కొన్నారు. పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన అధర్ సిన్హా బుధవారం మంత్రి తలసానిని మర్యాదపూర్వకంగా కలిశారు.

02/06/2020 - 05:33

హైదరాబాద్, ఫిబ్రవరి 5: ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర , ఆదివాసీల పండుగ, 8 రాష్ట్రాల ప్రజలు కొలుచుకునే మేడారం జాతరకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఆరోపించారు.

02/06/2020 - 05:32

హైదరాబాద్, ఫిబ్రవరి 5: కేంద్ర ప్రభుత్వంతో దేశానికి ముప్పు, ప్రమాదం పొంచి ఉందని ప్రజాస్వామ్యానికే తిలోదకాలు ఇచ్చే పరిస్థితిని కేంద్రం తీసుకువస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే పూర్తిగా కార్పొరేట్ అనుకూలంగా ఉందని, పేదలకు తీవ్ర వ్యతిరేకంగా ఉందని చెప్పారు. బుధవారం నాడు ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు.

02/06/2020 - 05:31

హైదరాబాద్, ఫిబ్రవరి 5: ఫార్మా సిటీ భూ ఆక్రమణలపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన కేంద్రవాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఫార్మా సిటీలో అవకతవకలు జరిగాయని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. వేల ఎకరాల భూ దందా చేస్తున్నారన్నారు.

02/06/2020 - 01:18

మేడారం: మేడారం మహాఘట్టం ప్రారంభమైంది. కనె్నపల్లి నుండి బుధవారం రాత్రి మేడారం గద్దెకు సారలమ్మ తల్లిని చేర్చడంతో జాతరలో తొలి ఘట్టం ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం కనె్నపల్లి ఆలయంలో గిరిజన సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

02/06/2020 - 01:17

మేడారం ఆంధ్రభూమి బృందం, ఫిబ్రవరి 5: మేడారం మహాజాతర ప్రారంభ మైంది. రాష్ట్రం నుంచే కాక, పలు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు లక్షలాది గా తరలివచ్చారు. బుధవారం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఆగమనంతో మేడారం జాతర కోలాహలంగా ప్రారంభమైంది. జంపన్నవాగు, కనె్నపల్లి, ఊరట్టం, ఎలుబాక, కొత్తూరు, రెడ్డిగూడెం ప్రాంతాలన్నీ భక్తుల గుడారాలతో నిండిపోయాయి.

Pages