S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/26/2018 - 03:51

హైదరాబాద్, ఆగస్టు 25: తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం బహుల ప్రయోజనాల కోసం సమగ్ర కుటుంబ సర్వేలో వెనుకబడిన కులాల జనగణ వాటా ఎంతో తేల్చాలని తెలంగాణ బిసి సంక్షేమ అసోషియేషన్ ప్రెసిడెంట్ ఎర్రా సత్యనారాయణ డిమాండ్ చేశారు. బిసిలకు సూచిస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు కేటాయిస్తున్న నిధులను కుదింపునకు ప్రభుత్వం వౌలిక ఆదేశాలు ఇవ్వడంపై సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది.

08/26/2018 - 03:51

హైదరాబాద్, ఆగస్టు 25: పేదల పక్షాన పోరాడుతున్న సీపీఐ (ఎంఎల్) నేతలపై అక్రమ కేసులు బనాయించి, కోర్టుల చుట్టూతిప్పుతూ ఉద్యమ కారులపై కక్ష్యసాధింపు చర్యులకు ప్రభుత్వం పాల్పడుతోందని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఉద్యమకారుల చేతులకు సంకెళ్ళు వేయడం అనాగరిక సామాజాన్ని గుర్తు చేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

08/26/2018 - 03:50

హైదరాబాద్, ఆగస్టు 25: రాష్ట్ర ప్రభుత్వం 2018-19 విద్యా సంవత్సరం మెడికల్ కౌన్సిలింగ్‌లో 550 జివోను అమలు చేయడంలో జరిగిన తప్పిదాలపై తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును యథావిధిగా అమలు చేయాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి, ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.

08/25/2018 - 04:00

ముందస్తు లేదు ఏమీ లేదు అంతా ఉత్తదే.

08/25/2018 - 03:55

హైదరాబాద్, ఆగస్టు 24: దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కులానికి ఆత్మగౌరవ భవనాలను నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కుల భవనాల నిర్మాణాల కోసం నగర శివార్లలోని కోకపేట, ఘట్‌కేసర్, మేడిపల్లి, మేడ్చల్ అబ్దుల్లాపూర్ మెట్, ఇంజాపూర్ ప్రాంతాల్లో స్థలాలను గుర్తించినట్టు తెలిపారు.

08/25/2018 - 03:53

హైదరాబాద్, ఆగస్టు 24: విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలను సాధించుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ట్రస్ట్భ్‌వన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

08/25/2018 - 04:17

హైదరాబాద్/ అల్వాల్: అయోద్యలో రామ మందిరం నిర్మాణానికి హిందులు అందరు ఐక్యంగా తరలి రావాలని విశ్వహిందు పరిషత్ జాతీయ అధ్యక్షులు మాజి గవర్నర్ విష్ణు సదాశివ కోజి కోరారు. శుక్రవారం కంటోనె్మంట్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి విశ్వహిందు పరిషత్ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గోని మాట్లాడారు. హిందువులలో అనఐక్య వల్లనే అడ్డంకులు వస్తున్నాయనీ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

08/25/2018 - 03:49

హైదరాబాద్, ఆగస్టు 24: భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి అస్థికల నిమజ్జన యాత్ర శనివారం నాడు ఆలంపూర్‌కు బయలుదేరనుంది. ఈ యాత్రకు జీ కిషన్‌రెడ్డి ఇన్‌చార్జిగా ఉంటారు. ప్రధానకార్యదర్శి టీ ఆచారి సంయోజకులుగా, బీ శాంతికుమార్, నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి , సీహెచ్ స్వామిగౌడ్‌లు సహ సంయోజకులుగా ఉంటారు. ఉదయం 7 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి అస్థికల నిమజ్జన యాత్ర ప్రారంభం అవుతుంది.

08/25/2018 - 03:48

హైదరాబాద్, ఆగస్టు 24: ముందస్తు ఎన్నికలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యంపైనా, ఆస్పత్రుల నిర్వహణపైనా లేదని బీజేపీ అధికార ప్రతినిధి రావుల శ్రీ్ధర్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు.

08/25/2018 - 03:48

హైదరాబాద్, ఆగస్టు 24: అంతర్జాతీయ స్థాయిలో న్యాయమైన ట్రేడింగ్ వ్యాపార విభాగంలో సభ్యులుగా చేరండి, అందులో వచ్చే లాభాల్లో ఎక్కువ శాతం వాటా దక్కించుకోవచ్చునని నమ్మిస్తూ కోట్ల రూపాయలను వసూళ్ళు చేస్తున్న కాయినెక్స ట్రేడింగ్ డాట్‌కమ్ గుట్టును పోలీసులు రట్టు చేశారు.

Pages