S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ

03/21/2020 - 23:38

‘‘మీరు మందివ్వాలండి డాక్టర్‌గారూ.. నన్ను కాల్చుకు తింటున్నాడు.. దుర్మార్గుడు.. దౌర్భాగ్యుడు.. ఛీఛీ వాడితో కాపరమేంటండీ..!’’
* * *

03/15/2020 - 23:29

కాలచక్రం గిరగిరలు, కడలి కెరటాలు మనిషి కోసం ఆగవు గదా! పండుగల సీజనొచ్చింది. వారం రోజుల్లో బతుకమ్మ పండుగ. ఆ తర్వాత రోజు విజయదశమి. ఏకాదశి నాడు రంజాన్, మరి కొద్ది రోజుల్లోనే దీపావళి. కుట్టాల్సిన బట్టలు గుట్టల్లాగున్నాయి. బ్లౌజులు, పంజాబీ డ్రెస్సులు అన్నీ... పండగలకు అందించి తీరాలి. నిన్నంతా కుట్టు మిషన్ ముట్టుకునే తీరికనే లేదు.

03/08/2020 - 23:58

భూషణం బజారు కెళ్తోంటే, ‘‘కరివేపాకు కొనుక్కు రండి. మరీ పిసినారిగా మూడు రూపాయలదీ, అయిదు రూపాయలదీ కాదు. పది రూపాయలు పెట్టి ఇన్ని రొబ్బలు తెండి. రేపు మీ పుట్టినరోజు కదా, మీకిష్టమైన పులిహోర చేస్తాను’’ అంది రమ.
‘‘వావ్. ఎన్నాళ్లకెన్నాళ్లకి. కాస్త ఇంగువ వెయ్ ఘుమఘుమలు అదిరిపోతాయి.’’
‘‘అలాగే మహానుభావా. వట్టి చేతులు ఊపుకుంటూ వచ్చి ‘అయ్యో - మరచిపోయానే’ - అనకండి సుమా’’ నవ్వింది.

02/29/2020 - 23:54

‘‘ఒక ఐ.ఏ.ఎస్. ఆఫీసర్ని చేసుకుంటే జీవితం ఎంతో బాగుంటుందని ఎన్నో కలలు కన్నాను. ఇలా అడవిలో గడపాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. మీకేం? మీ పనితో మీకు కాలం గడిచిపోతుంది. నా సంగతెప్పుడయినా ఆలోచించారా?’’ అంటూ దులిపేస్తున్న, అరవిందను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రదీప్. వాళ్లిద్దరికీ పెళ్లయి నెల రోజులు కూడా కాలేదు.

02/23/2020 - 23:02

అమ్మ ఆబ్దీకం. ఈసారి వంతు ఆఖరి తమ్ముడి ఇంట్లో. నేను, జానకి లోపలకి అడుగుపెడుతూనే మొహమొహాలు చూసుకున్నాం.
సుమారు పది మంది ఉన్నారు విశాలమైన ఆ హాల్లో. మమ్మల్ని చూస్తూనే తప్పదన్నట్టు మరదలు ‘‘రండి రండి.. బావగారు. రా అక్కా’’ అంటూ ఆహ్వానించింది ఆఖరి మరదలు క్షితిజ.
సోఫాల్లో, డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీల్లో అందరూ ఎవరి సెల్‌ఫోన్‌తో వాళ్లు బిజీగా ఉన్నారు.

02/16/2020 - 22:36

సంపదల్ని పెంచుకొనే క్రమంలో, కొంత మంది మనుషులు తమ జీవితంలో ఎన్నో తప్పులు చేస్తారు. ఒకవేళ జీవితపు చివరి దశలో వాటిని బేరీజు వేసుకోవాలని భావించినప్పుడు.... ఆ క్షణాన, ఆ వ్యక్తి ఒక రకమైన మానసిక ‘రాపిడి’కి లోనై నిస్తేజంగా బ్రతకవలసి వస్తుంది. ఆ టైంలో కూడా నువ్వు నీ తప్పుల్ని తెలుసుకోకుండా, స్వార్థానికి చిరునామాలా మారిపోతే, అంతకన్నా నీచమైన బ్రతుకు మరొకటి ఉండదు.

02/09/2020 - 23:19

-షేక్ అబ్దుల్ హకీం జాని
‘‘నాయనా! రాత్రిపూట చలి విపరీతంగా పెరిగిపోయింది. ఒక కంబళి తీసుకురా బాబూ’’ కుమారుడ్ని దీనంగా అడిగింది జగదాంబ.
‘‘పని ఒత్తిడితో సతమతవుతున్నాను. కంబళ్లు ఇప్పుడు ఎవరూ వాడటం లేదు. ఏదో ఒక దుప్పటి తెస్తాలే. వెళ్లి కాసేపు నిద్రపో. ఊరికే నస పెట్టబాకు’’ గదిమాడు పెద్ద కుమారుడు చక్రధర్.

02/01/2020 - 23:52

ఫోనులో మాట్లాడి వచ్చి తన పక్క కుర్చీలో కూర్చున్న తాయారమ్మ వైపు ఆసక్తిగా చూస్తూ ‘‘ఏమిటంత ఆనందం.. కొడుకు ఏం చెప్పాడేం..? ప్రమోషన్ వచ్చిందటనా?’’ అనడిగారు రంగనాథం గారు.
ఆవిడ చిరునవ్వుతో చూసి ‘‘తండ్రిగా ప్రమోషన్ వచ్చి పూర్తిగా నెల అయినా కాలేదూ మళ్లీ ప్రమోషన్ ఏంటి?’’ ఛలోక్తిగా అంది.
‘‘నేనడిగింది, ఆఫీసులో సంగతి..’’
‘‘ఆఫీసు విషయాలు ముందుగా మీకే కదా చెబుతాడూ..’’ దీర్ఘం తీసింది.

01/25/2020 - 23:45

బాలు బడి నుంచి ఇంటికి వచ్చి పుస్తకాలు బల్లపై పెట్టి, బాత్‌రూంలోకి వెళ్లి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి వంటింట్లో అమ్మ ఏం చేస్తోందా? అని చూశాడు. అంతలో బాలు అమ్మ భారతి వచ్చి మిరపకాయ ముక్కలు, జీలకర్ర, చిన్న అల్లం ముక్క తొక్కి పిండిలో కలిపి పెనంపై అట్లు పోస్తోంది. వాటి తాలూకు కమ్మని వాసన బాలు ముక్కు పుటాలు తాకుతోంది.

01/19/2020 - 22:40

తప్పు చేయనపుడు, తప్పు చేశావని ఎవరైనా నిందించినపుడు మనిషిలో అపరిచితుడు నిద్రలేస్తాడు. అసహనంతో, కోపంతో రగిలిపోతాడు. గోవర్థన్ మాత్రం నిగ్రహం పాటించాడు. అన్నీ సమకూర్చుతున్నా ఏమీ చేయడంలేదని వేలెత్తి చూపించేసరికి అతనిలో అసహనం పొంగిపొర్లింది. ‘‘నీ గురించి నాకు తెలుసురా! మీ నాన్నమీద నీకెంత ప్రేమో నాకు కాక ఇంకెవరికి తెలుస్తుంది చెప్పు?

Pages