S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

03/24/2018 - 23:25

ఈ ప్రపంచంలో రకరకాల వ్యక్తులు ఉన్నారు. అందులో కొంతమంది చాలా విచిత్రంగా ఉంటారు. వాళ్లు ఇతరులని అంచనా వేస్తుంటారు. ఈ అంచనాలు కూడా వాళ్లని తక్కువ చేస్తూ వుంటాయి. అంటే ఎదుటి వ్యక్తులని తక్కువ అంచనా వేస్తూ వుంటారు.
తమని ఇతరులు ఎలా అంచనా వేస్తున్నారోనని మరి కొంతమంది ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. తమని ఇతరులు తక్కువగా అంచనా వేస్తున్నారేమోనని బాధపడుతూ ఉంటారు.

03/24/2018 - 23:20

శ్రీ రామాయణం క్షీరధార. వాసుదాసుగారి శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం, మందరాలన్నీ, మందార మకరంద మాధుర్యాలే.. కవికులగురువు కాళిదాసు అన్నట్లు. ‘‘చరిత్ర మా రాముడిది. రచన సాక్షాత్తు వాల్మీకులవారిది. గానం చేసినవారు కినె్నరగాత్రులైన కుశలవులు. ఇంతటి మహనీయమైన రామాయణ కావ్యంలో, శ్రోతలను పరవశింపచేయని అంశం అనేదేదీ లేదు.

03/24/2018 - 22:30

కవికోకిల విరచితమే
ఆరుకాండల రసాయనమే
క్రౌంచపక్షుల విరహము
భార్యాభర్తల సంబంధము
పౌలస్త్య వధ - సీతాదేవి చరిత
శ్రీమద్రామాయణ కావ్యంగ లోకానికి ఎరుక.

03/24/2018 - 22:29

ఆరడుగుల బుల్లెట్.. వలె ఈ బుడతడిని మనం మూడడుగుల బుల్లెట్ అని పిలుచుకోవచ్చు. లేదా బుల్లి బాహుబలి అనే పేరు కూడా ఈ బుడ్డోడికి సరిగ్గానే సరిపోతుంది. ఈ కుర్రాడు ఆజానుబాహుడూ కాదు.. అలాగని కొండల్ని పిండి చేయగలననే ధీమా ఉట్టిపడే ఉడుకురక్తము పరుగులిడే యవ్వనమూ కాదు.. పలకబట్టి అక్షరాలు దిద్దే ఎనిమిది సంవత్సరాల బుడ్డోడు.

03/24/2018 - 22:26

1.‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎవరు అన్నారు?
ఎ.సురవరం ప్రతాపరెడ్డి
బి.దాశరథి కృష్ణమాచార్యులు
సి.సింగిరెడ్డి నారాయణరెడ్డి
డి.కాళోజి
2.‘రుద్రవీణ’ ‘గాలిబ్ గీతాలు’ లాంటి సుప్రసిద్ధ రచనలు ఎవరు రాశారు?
ఎ.తాపీ ధర్మారావు
బి.దాశరథి కృష్ణమాచార్యులు
సి.వాసిరెడ్డి సీతాదేవి
డి.రావూరి భరద్వాజ
3.‘కులం లేని మనిషి’ నవలని ఎవరు రాశారు?

03/24/2018 - 22:11

రాముడు
సీతాసమేత కారుణ్యధాముడు
కార్యశూరుడు మానవ దేవుడు
పత్నీబద్ధుడు
ధర్మమనే విల్లును పట్టి
న్యాయాంబులను ఎక్కుపెట్టి
ధరలో నీతిని నిలిపిన
రామాయణ పురుషుడు
శబరి ప్రేమను ఆస్వాదించిన రేడు
అహల్యను శాపవిముక్తను చేసినవాడు
కైకేరుూ మానస పుత్రుడు
పదవీ త్యాగంలో పవిత్రుడు
తండ్రి మాట జవదాటడు
గుహుని నావలో అద్దరి చేరిన మారాజు

03/24/2018 - 20:44

ఒకప్పుడు పాలకుల నిరాదరణకు గురైన ఒంటిమిట్ట రామాయలం ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఒక్కసారి వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో శ్రీరామనవమి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా ఖమ్మం జిల్లా భద్రాచలంలో నిర్వహించేది. రాష్ట్ర విభజన ఫలితంగా భద్రాద్రి తెలంగాణ ప్రాంతానికి చెందడంతో, ఏపీ ప్రభుత్వం సీతారాముల కల్యాణాన్ని కడప జిల్లా ఒంటిమిట్టలో గత కొనే్నళ్లుగా నిర్వహిస్తోంది.

03/24/2018 - 20:30

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

03/24/2018 - 20:17

పుత్రకామేష్టి పరమాన్నం!
ఉదయించిన పరబ్రహ్మం!!
కౌసల్యా దశరథ నందనం
శ్రీరామ జననం!!
విశ్వామిత్రుని యాగ రక్షణం
అహల్యా శాపవిమోచనం
శివధనస్సు భంగం
సీతారాముల పరిణయం
పితృవాక్య పరిపాలనం
కానన వాసారంభం
పాదుకా పట్ట్భాషేకం
పంచవటి నివాసం
సీతాపహరణం
జటాయు మరణం
హనుమత్సేవనం
సుగ్రీవ సంభాషణం
సీతానే్వషణం

03/24/2018 - 20:11

దేశంలోని రామాలయాల్లో విశిష్టత కలిగి రెండో అయోధ్యగా పేరుగాంచిన చారిత్రక ప్రాధాన్యత గల రామక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం. అద్భుతమైన శిల్పకళాకృతులు, ఆకాశాన్నంటినట్టుండే మూడు గోపురాలు, సువిశాలమైన మండపం, ఎతె్తైన ధ్వజస్తంభంతో అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడే ఏకశిలానగరంగా పిలవబడే ఒంటిమిట్ట రామాలయం విజయనగర రాజుల కాలం నాటి కళావైభవానికి సాక్షీభూతంగా నిలుస్తోంది.

Pages