S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కొన్ని పరిస్థితులు

చాలా విషయాలు చెప్పుకోవడానికి బాగుంటాయి. కానీ పాటించడం చాలా కష్టంగా ఉంటుంది. ప్రతి పరిస్థితి నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. చూసే గుణం ఉండాలి. నేర్చుకోవాలన్న తపన ఉండాలి.
ప్రతి వస్తువూ, ప్రతి పరిస్థితి తన నుంచి ఎంతో కొంత నేర్చుకొమ్మని చెబుతాయి.
చెప్పకనే కొన్ని విషయాలు మనలని బాధిస్తాయి. అయితే ఆ బాధించే విషయం కూడా మనకు ఒక్క విషయానే్న చెబుతుంది. అదే ‘ఓపిక’. ఓపిక వహిస్తే పరిస్థితులు మారతాయి.
స్నేహితులు కావొచ్చు. తల్లిదండ్రులు కావొచ్చు. భార్యనో, భర్తనో కావొచ్చు. పిల్లలు కావొచ్చు. కొన్ని సార్లు ఎడారిలో ఒంటరిగా వదిలి వేసినట్టు వదిలి వెళ్లిపోతారు. ఆ స్థితి కూడా మనకు ఒక పాఠం నేర్పుతుంది. మన కాళ్ల మీద మనం ఎలా నిల్చోవాలో నేర్పుతుంది.
కొంతమంది మనకి చాలా కోపం తెప్పిస్తారు. బాధ కలిగిస్తారు. విసుగు తెప్పిస్తారు. ఇలాంటి పరిస్థితి నుంచి కూడా మనం రెండు విషయాలు నేర్చుకోవచ్చు. ఒకటి క్షమాగుణం. రెండవది కరుణ. ఇవి రెండు మనం నేర్చుకుంటే ఈ పరిస్థితిని అధిగమించవచ్చు.
కొంతమంది మన మీద అధికారం చెలాయిస్తారు. మన మంచితనాన్ని ఆసరా చేసుకొని మన మీద స్వారీ చేస్తారు. మన అధికారాన్ని తమ చేతిలోకి తీసుకుంటారు. మన అధికారాన్ని తిరిగి ఎలా పొందవచ్చో ఈ పరిస్థితి నుంచి మనం నేర్చుకోవచ్చు.
మనకు కొంతమంది కోపం కలిగిస్తారు. కష్టం కలిగిస్తారు. వాళ్ల మీద ద్వేషం కలుగుతుంది. ఈ పరిస్థితిని కూడా మనం అధిగమించవచ్చు. షరతులు లేని ప్రేమ ద్వారా ఈ పరిస్థితిని అధిగమించవచ్చు.
కొన్ని విషయాలు మనలని భయపెడతాయి. కొన్ని సంఘటనలు మనలని వెంటాడుతాయి. ఆప్తుల అనారోగ్యం కావొచ్చు. మరణం కావొచ్చు. పరీక్షలు కావొచ్చు. ఇంటర్వ్యూలు కావొచ్చు. బతుకు పోరాటం కావొచ్చు. ఏవైనా ఈ పరిస్థితులని అధిగమించడానికి ధైర్యం కావాలి. మనోనిబ్బరం కావాలి. ఈ పరిస్థితుల నుంచి అవి నేర్చుకోవాలి.
మనలని కొన్ని పరిస్థితులు నియంత్రిస్తాయి. ఆ పరిస్థితి కూడా మనకి ఓ పాఠం చెబుతుంది. అందులో నుంచి ఎలా బయటపడాలో అది నేర్పుతుంది. కాకపోతే నేర్చుకోమని చెబుతుంది.
ముందే చెప్పినట్టు ఇవి చెప్పడం సులువే. కానీ అర్థం చేసుకోవడం, పాటించడం చాలా కష్టం. కానీ ఈ పరిస్థితుల నుంచి నేర్చుకోవాల్సింది ఇవే.

- జింబో
94404 83001

- జింబో 94404 83001