S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం

07/13/2019 - 20:21

రాముడు తాను చెప్పదలచుకున్న మాటలను లక్ష్మణుడికి చెప్పి, త్వరత్వరగా ఆశ్రమం వైపు అడుగులు వేస్తుంటే, ఎడమకన్ను కింది భాగంలో అదిరింది. కాళ్లు కూలబడ్డాయి. దేహం వణకడం మొదలైంది. ఆయన తనకు కలుగుతున్న అపశకునాలకు వ్యాకులపడుతూ, ‘సీతాదేవి ఇంకా క్షేమంగా ఉన్నదా? నేనామెను చూడగలనా?’ అనుకుంటాడు. ఇలా అనుకుంటూనే తన ఆశ్రమంలో ప్రవేశిస్తాడు.

07/06/2019 - 18:31

పర్ణశాలకు వెళ్తున్న శ్రీరాముడు తనను కలవడానికి వస్తున్న తమ్ముడు లక్ష్మణుడిని దారిలో చూసి శోకంతో తపిస్తూ ఇలా అన్నాడు. ‘నువ్వు సీతను రక్షిస్తావని నమ్మి కదా సీతను ఒంటరిగా నీ స్వాధీనంలో వుంచి నేనిలా వచ్చాను? నేను కాపాడలేక నీకాపని అప్పజెప్పానా? ఆ స్ర్తిరత్నాన్ని అడవిలో ఒంటరిగా వదలిపెట్టి ఇక్కడేదో మునిగిపోయినట్లు ఆదరాబాదరాగా పరుగెత్తుకుంటూ వచ్చావు. నిన్ను చూసింది మొదలు నాకేదో భయంగా ఉంది లక్ష్మణా.

06/29/2019 - 17:45

ఇక్కడ సీతాదేవి వ్యవహారం, సంగతులు ఇలా వుంటే, అక్కడ దండకంలో రాముడి సంగతి వేరే విధంగా ఉంది. కామరూపి, మాంస భక్షకుడు, జింక రూపం ధరించిన వంచకుడు మారీచుడుని చంపిన రాముడు ఆశ్రమానికి రావాలని త్వర త్వరగా వస్తుంటే, వెనుక పక్క నక్క కూత వినిపించింది. ఇది అశుభం తెలుపుతున్నది. దీనివల్ల కీడు కలుగుతుంది, అని భావించిన రాముడు, రాక్షసులు సీతను ఎత్తుకు పోయారేమో అని అనుమానిస్తాడు.

06/15/2019 - 17:14

రావణుడు సీతను ఇలా తనకిష్టమైన రీతిలో భయపడే మాటలు అంటుంటే, భయపడకూడదనుకున్న సీత, పతివ్రతలైన స్ర్తిలు పర పురుషులతో సాక్షాత్తుగ సంభాషించకూడదు కాబట్టి, ఒక గడ్డిపోచను వాడికి అడ్డంగా వేసింది. ‘నువ్వు ఈ గడ్డిపోచతో సమానమనే భావం’ కూడా దీంట్లో వుంది. తన పాతివ్రత్య మహిమ వల్ల రావణుడు తననేమీ చేయలేడనే ధైర్యం వున్నది కాబట్టి భయం కలగకపోయినా రామవియోగం వల్ల దుఃఖం వచ్చింది సీతకు.

06/08/2019 - 19:00

పరాక్రమవంతులు, బలవంతులైన ఎనిమిదిమంది రాక్షసులను దండకారణ్యానికి పొమ్మని ఆజ్ఞాపించిన రావణుడు, ఇక తనకు రాముడివల్ల భయంలేదని తన జ్ఞానహీనత వల్ల భావించాడు. ఇలా అనుకున్న రావణుడు, మన్మథ బాణాలకు లోనై, సీతాదేవిని తలచుకుంటూ, వెంటనే ఆమెవున్న ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ రావణుడు తన ఆజ్ఞానుసారం రాక్షసస్ర్తిల కాపలాలో వుండి, కలత చెందిన సీతను, తనకు ముఖం చాటేస్తున్నదానిని చూసాడు.

06/03/2019 - 22:45

వాసుదాసు వ్యాఖ్యానం
*
అరణ్యకాండ
*
పాపాత్ముడు రావణాసురుడు సీతాదేవిని అలా తీసుకుపోతుంటే అప్పటిదాకా ఒక్కడైనా కనపడలేదు. అలా జరిగినందుకు బాధపడుతున్న సీతాదేవికి ఒకచోట కొండ శిఖరం మీదున్న ఐదుగురు వానరులు కనిపించారు. వీరన్నా తన స్థితిని రాముడికి చెప్పకపోతారా అని భావించిన సీత తన సొమ్ములను తీసి కొంగులో ముడివేసి, వారి ముందర పడేటట్లుగా ఆ మూటను కిందకు జారవిడిచింది.

05/25/2019 - 18:43

రావణుడిని నిందిస్తూ ఇలా అంటుంది సీత. ‘ఓరీ! రాక్షస వంశానికి వెదురుపొదకు కార్చిచ్చు లాంటి వాడా! ఆడదాన్ని, నన్ను, వొంటరిగా వుండడం చూసి నువీవిధంగా దొంగిలించి పరుగెత్తి పారిపోతున్నావే? నీకు కొంచెమైనా సిగ్గులేదా? నీ మాయ వల్లే కదా, అడవిలో మాయామృగం రూపంలో నా మనోవల్లభుడిని దూరంగా తీసుకుపోయింది? రాక్షస వంశం అనే అడవికి నువ్వే చిచ్చుపెట్టావు కదరా?

05/18/2019 - 19:52

ప్రాణాలు వెడలిపోవడానికి సిద్ధంగా వున్న ఆ పక్షిరాజు జటాయువును చూసి సీతాదేవి ఎంతో పరితాపంతో కన్నీళ్లు కాల్వలుగా పారేట్లు ఏడ్చింది. ఏడుస్తూ రామచంద్రుడిని తలచుకుని, ఇలా అంటుంది బిగ్గరగా. ‘కాబట్టి రామచంద్రా! నాకు కలిగిన కష్టం తెల్సుకోవడానికి నీకు ఎడమకన్ను, ఎడమ భుజం అదిరి వుండాలి కదా! పాలగరుడ భరద్వాజాలు తప్ప ఇతర రకాల పక్షులన్నీ కుడివైపు నుండి ఎడమగా పరుగెత్తి వుండాలి కదా?

05/11/2019 - 20:35

పరాక్రమవంతుడైన రావణుడు ఇంకో విల్లు తీసుకుని, బాణవర్షంలో జటాయువును ముంచేశాడు. బాణాల మధ్యలో పక్షిలాగా కాసేపున్న జటాయువు, తన రెక్కల వేగంతో వాటన్నిటినీ చెదరగొట్టి, బాణాలను, విల్లును తుంచాడు. అంతటితో ఆగకుండా జటాయువు రావణాసురుడి కవచాలను తన రెక్కల దెబ్బలతో పొడి పొడి చేసి నేల మీద పడేశాడు. బంగారు కవచాలలో ప్రకాశించే కంచర గాడిదల రథాన్ని నిలబడేశాడు.

Pages