S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనం మూలం

02/16/2020 - 22:42

బాగా చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించి, ఒక సొంత ఇంటిని నిర్మించుకోవాలి అనేది చాలా మంది ఆశ, జీవిత లక్ష్యం. కొందరు మరింత ముందుకు వెళ్లి ఉద్యోగం చేస్తే ఎంత కాలానికైనా ఆస్తి సంపాదించేది లేదు. వ్యాపారంలో బోలెడు సంపాదించాలి, వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాలని కోరుకుంటారు. ఇవేమీ అసాధ్యమైన లక్ష్యాలేమీ కావు. ప్రయత్నిస్తే సాధ్యం కానివేమీ కాదు.

02/01/2020 - 23:30

సంపన్నులు సామాన్యులు ఇనె్వస్ట్‌మెంట్ చేసే తీరులో చాలా తేడా ఉంటుంది. సంపన్నులు ఎలాంటి పెట్టుబడులకు దూరంగా ఉంటారనే అంశంపై ఇటీవల అమెరికలో ఒక సర్వే నిర్వహించారు. సర్వే నిర్వహించింది అమెరికాలోనైనా ఎక్కడైనా దాదాపు ఇనె్వస్ట్‌మెంట్ తీరు ఒకేలా ఉంది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్లు ఇనె్వస్ట్‌మెంట్‌కు ఎక్కడ ఆసక్తి చూపిస్తారో, సంపన్నులు మాత్రం వాటికి దూరంగా ఉంటున్నట్టు తేలింది.

01/19/2020 - 22:47

చదువుకునే రోజుల్లో లెక్కల్లో తెలియని అంకెను ఎక్స్ అనుకుని లెక్క చేస్తాం. పెద్ద వారైన తరువాత కూడా, చదువుకున్న వారైనా చదువుకోని వారైనా తెలియని దాన్ని తెలియదు అని అంగీకరించే గుణం చాలా తక్కువ. స్టాక్ మార్కెట్ గురించి మానకేమీ తెలియక పోతే తెలియదు అని ఒప్పుకోవడానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు. తెలుసుకునే ప్రయత్నం చేస్తే తప్పేమీ లేదు.

01/12/2020 - 23:22

‘నా తల రాత ఇంతే... చేతి గీతల్లో ధన రేఖ లేనప్పుడు ఎంత అనుకుని ఏం లాభం. ధన రేఖ లేకపోవడం వల్లనే డబ్బు చేతిలో నిలవడం లేదు.’ చాలా మంది నోటి నుంచి ఇలాంటి మాటలు వినిపిస్తుంటాయి. పుట్టినప్పుడే మన చేతి రాతలు, నుదిటి రాతలు రాసి ఉంటాయంటారు. నిజమే ఆ రాతలు తల్లికడుపులో ఉండగానే రాసి ఉంటాయి. నుదిటి గీతను, చేతిపై ఉన్న రేఖలను మార్చుకోలేమేమో... వాటిని మార్చుకోవలసిన అవసరం కూడా లేదు.

01/05/2020 - 23:29

ఒక పొరపాటుకు యుగములు వగచేవు అనే పాట వినే ఉంటారు. ఈ పాటలో జీవిత సత్యం ఉంది. ఒక జీవితాన్ని నిర్మించుకోవాలి అంటే ఎంతో కాలం శ్రమించాల్సి ఉంటుంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. దెబ్బతినాలి అంటే మాత్రం ఒక్క చిన్న పొరపాటు చాలు. అందుకే ఒక పొరపాటుకు యుగములు వగచేవు అన్నాడు సినీ కవి. ప్రపంచంలో కెల్లా దురదృష్టవంతుడు ఎవరు అనే ఓ ప్రశ్నకు ఆపిల్ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరి పేరు చెప్పారు.

12/29/2019 - 23:24

‘‘మీ కలలను నిజం చేసుకోవడానికి మీరే ప్రయత్నించండి. అలా ప్రయత్నం చేయకపోతే మరెవరో తమ కలలను నిజం చేసుకోవడానికి మిమ్ములను ఉపయోగించుకుంటారు’’ ధీరూబాయ్ అంబానీ చెప్పిన మాట ఇది. అంటే దీని అర్థం మీ జీవితాన్ని మీరే నిర్మించుకోవాలి. జీవితంలో ఎదడగానికి మీకు మీరే యజమానిగా ఉండాలి.

12/22/2019 - 23:15

‘అమ్మో నాకు భయం... రిస్క్ తీసుకోవడం నా వల్ల కాదు. రిస్క్ తీసుకోవడం అవసరమా? బ్యాంకులో డిపాజిట్ చేస్తాను. ఎవరినీ నమ్మను. కొత్త ఆలోచనలు నా వల్ల కాదు. ఏదో గడిచిపోతుంది. ఇప్పుడు రిస్క్ తీసుకోవడం అవసరమా? అన్నింటి కన్నా ఉద్యోగ భద్రత ముఖ్యం. ’

12/15/2019 - 23:30

విజయ సూత్రాలు ఎక్కడున్నా నేర్చుకోవాలి తప్పు లేదు. ప్రపంచంలో పలు యూనివర్సిటీలు వివిధ అంశాలపై అధ్యయనం చేస్తారు. ఆ అధ్యయన ఫలితాలపై అన్ని దేశాలు ఆసక్తి చూపిస్తాయి. అవి మనకు ఏమన్నా ఉపయోగపడతాయా? అని..

12/13/2019 - 06:31

డబ్బు సంపాదించడమే కాదు దాన్ని నిలుపుకోవడం కూడా ముఖ్యమే. ఇది తెలియకపోతే రోడ్డున పడతాం. సంపాదించడం కన్నా హోల్డ్ చేయడం చాలా మందికి కష్టం. జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లిన వారి జీవితాలు అంతిమ దశలో దయనీయంగా మారడానికి కారణం డబ్బును హోల్డ్ చేయలేకపోవడం. మార్వాడీలు సంపాదించడమే కాదు దాన్ని నిలుపుకోవాలి అంటారు. అది విన్నప్పుడు సంపాదించిన తరువాత నిలుపుకోక పోవడం ఏమిటి? అని పిస్తుంది కానీ అది నిజం కాదు.

11/30/2019 - 23:28

సరస్వతి, ధనలక్ష్మి ఒకరు ఉన్న చోట మరొకరు ఉండరు అని ఓ నానుడి. పేదరికం నుంచి విముక్తి కావాలి అంటే చదువు ముఖ్యం. ఇది అందురూ నమ్మే మాట! ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అంటే రెండూ నిజమే.

Pages