S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ చిన్నమాట!

05/02/2016 - 22:13

ఈ సాంకేతిక యుగంలో ఎన్నో సౌకర్యాలు. కంప్యూటర్ ఓ విప్లవమైతే, స్మార్ట్ఫోన్ మహా విప్లవం. కొత్తకొత్త పరికరాలు, పనిముట్లు అవతరించడంతో పాతవి ఎన్నో మాయమై పోతున్నాయి.

04/23/2016 - 22:18

ఏప్రిల్ నెల అతి క్రూరమైన మాసం’ అన్న పదాలతో టి.ఎస్.ఈలియట్ రాసిన ప్రసిద్ధ కవిత ‘ది వేస్ట్‌ల్యాండ్’ మొదలవుతుంది. ఏప్రిల్ నెలని ఎందుకు క్రూరమైనదని అన్నాడో తెలియదుగానీ మేం కాలేజీ చదువులకి వచ్చినప్పుడు ఆ విధంగానే అన్పించేది. అదే నెలలో పరీక్షలు ఉండేవి. ఫలితాలు వచ్చేవి. పాసై కొంతమంది ఆనందపడితే, సరైన మార్కులు రాక, ఫెయిలై ఎంతోమంది బాధపడేవాళ్లు. అప్పుడు ఈ పద ప్రయోగం సరైందని అన్పించేది.

04/16/2016 - 22:13

అప్పుడప్పుడు పాత ఫొటో ఆల్బమ్‌లు చూస్తూ ఉండాలి. ఆ పాత ఫొటోలు మనకి ఎన్నో విషయాలని గుర్తుకు తెస్తాయి. అప్పటి వేషధారణ, హెయిర్‌స్టైల్, అప్పటి మిత్రులు ఇలా ఎన్నో.

04/11/2016 - 01:12

చాలా మంది భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అని చింతిస్తూ ఉంటారు. మరి కొంతమంది గతంలో చేసిన తప్పిదాల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. వర్తమానంలో బతకడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు.

04/03/2016 - 08:15

తెలుగు వాళ్లకి రెండు కొత్త సంవత్సరాలు. ఆ మాటకొస్తే భారతీయులందరికీ రెండు కొత్త సంవత్సరాలు. జనవరి 1న మొదటిదైతే, మార్చి, ఏప్రిల్ నెలల్లో వచ్చే ఉగాది రెండవది. కొత్త సంవత్సరం రాగానే కొత్త ఊహలు, కొత్త నిర్ణయాలు మొదలవుతాయి.

03/26/2016 - 21:03

డిగ్రీ చదువుతున్నప్పుడు టైపు నేర్చుకొమ్మని మా బాపు సలహా ఇచ్చాడు. ఆ సలహా నాకు ఏ మాత్రం రుచించలేదు. టైప్ నేర్చుకొని టైపిస్ట్ కావాలా? అన్న భావన నాకు కలిగింది. చాలా రికామి సెలవులు వున్నా టైపు నేర్చుకోలేదు.

03/20/2016 - 00:05

కొత్తగా కడుతున్న ప్లాట్లలో ఇప్పుడు రెండు పార్కింగ్‌లు ఉంటున్నాయి. గతంలో ఒక ఫ్లాట్‌కి ఒక్కటే కారు పార్కింగ్ స్థలం. ఈ పరిస్థితి వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి.

03/13/2016 - 08:20

మా చిన్నప్పుడు పిల్లలకి జ్వరం వచ్చిందంటే మా అమ్మ చాలా ఆందోళన చెందేది. మా బాపు ఎంత చెప్పినా తన ధోరణి తనదే. మా బాపు మందులు ఇచ్చినా మా అమ్మకి తృప్తి ఉండేది కాదు. మమ్మల్ని ఉస్మాన్ బీబీ దగ్గరకు తీసుకెళ్లి మంత్రం వేయిస్తేనే ఆవిడకి తృప్తి కలిగేది.

03/05/2016 - 20:22

చిన్నప్పుడు నాకు దట్టంగా జుట్టు ఉండేది. నా వెంట్రుకలు పొడవుగా ఉండి ఎప్పుడూ నా ముఖం మీద పడేవి. వాటిని సర్దుకోవడమే నాకు అనుక్షణం ఓ పెద్ద పనిగా ఉండేది. తల కిందికి దించుకొని చదువుకోవడం ప్రారంభించగానే అవి నా కళ్లకి అడ్డంగా వచ్చేవి. వాటిని పైకి అనుకుంటూ చదువుకోవడం ఓ సరదాగా ఉండేది. తల మీద వెంట్రుకలు దట్టంగా ఉండటం వల్ల తలని దువ్వుకోవడం కూడా అంత సులువుగా ఉండేది కాదు.

02/28/2016 - 15:26

గతంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్లకి నెలలోని మొదటి తారీఖులో జీతం ఇచ్చేవాళ్లు. ఆ రోజు ఓ పెద్ద కార్యక్రమంలా ఉండేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మా అక్క దగ్గర ఉండి డిగ్రీ చదువు చదివాను. మా బావ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసేవాడు. మొదటి తారీఖు రోజు వాతావరణం కొత్తగా కన్పించేది. అది టేప్‌రికార్డర్‌లు, టీవీలు, కంప్యూటర్లు, ఐపాడ్, స్మార్ట్ ఫోన్లు లేని కాలం.

Pages