S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/25/2018 - 03:46

హైదరాబాద్, ఆగస్టు 24: హైదరాబాద్ మెట్రో డవలప్‌మెంట్ అథారటి పరిధిలోని అర్బన్ ఫారెస్టుల టెండర్ల ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో హెచ్‌ఎండీఏ పరిధిలోని అటవీ పార్కుల అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

08/25/2018 - 03:46

హైదరాబాద్, ఆగస్ట 24: తెలంగాణ రాష్ట్రంలో పరిహార అడవుల పెంపకానికి గాను కేంద్రం కాంపా నిధులను రూ.237 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రంలో అడవుల సంరక్షణ, పెంపాకిని జరుగుతున్న చర్యలకు కేంద్రం ప్రసంశించింది. హరితహారంలో భాగంగా అడవుల పునరుద్ధరణకు భారీ ఎత్తున కార్యక్రమాలు కొనసాగుతున్నాయని భావించిన కేంద్రం ప్రపాదిత 225 కోట్లతో పాటు గత ఏడాది రూ. 12 కోట్లను కలిపి విడుదల చేసింది.

08/25/2018 - 03:45

హైదరాబాద్, ఆగస్టు 24: ప్రకృతి విలయానికి చిగురుటాకులా వణికిన కేరళాను ఆదుకునేందుకు అటవీ శాఖ అధికారులు ముందుకు వచ్చారు. తమ వంతుగా కేరళా రాష్ట్రానికి రూ.2,28,750 చెక్కును

08/25/2018 - 03:44

హైదరాబాద్, ఆగస్టు 24: రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా టీఆర్‌ఎస్ నేత దేవర మల్లప్పను ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నియమించారు. అదేవిధంగా రాష్ట్ర కో-ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ చైర్మన్‌గా గట్టు తిమ్మప్పను, సంగీత నాటక అకాడమీ చైర్మన్‌గా బాద్మి శివకుమార్‌ను నియమించారు. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు.

08/25/2018 - 03:43

హైదరాబాద్, ఆగస్టు 24: వరదలతో చిన్నభిన్నం అయిన కేరళ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మనవరాళ్లు ముందుకు వచ్చారు. ప్రకృతి అందాలకు నెలవైన కేరళ వర్షాలతో అల్లాడి పోవడం ఆ చిన్నారులను ఎంతగానో కలిచి వేసింది. అందరిలా కాకుండా వెంటనే తాము కూడా ఎంతో కొంత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా తాము దాచుకున్న 2,080, పలువురి వద్ద రూ.13,500 వసూలు చేశారు.

08/25/2018 - 03:42

హైదరాబాద్, ఆగస్టు 24: వెనుకబడన వర్గాల ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం వరంగల్ కాకతీయ వర్సిటీ ఆడిటోరింలో మహాసభను ఏర్పాటు చేస్తున్నట్లు బిసి సంఘం వెల్లడించింది. ఈ మేరకు బిసి జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ విద్య, ఉద్యోగాలపై ఉన్న క్రిమీలేయర్‌ను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.

08/25/2018 - 03:38

కేరళ వరద బాధితుల సహాయార్థం ఒక నెల వేతనం చెక్కును
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రగతి భవన్‌లో అందజేస్తున్న రాష్ట్ర ఎమ్మెల్సీలు

08/25/2018 - 03:36

హైదరాబాద్, ఆగస్టు 24: మాజీ ప్రధాని వాజ్‌పేయి చితాభస్మంతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్‌కుమార్ అంజన్ ధ్వజమెత్తారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో రెండు రోజుల పాటు జరగనున్న కౌన్సిల్ సమావేశాలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.

08/25/2018 - 03:30

హైదరాబాద్, ఆగస్టు 24: ‘సీఎం కేసీఆర్ పరిణితి చెందిన నాయకుడని సాక్ష్యాత్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే ప్రశంసించారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా పరిపాలనా సాగుతోంది’ అని ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. నాలుగేండ్లలో సాధించిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు ప్రగతి నివేదన సభ ఏర్పాటు చేసామన్నారు.

08/24/2018 - 23:40

కరీంనగర్, ఆగస్టు 24: అన్ని ప్రాథమిక ఆరో గ్య కేంద్రాల (పీహెచ్‌సీ)లో ప్రసవాల సంఖ్య పెంచాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ మెడికల్ ఆఫీసర్లను ఆదేశించారు. అన్ని పీహీచ్‌సీల పరిధిలో గర్భిణులందరినీ నమోదు చేయించాలని, వారికి 7వ నెల నుంచి ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు.

Pages