S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పాట్ లైట్

08/16/2017 - 03:56

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ విసిరే ఆధిపత్య పాచికలు, అంతర్జాతీయంగా తన పట్టును పెంచుకోవడానికి అనుసరించే వ్యూహాలను వంటపట్టించుకోవడం అనేది అంత తేలికైన పనికాదు. ఆయన ఎప్పుడు ఏ అడుగు వేస్తారో తన ఆధిపత్య లక్ష్యాలను సాధించుకోవడానికి ఎలాంటి యుక్తులు, కుయుక్తులు పన్నుతారో అంతుబట్టని వ్యవహారమే.

08/08/2017 - 21:14

ఎలాగైనాసరే అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనుకునేవాడికి నిరసనలు, ఉద్యమాలు, ఆందోళనలు ఎంతమాత్రం అడ్డుకావు అని చెప్పడానికి వెనిజులాలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలే నిదర్శనం. నెలల తరబడి సాగిన ఉద్యమాలను అణచివేసి తన ఆధిపత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేసిన అధ్యక్షుడు మదురో మరింతగా తన అధికారాన్ని సంఘటితం చేసుకోవడానికి సన్నద్ధమయ్యారు.

08/08/2017 - 21:12

బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన ఐదు దేశాల కూటమి బ్రిక్స్ తదుపరి శిఖరాగ్ర సదస్సు సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ముఖ్యంగా డోక్లామ్ వ్యవహారంలో భారత్‌తో తలెత్తిన ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ సమావేశ ప్రాధాన్యత మరింత పెరిగింది.

08/08/2017 - 21:09

అత్యంత కీలకమైన అంతర్జాతీయ సముద్ర వాణిజ్యమార్గంగా ఉన్న దక్షిణ చైనా మహాసముద్రంపై పూర్తిస్థాయి హక్కులు ఎవరివి? ఇది తమ భూభాగంలో ఉంది కాబట్టి దీనిపై సర్వహక్కులు తమవేనంటూ చైనా చేస్తున్న వాదన నేపథ్యంలో అనేక దేశాల్లో అలజడి మొదలైంది. ముఖ్యంగా ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఇందుకు సంబంధించి తీవ్రస్థాయిలోనే విభేదాలు తలెత్తినట్లుగా తాజా సంకేతాలను బట్టి స్పష్టమవుతోంది.

08/08/2017 - 21:06

భారత్-పాకిస్తాన్‌ల మధ్య అసలు పూర్తి స్థాయి సఖ్యతకు ఆవకాశం ఉందా? భారత ప్రధాని మోదీతో అంతో ఇంతో సత్సంబంధాలు కలిగిన నవాజ్ షరీఫ్ నిష్క్రమణతో పాక్‌లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు ఇందుకు ఎంత మేరకు దోహదం చేసే అవకాశం ఉంది?

08/08/2017 - 21:03

అతడు అడుగుపెడితే అడుగులకు మడుగులొత్తే దేశాలెన్నో! ప్రపంచాన్ని ఆర్థికంగానూ, రాజకీయంగానే కాకుండా అత్యంత శక్తియుక్తులతో శాసిస్తున్న అమెరికా అధ్యక్ష పదవిలో ఎవరున్నా... ఆయన ఎక్కడకు వెళ్లినా ఓ రహస్య అధికార కూటమి నీడలా ముందుంటుంది. అధ్యక్షుడికి అణుమాత్రం అపాయం లేకుండా ముందస్తుగానే అన్నీ చక్కదిద్దుతుంది. ఆయన భద్రతకు, రక్షణకు ఢోకా లేకుండా ధీమాతో కూడిన పరిస్థితులను కల్పిస్తుంది.

08/01/2017 - 21:24

ఏ యుద్ధంలోనైనా అంతిమంగా మిగిలేది అనాథలేనన్న వాస్తవాన్ని ఇరాక్ ఉదంతాలు రుజువు చేస్తున్నాయి. ఐసిస్ కబ్జాలో వున్న అనేక పట్టణాలను చేజిక్కించుకునే క్రమంలో ఇరాక్ దళాలు జరిపిన దాడులు అంతిమంగా విజయాన్ని చేకూర్చినా వేలాదిమంది చిన్నారుల భవితవ్యం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ అనాథలకు ఆసరా ఎవరు? వారిని ఆదుకునేది ఎవరు? దిక్కూమొక్కూ లేని రీతిలో వారి భవిత సమసిపోవాల్సిందేనా?

08/01/2017 - 21:22

రెండూ బలమైన కమ్యూనిస్టు దేశాలు. సిద్ధాంతాలు వేరైనా ఆశయం ఒక్కటే. ఒక దేశానికి భారత్ వంటి వర్ధమాన దేశాలను
ఢీకొని చిన్న చిన్న దేశాలపై పెత్తనం చెలాయించాలన్న ఆశయమైతే మరో దేశానిది అంతర్జాతీయంగా పూర్వ వైభవాన్ని
సంతరించుకోవాలన్న పట్టుదల. ఇటు చైనా పిఎల్‌ఏ 90వ వార్షికోత్సవ విన్యాసాలు అటు రష్యా నౌకాదళ విన్యాసాలు

08/01/2017 - 21:13

పనామా వేడి పాకిస్తాన్ రాజకీయాల్ని అట్టుడికిస్తోంది. తనపైన, తన కుటుంబ సభ్యులపైనా వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రధాన మంత్రి పదవి నుంచి నవాజ్ షరీఫ్ తప్పుకోవాల్సి రావడంతో పాకిస్తాన్ మరోసారి సైనిక పాలన కిందకి వెళుతుందా? ప్రస్తుత సంక్షోభ పరిస్థితిని అధికార పిఎమ్‌ఎల్ పార్టీ అదుపుచేయగలుగుతుందా? అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.

08/01/2017 - 21:06

పాకిస్తాన్‌లో నెలకొన్న తాజా అనిశ్చిత రాజకీయ పరిణామాలు సుస్థిర ప్రభుత్వానికి అవకాశం ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో భారత్‌తో సంబంధాల మాటేమిటన్నది ఆందోళన కలిగిస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకు అనేక సందర్భాల్లో నవాజ్ షరీఫ్‌తో మాట్లాడటం, గతంతోనిమిత్తం లేకుండా వర్తమాన అవసరాలు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రెండు దేశాలు కలిసి ఉండాల్సిన అగత్యాన్ని స్పష్టం చేస్తూ వచ్చారు.

Pages