S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పాట్ లైట్

07/11/2017 - 23:39

పర్యావరణ సమతూకాన్ని కబళిస్తూ వాతావరణ మార్పులను నిరోధించే లక్ష్యం దిశగా పారిశ్రామిక దేశాలు ముక్తకంఠంతో ముందడుగు వేశాయి.

07/04/2017 - 22:33

అల్‌ఖైదా తర్వాత ప్రపంచ దేశాల్ని వణికించిన ఇస్లామిక్ తీవ్రాద సంస్థ ఐసిస్ అంతమైనట్టేనా?మూడేళ్ల క్రితం జూలైలోనే ఐసిస్ నేత అబూ బకర్ అల్-బాగ్దాదీ తననుతాను ఖలీఫాగా ప్రకటించుకున్న మొసూల్‌లోని అల్‌నూరి మసీదును ఇరాకీ దళాలు హస్తగతం చేసుకోవడంతోనే ఈ భయానక తీవ్రవాద సంస్థ పట్టు సడలినట్టేనా? అల్‌ఖైదా సృష్టించిన బీభత్సం కంటే ఎన్నో రెట్లు భయానక వాతావరణాన్ని ఐసిస్ రేకెత్తించింది.

07/04/2017 - 22:29

అవకాశం వస్తే వివాదాన్ని రగిలించడంలో చైనాకు చైనానే సాటి. 1960వ దశకంలో జరిగిన యుద్ధాన్ని తరచూ పావుగా వాడుకుంటూ అరుణాచల్‌పై భారత్‌ను యాగీ చేస్తూ వచ్చిన చైనా ఇప్పుడు భూటాన్ మెలికతో మరో వివాదాన్ని రేపింది. భూటాన్ మీదుగా ఓ రహదారిని నిర్మిస్తూ కవ్వింపుచర్చలకు పాల్పడింది. డోకో-లా ట్రై జంక్షన్‌గా పేర్కొనే ఈ ప్రాంతంలో చైనా చేపట్టిన ఈ చర్యలను భారత్ తీవ్రంగానే వ్యతిరేకించింది.

07/04/2017 - 22:23

బహుశా ఇప్పటి వరకూ వచ్చిన అమెరికా అధ్యక్షులెవరికీ ఎదురుకాని విపత్కర, విడ్డూర పరిస్థితి ఇది! మీడియా అంచనాలను తలకిందులు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ శే్వతసౌధాన్ని అధిష్టించినప్పటి నుంచి ఆయనకు అంతటా వ్యతిరేకతే వ్యతిరేకత.. ఇందులో కొంత స్వయంకృతం అయితే.. ప్రభుత్వ పరంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు. వలసలపై వేటువేసి ముస్లిం దేశాల్లో ఆగ్రహం రగిలించిన ట్రంప్.. వీసాలపైనా కత్తిదూసి అన్ని దేశాల్లోనూ కలవరం పుట్టించారు.

07/04/2017 - 22:20

ఐరోపా యూనియన్ నుంచి వైదొలగాలని మెజార్టీ ప్రజలు తీర్పునిచ్చినప్పటికీ దీన్ని వ్యితిరేకించిన వారి సంఖ్యా తక్కువేమీ కాకపోవడంతో బ్రిటన్‌లో ఇంకా డోలాయమాన స్థితి కొనసాగుతూనే ఉంది. మళ్లీ వెనక్కి వెళ్లిపోవాలన్న బలమైన కాంక్ష వ్యక్తమవుతూనే వస్తోందనడానికి తాజాగా జరిగిన ఓ సర్వేనే నిదర్శనం.

06/27/2017 - 21:18

దక్షిణ సూడాన్ శరణార్థుల్ని ప్రపంచ దేశాలు వదిలేశాయా? వారి కడగళ్లను, బాధలను పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తిన చందంగానే వ్యవహరిస్తున్నాయా? అక్కడి పరిస్థితుల్ని లోతుగా గమనిస్తే ఇదే విషయం స్పష్టం అవుతోంది. నిరంతర హింసాకాండతో అట్టుడుకుతున్న దక్షిణ సూడాన్‌లో శాంతియుత పరిస్థితులను పునరుద్ధరించే మాట ఎలా ఉన్నా..

06/27/2017 - 21:16

భారత్- అమెరికాల మధ్య సరికొత్త రీతిలో స్నేహసౌరభం వెల్లివిరిసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిపిన విస్తృత స్థాయి చర్చలు రెండు దేశాల మధ్య గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన స్నేహబంధాన్ని మరింత పటిష్టపరిచాయి.

06/27/2017 - 21:13

భారత్ ప్రధాని నరేంద్ర మోదీ పోర్చుగల్‌లో జరిపిన తాజా పర్యటన ఇరుదేశాల మధ్య రాజకీయ, ఆర్థిక మైత్రి బంధాన్ని బలోపేతం చేయడంతోపాటు ద్వైపాక్షిక సంబంధాలను కొత్త పుంతలు తొక్కించింది. అతి తక్కువ వ్యవధిలోనే ఇరుదేశాలు 11 ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకున్నాయంటే వీటి మధ్య 1947 నుంచి ఎప్పటికప్పుడు బలోపేతమవుతూ వస్తున్న పరస్పర సానుకూల అవగాహనకు ప్రత్యక్ష నిదర్శనం.

06/27/2017 - 21:11

మండే ఎండలు సృష్టించే తాపం ఎవరికైనా ఒకటే... ఈ తాపాన్ని తీర్చుకోవడంలో చిన్నా, పెద్దా తేడా లేదు...! ఆ మాటకొస్తే మండే ఎండలు నీటి చాయ కోసం సమస్త జీవజాతి పరితపిస్తుంది.. అలాంటిది గ్రీష్మతాపంతో అల్లాడే ఈ బాలుడు ఎగిసి వస్తున్న నీటిని చూస్తే ఊరుకుంటాడా... వడివడిగా సాగుతూ ఆ నీటిలో కేరింతలు కొడతాడు.. ఫ్రాన్స్‌లో ఓ కెమెరా కంటికి చిక్కిన ఆహ్లాదకర దృశ్యమిది...

06/27/2017 - 21:09

అంగారక గ్రహంపై జరుగుతున్నన్ని పరిశోధనలు ఇప్పటి వరకూ మరే గ్రహంపైనా జరుగలేదేమో..! అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా గతంలో క్యూరియోసిటీ రోవర్‌ను పంపినప్పటి నుంచీ ఈ గ్రహానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆసక్తికర వివరాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఆపర్చునిటీ రోవర్ జరిపిన పరిశోధనల్లో ఏకంగా ఓ ప్రాచీన కొలనే కనిపించింది. ఈ కొలను మార్స్ సొరంగ ప్రాంతం చివర ఉందని కూడా ఈ రోవర్ అధ్యయనాలు చెబుతున్నాయి.

Pages