S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మృతి లయలు

02/16/2020 - 23:18

ఎంతో కాలంగా అంధు కోసం ఉవ్విళ్లూరుతూ ఎదురుచూస్తున్న విజయవాడ నుంచి పత్రిక ప్రచురణ ఎట్టకేలకు సాధ్యమైంది. గాంధీనగరం ఐదు రోడ్ల కూడలి ‘ఆంధ్రపత్రిక సెంటర్’ అయింది. జనవరి 24, ఆదివారం తేదీ గల సంచికని శనివారం చేయడంతో కేంద్ర కార్మిక మంత్రిగా వెళ్లిన సంజీవయ్యగారు సందేశంలో (తన) పేర్కొన్నట్లు ‘‘ఆంధ్రుల ఆదిపత్రిక అభిమాన పత్రిక - కృష్ణా తీరం నుంచి కూడా ప్రచురణయైంది. ‘‘ఒక వెలితి తీరింది.’’

02/09/2020 - 23:43

ఐధు పాసింజర్ బోగీలను అవతల పారేసి, ముందుకు వెళ్లిపోయింది మద్రాసు-హౌరా మెయిలు. భోగి పండుగ అన్ని చోట్లా చలిమంటలు వేసుకుని ఉంటారు జనం. ఆ రాత్రి అడవిలో పెద్దలు, పిన్నలు నాకు ఎందరో సహాయం చేశారు. నా ‘బదిలీ’కి మంచి ముహూర్తమే అయిందది. యువకులు నా సామాన్లు మోసుకొస్తే పెద్దలు టార్చిలైట్లతో ముందు నడిచారు. ఒక ‘‘మిలటరీ బోగీ’’ దగ్గర ఆగి ‘‘వుఠో..

02/02/2020 - 22:36

‘‘నరుఢా! ఏమి నీ కోరిక?’’ అంటూ పాతాళభైరవి సినిమాలోలాగా ఒక యక్ష కన్య ‘డింగ్’మని ప్రత్యక్షమై అడుగుతుందని నేను అనుకోలేదు గానీ - ఊరు, డిపార్ట్‌మెంట్ మారిపోతున్నప్పుడు అయినా - కొంచెం సమయం, సదుపాయం దొరుకుతాయని నేను అనుకున్నాను.

01/26/2020 - 22:51

అధే కనుక ఫ్లాప్ అయితే అటు తర్వాత అపారంగా నాకు, నా కెరీర్ మీద ఏర్పడ్డ కాన్ఫిడెన్స్ నీరుగారిపోయి ఉండేది. డైలీలో కూడా, దురదృష్టవశాత్తు, అది ఆగిపోయేదాకా, వీక్లీలో కన్నా ఎక్కువకాలం, అహర్నిశలూ పనిచేసినా, నా మీద పాఠకులలో ‘వీక్లీ’ ముద్రయే మిగిలింది!

01/19/2020 - 23:12

అవతల భెజవాడ సంచిక డైలీ ప్రారంభం చేయడానికి ఏర్పాట్లు వేగవంతం చేయబడ్డట్లే వుంది. పై ఏడాది జనవరిలో యిది సాధ్యం కావచ్చును. (1965) అనుకుంటూ వుండగా- నేను సినిమాలకి- అంటే స్టూడియోల్లో చూపించే ప్రీవ్యూలకి సహచరులను పంపించేస్తూ వున్నాను. డైలీ ప్రెస్సులోకి ఓసారి వెళ్లాను. వర్కర్‌లు చుట్టుముట్టేస్తారు. ‘‘డైలీలోకి దిగిపోతున్నారా, సామీ?’’ అంటారు.

01/12/2020 - 23:50

అయ్యవారు ఉగాధి సంచిక కోసం ఎంతో ముందుగా పథకాలు వేసేవారు. మూడు నెలల ముందు చెప్పారు - సినిమాల మీద సంవత్సరాది సంచికకి వ్యాసం తయారుచెయ్యమని. ఇది ఒక ‘కితాబు’ నాకు. ఆంధ్రపత్రిక ఉగాది సంచికలు 1910లో మొదలయిన నాటి నుంచీ, శంభుప్రసాద్ గారు 1972లో యిహ లోక యాత్ర చాలించేదాకా ఒక ‘అద్భుతం’ లాగా రాణించాయి. అవి దాచుకునే సంచికలే గానీ తూకానికి వేసే పాత పేపర్లతో వెళ్లిపోయేవి కావు.

01/05/2020 - 23:51

నాకు తెలిసినంత వరకు హింధీ, ఇంగ్లీషు సామెతల కన్నా తెలుగు సామెతలు చాలా పవర్‌ఫుల్. మన వాటిలో చరిత్ర, జాగ్రఫీ మరియు జీవన సత్యం కూడా తొణికిసలాడుతుంటాయి. ఉదాహరణకు ‘‘కూర మంచి కుండ చేదు’’ అన్న సామెత ఉంది. గొప్ప చేదు నిజాన్ని దైనందిన జీవితంలో ఆవిష్కరిస్తుంది. నువ్వు చేసే ఉద్యోగంలో నువ్వు ఎంత పూసుకు రాసుకు తిరిగినా నువ్వు చేదుకుండవే. నీ పనివాడితనం బాగుంటే అది కూర మంచి. నీ గొప్ప కాదు.

12/29/2019 - 23:48

నిజంగా ఆంధ్రపత్రిక వీక్లీని ఎడిటింగ్ చెయ్యడంలో నేను తృప్తిగా ఎంజాయ్ చేసిన టైము- మద్రాసుకి సంబంధించినంత వరకు నేరుగా అయ్యవారి పర్యవేక్షణలో పని చేసినప్పుడే జరిగింది. చీఫ్ శివలెంక శంభూప్రసాద్ గారిని - అయ్యవారు అని అందరూ అంటే అయ్యర్ అని కుంచిత పాదంగారు రిఫర్ చేసేవాడు. ఎస్సార్ గారుఅంటే రాధాకృష్ణ గారిని బాస్ వచ్చాడేమో చూడండి అని నేను ఒక్కడినే అనేవాడిని!! ఏమంటున్నాడు మావాడు?

12/22/2019 - 23:43

ఇంటర్వ్యూస్ అన్నీ కూఢా వెళ్లిపోయిన తిరిగిరాని మధురమైన ప్లాట్‌ఫారం లేదా రోమన్ హాలిడే లాంటివి.. కానీ నాకే కాదు పాఠకులకు కూడా అవి ఇష్టమైన జ్ఞాపకాలే.

12/15/2019 - 23:06

అరుణాఛలం అగ్ని లింగంగా వాసికెక్కిన అరుణాచలేశ్వరుని గుడికి మద్రాసు నుంచి మోటారు శకటం మీద నాలుగు గంటలు పట్టింది -లింగ దర్శనం కన్నా గిరిప్రదక్షిణకి గ్రేడు ఎక్కువట.. కానీ కనీసం పది కిలోమీటర్లు చుట్టి రావాలి. పిక్కబలం ఉన్నవాడికే నాల్గు గంటలు పడుతుంది - ఇక్కడి శివాలయంలో అయిదు ప్రాకారాలున్నాయి..

Pages