S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల భూమి

03/08/2020 - 00:26

మిర్తివలస అనే గ్రామంలో కోటయ్య అనే రైతు ఐదెకరాల మాగాణికి యజమాని. అతనికి సీతమ్మ అనే భార్య, రాజయ్య అనే ఐదేళ్ల కొడుకు ఉండేవారు. కోటయ్య తన కొడుకు రాజయ్యను బాగా చదివించాలనే కోరికతో ఆ ఊరులో గల ప్రాథమిక పాఠశాలలో చేర్పించాడు. రాజయ్యను బడికి పంపుతూ బడిలో అల్లరి చేయకూడదని, తోటి పిల్లలతో మంచిగా ఉండాలని, ఉపాధ్యాయుల ఎడల గౌరవ మర్యాదలతో ప్రవర్తించాలని పదే పదే చెప్పి పంపేవాడు.

02/29/2020 - 23:29

ఒక అడవిలో ఒక పులి, నక్కా స్నేహంగా ఉండేవి. పులి తన వాడియైన గోళ్లతో, పొడవైన కోరలతో జంతువులను వేటాడేది. వేటాడిన జంతువులలో కొంత భాగం నక్కకు ఇచ్చేది. యజమానురాలు పులి తనకు ఇస్తున్న ఆహారానికి ప్రతిఫలంగా నక్క పులి గుహను శుభ్రపరిచేది.

02/22/2020 - 23:47

ఆ రోజంతా రాము చాలా దిగులుగా ఉండటం గమనించారు వాళ్ల తాతయ్య. దిగులెందుకని అతను రెండు మూడు సార్లు అడిగినా ఏం జవాబు చెప్పలేదు రాము. అసలు ఓ పదిరోజులైంది రాము అలా దిగులుగా ఉండి. ఎప్పుడూ గలగల మాట్లాడే రాము అలా విచారంగా మొహం పెట్టి వౌనంగా చదువుకోవడం నచ్చలేదు తాతయ్యకి. ఈరోజు ఎలాగైనా రాము నుండి అసలు విషయం తెలుసుకోవాలి అనుకున్నారాయన. నిరాశక్తంగా బడికి బయలుదేరిన రాము వైపే చూస్తూ ఆలోచనలో పడిపోయారు ఆయన.

02/01/2020 - 23:21

కుందేలు చెట్టుపైకి ఆశగా చూడటం చూసిన కాకి సగం తిన్న జామపండును జారవిడిచింది.
ఆ జామపండును ఇష్టంతో తింటూ ‘‘కాకి మామా నీ సహాయం ఎన్నటికీ మరువలేను. నా కోసం ఎక్కడో దొరికిన పండ్లను తీసుకొని వచ్చి ఇస్తున్నావు నీ ఋణం ఎలా తీర్చుకొంటానో’’ అంది కుందేలు.

01/25/2020 - 23:26

రామాపురంలోని ప్రభుత్వ పాఠశాలలో రాము ఐదో తరగతి చదువుతున్నాడు. ఆ రోజు ప్రధానోపాధ్యాయులు ప్రార్థనా సమావేశంలో ‘‘చూడండి పిల్లలూ! మన దేశ రక్షణ కోసం కాశ్మీర్ సరిహద్దుల్లో, చలిని లెక్క చేయక, సుఖాన్నీ వదిలేసి, అయిన వాళ్లందరికీ దూరంగా ఉంటూ మన దేశాన్ని కాపలా కాస్తున్న మన సైనికులను ముష్కరులు నిర్ధాక్షిణ్యంగా, నిష్కారణంగా హతమార్చారు.

01/18/2020 - 23:55

బౌద్ధమత ప్రచారం చేస్తున్న గౌతమబుద్ధుడు ఒకసారి శిష్యులతో కలిసి కోసల రాజ్యానికి బయలుదేరాడు. ఆ మార్గంలో ఎదురయ్యే ఒక దట్టమైన అడవిలో అంగుళీమాలుడు అనే దోపిడీ దొంగ ఉండేవాడు. బాటసారులను నిర్దాక్షిణ్యంగా హింసించి ధన, మాన, ప్రాణాలు దోచుకొని చనిపోయినవారి చేతివేళ్ళను కత్తిరించి మెడలో హారంగా వేసుకునేవాడు.

01/11/2020 - 23:59

రంగాపురం అనే గ్రామంలో రామయ్య, సోమయ్య ప్రక్కప్రక్క ఇళ్లల్లో నివసించేవారు. రామయ్య ఉన్నదాంట్లో పది మందికీ పెట్టాలనుకుంటాడు. సోమయ్య పిసినారి. ఏదైనా దొరికినా తనే తినెయ్యాలని చూస్తుంటాడు. అది మంచి పద్ధతి కాదని రామయ్య సోమయ్యకి ఎన్నోసార్లు చెప్పేవాడు. కానీ సోమయ్య వినేవాడు కాదు.

01/05/2020 - 22:55

‘ఆవిడని మాత్రం పిలవటానికి వీల్లేదు’ అని నొక్కి చెప్పాడు టింకు. ‘అదేవిట్రా, మన చుట్టుపక్కల వాళ్లందర్నీ పిలుస్తూ ఆవిడ్ని మాత్రం పిలవకపోతే ఏం బావుంటుందిరా?’ అని దీర్ఘం తీసింది టింకు వాళ్ల నాయనమ్మ శాంతమ్మగారు. వాడి 11వ పుట్టినరోజు నాడు వాళ్లింటి చుట్టుపక్కల పరిచయం ఉన్న వాళ్లందర్నీ చిన్న పార్టీకి పిలవాలని టింకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేస్తున్నారు.

12/28/2019 - 23:29

ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. అన్న అమాయకుడు. తమ్ముడు లౌక్యం, వ్యవహార దక్షత తెలిసినవాడు. అంతమాత్రం చేత అన్నను మోసం చేయాలనే మనస్తత్వం కలవాడు కాదు. అన్న పట్ల ప్రేమ, అభిమానం చూపించేవాడు. వారికి తండ్రి నుంచీ వారసత్వంగా కొంత పొలం వచ్చింది. అన్న పనివాళ్లతోపాటు నడుము వంచి పని చేసేవాడు. తమ్ముడు అందరి మీదా అజమాయిషీ చేస్తూ పని సక్రమంగా జరిగేటట్లు చూసేవాడు.

12/14/2019 - 23:43

బోనంగి గ్రామంలో రాజేశం, నీరజ అనే దంపతులుండేవారు. రాజేశంది ధనిక కుటుంబం. వారికి కృష్ణ అనే ఏకైక కుమారుడుండేవాడు. రాజేశం చాలా సాత్వికుడు. డబ్బున్న వాడిననే అహంకారం ఉండేది కాదు. అందరితో కలసిమెలసి తిరిగేవాడు. పేద వారిని కష్టాలలో ఆదుకునేవాడు. కానీ నీరజకు పెద్దింటి దానననే అహంకారం ఉండేది. అవకాశం వచ్చినప్పుడల్లా డాబు, దర్పం ప్రదర్శించేది. రాజేశంకు ఈ పద్ధతి నచ్చేది కాదు.

Pages