S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకాభిరామం

03/22/2020 - 23:22

ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచం మారింది. ఎవరూ ఉత్తరాలు రాసుకోవడం లేదు. అందుకు బదులుగా ఈమెయిల్, ఈ మధ్యన వాట్సాప్ ఇలాంటివి అందరూ విరివిగా వాడుకున్నారు. చేతిరాత చేతకాకుండా అయింది. తెలుగు కూడా టైప్ చేయనవసరం లేకుండా చెపితే విని రాసే వెసులుబాటు వచ్చింది. ఇక పాట, సినిమాల గురించి చెప్పనవసరమే లేదు. ఎక్కడ చూసినా అన్ని రకాల మనుషులు పాట వింటూ, లేదా వీడియో చూస్తూ కూర్చుని ఉండడం కనిపిస్తున్నది.

03/15/2020 - 23:54

ఆ మధ్యన నేను ఒక సైంటిస్టుల సమావేశానికి వెళ్లాను. స్వాతంత్య్రం తరువాత భారతదేశానికి సైన్సులో నోబెల్ బహుమానం రాలేదని ఒక పెద్ద మనిషి అక్కడ ఏదో కొంపలు మునిగినట్టు ఫిర్యాదు చేశాడు. ఇంచుమించు సభ చివరలో నాకు కూడా మాట్లాడడానికి అవకాశం వచ్చింది. సైన్సులో నోబెల్ బహుమానం రాలేదు సరే, మరి సాహిత్యంలో కూడా రాలేదు. అంటే ఆ బహుమానంలో ఎక్కడో ఏదో తేడా ఉంది అన్నాను నేను.

03/09/2020 - 23:31

నాకు శాస్ర్తియ సంగీతం అంటే ముక్క కూడా తెలియదు. కానీ జీవితంలో చాలా భాగం సంగీతం వింటూ గడిపాను. త్యాగరాజస్వామికి తిరువైయారులో ఉత్సవాలు జరుగుతాయి. ముత్తుస్వామి దీక్షితులకు ఎక్కడ ఉత్సవాలు చేయాలో తెలియదు. ఆయన ఒక చోట ఉండలేదు. ఉన్న ఎట్టయాపురంలో చాలాసార్లు అఖండగానం జరుగుతుంది. ఒకసారి నేను కూడా అక్కడికి వెళ్లాను. ఇక శ్యామశాస్ర్తీ వారికి కాంచీపురంలో ఉత్సవాలు చేయడం మొదలైంది.

03/01/2020 - 23:16

శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గానరసం ఫణిః అని ఒక మాట. చిన్న పిల్లలకు కూడా పాట రుచి తెలుస్తుంది. పశువులు పాట వింటాయి. పాములు పాట వింటాయి అంటుంది ఈ సూక్తి. కొంతమంది పండితులు శిశువు అంటే కుమారస్వామి, పశువు అంటే నందీశ్వరుడు, పాము అంటే ఆదిశేషుడు అని వ్యాఖ్యానాలు చెప్పారు. నేను అటువైపు వెళ్లడం లేదు. చిన్నపిల్లలకు పాట అంటే ఒక కమ్మని చప్పుడు. పశువులు పాట వింటాయో లేదో నాకు తెలియదు.

02/23/2020 - 23:31

ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం అన్న పుస్తకం గురించి విననివారు ఉండరు. ఎక్కడికి వెళ్లినా ఏం మాట్లాడినా ప్రపంచమంతా నిలబడి అతడిని గమనించింది. తాను పరిశోధిస్తున్న వౌలిక భౌతికశాస్త్రం గురించి మాత్రమే కాకుండా అతను మరెన్నో విషయాలను గురించి పట్టించుకున్నాడు. తనలాంటి కదలలేని మనుషులకు సాయం చేయాలని ఎంతో ప్రయత్నించారు. అణుయుద్ధం గురించి ప్రపంచాన్ని హెచ్చరించాడు.

02/16/2020 - 23:08

నాకు మనిషి తెలివి పట్ల అంతులేని నమ్మకం ఉంది. తెలివి ఉండి కూడా వాడని వారి పట్ల అంతగానూ అసహనం కనబరుస్తాను. అది నా బలహీనత. తెలివిని వాడుకుని మన గురించి ప్రపంచం గురించి తెలియజెప్పిన వారంతా నాకు గురువులు. సైన్ల్ నాకు వేదం. వేదం అంటే తెలివిడి అని అర్థం. విజ్ఞానశాస్త్రంలో మరీ లోతైన అంశాలను గురించి అవగాహన కలిగించిన వారు మరీ గొప్ప గురువులు.

02/09/2020 - 23:38

మల్టీమీడియా అని ఒక మాట ఉంది. అక్షరాలు, అంటే పుస్తకాలు, లేఖలు ఇలాంటి దస్తావేజులు అన్నీ కంప్యూటర్‌లో ఉంటాయి. ఆడియో అంటే ధ్వని కూడా కంప్యూటర్‌లోనే ఉంటుంది. నేను ఇంట్లో కూర్చుని కంప్యూటర్‌లో రికార్డ్ చేసిన అంశాలను నా బ్లాగ్‌లో కూడా వినిపించాను అంటే అందులో ముక్క కూడా అబద్ధం లేదు. రికార్డ్ చేసిన మాట పాట ఏదైనా అందులోని నాణ్యత పెంచడం అనవసరమైన ధ్వని లేదా ఇతర అంశాలను తీసివేయడం, అది ఒక విద్య.

02/02/2020 - 22:28

కంప్యూటర్లు నాలాంటి వాళ్లకు చాలా కాలం క్రితమే బతుకులో భాగంగా మారాయి. చాలాకాలంగా మాలాంటి వాళ్లు వాడుతున్న నా డెస్కుటాపు ఈమధ్యన పాడైంది. దాన్ని బాగు చేయడానికి నేను ఎక్కడికి వెళ్లను. నా కొడుకు వచ్చినప్పుడు ఇద్దరమూ కలిసి దాన్ని కొంత ఖర్చు పెట్టి మరమ్మతు చేశాం. అది బాగానే పనిచేయ సాగింది. మరీ పాతది గనుక కొన్నాళ్ల తర్వాత మళ్లీ సమస్యలు మొదలయ్యాయి. ఇక దాన్ని వదలక తప్పదని నాకు అర్థం అయింది.

01/26/2020 - 22:40

గడచిన సంవత్సరంలో కొన్న పుస్తకాలను గురించి ఒక సమీక్ష చేశాను. అందులో ముఖ్యంగా నాకు మూడు రకాలు కనిపించాయి. మొదటివి సైన్స్ పుస్తకాలు. రేడియోలో నేను చేసిన ఉద్యోగం కారణంగా, ఆ తరువాత కూడా వరుసబెట్టి అదే పనిగా సైన్స్ రాస్తున్నందుకు నన్ను కొంతమంది సైన్స్ గోపాలం అంటారు. మొత్తానికి నాకు సైన్స్ చీమ గట్టిగానే కుట్టింది. అదేదో నేను తప్పకుండా పట్టించుకోవలసిన అంశం అన్న భావం మెదడులో గట్టిగా మిగిలిపోయింది.

01/12/2020 - 23:42

మా అమ్మాయి కొంతకాలంగా సింగపూర్‌లో పని చేస్తూ ఉండేది. పై చదువు, పని పేరున తాను ఇప్పుడు యూరోప్‌కు మారుతుంది. కనుకనే సింగపూర్ చూడటానికి మమ్మల్ని రమ్మని పిలిచింది. మా అబ్బాయి కూడా అక్కడికి వచ్చాడు. నలుగురం కలిసి నాలుగు రోజుల పాటు మా ఊర్లో తిరిగాం.

Pages