S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

గజ్జెల్లి మల్లేశం, తాండూర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లలో ఇంగ్లీషు మీడియానే్న ఎందుకు ప్రోత్సహిస్తోంది?
అడిగేవాళ్లు లేక.

ఎస్.శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు
చంద్రబాబు తన కుమారుణ్ణి ఎం.ఎల్.సి చేసి మంత్రివర్గంలో తీసుకోడానికి ఉత్సాహపడుతున్నాడంటూ ఈ మధ్య కమ్యూనిస్టు నాయకులు తమ ఉనికిని చాటుకోవడానికి విమర్శలు చేశారు. మరి సాక్షాత్తు సోనియాగాంధి తన కుమారుణ్ణి ఏకంగా ప్రధానమంత్రిగా చేయాలని ఉబలాటపడిందే? అప్పుడు వీళ్లేం చేస్తున్నట్టు? బీహార్‌లో, ఉత్తరప్రదేశ్‌లో, పంజాబ్‌లో, కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులు తమ కుమారుల్ని, కుమార్తెలను, అల్లుళ్లను, కోడళ్లను గద్దెనెక్కించారే. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు?
వారూ ఒకప్పుడు బాబు మిత్రులే. అవకాశం రావాలేగాని మళ్లీ అతడి పంచన చేరగలిగేవాళ్లే. వారి సంగతి ఎవరికి తెలియదు?

గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు, ఏలూరు
కథల పోటీకి ‘హాస్యమైనా సరే’ అని మీరన్నారు. కానీ ఏనాడూ హాస్యకథని మీరు ఎన్నిక చెయ్యలేదు. హాస్యం రాయగలవాళ్లే తక్కువ. నా ప్రయత్నం మాత్రం నేను చేసినప్పుడల్లా అవి విజయవంతంగా తిరిగొచ్చినయ్యి. ‘ఏడుపు కథలకే ఎప్పుడూ పెద్దపీట!’ అని ఒక పెద్దాయన ఎప్పుడో అన్నాడు. ఇప్పుడు మీరూ అంతేనా? మరింక ప్రకటనలో ‘హాస్యం’ అని ఒలకటం దేనికి?
బహుమతి ఇవ్వదగ్గ స్థాయిలో ఎవరైనా రాయకపోతారా అన్న ఆశతో.

సిహెచ్.సాయిఋత్విక్, నల్గొండ
ఇటీవల భారతదేశం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో అపూర్వమైన ప్రతిభ కనబరచి ఒకే రాకెట్ ద్వారా ఏకంగా 104 ఉపగ్రహాలను కక్ష్యలోనికి ప్రవేశపెట్టి యావత్ ప్రపంచం చేత ఔరా అనిపించుకుంది. ఇంత అద్భుతమైన మేథాప్రపత్తిగల మన దేశం రక్షణ రంగంలో మాత్రం స్వయం ప్రతిపత్తి ఎందుకు సాధించలేకపోతూ, అభివృద్ధి చెందిన దేశాల దయాదాక్షిణ్యాలపై ఎందుకు ఆధారపడవల్సి వస్తోంది? రక్షణ సామాగ్రి కోసం ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని ఇటీవల పత్రికలలో చదివాము.
నిజమే. రక్షణ రంగంలో స్వావలంబనకు కాలబద్ధ ప్రణాళిక వేసి గట్టిగా పట్టుబడితే ఈ దురవస్థ త్వరలోనే తప్పక తొలగగలదు. ఈ దిశలో మోదీ ప్రభుత్వం ఇప్పటికే పని మొదలెట్టింది. ఇంకా వేగం పెంచాలి. చిరకాలంగా ఈ రంగంలో పాతుకుపోయిన ఘరానా అవినీతిని అంతమొందించటం తేలిక కాదు. అది ప్రస్తుత ప్రభుత్వం వల్ల అవుతుందా అన్నది చూడాలి.

కొయిలాడ బాబు, చెన్నై
గౌతమీపుత్ర శాతకర్ణి, ఘాజీ ఎటాక్ లాంటి సినిమాలను మన దేశ చరిత్రకు సంబంధించిన నేపథ్యాలను తీసుకొని రూపొందించడం మంచి పరిణామమే. అయినా.. ఆయా చిత్రాల్లో కల్పితాన్ని జోడించడం, చరిత్రను వక్రీకరించే సన్నివేశాలను పెట్టడం ఎంతవరకు శ్రేయస్కరం? అలాంటప్పుడు మన భావితరం ఆ సినిమాలు చూసి అందులో చూపించే విషయాలే నూటికి నూరుపాళ్లు నిజమని నమ్మే ప్రమాదం ఉంది కదా? చరిత్రలో ముఖ్యమైన ఘట్టాలను ఆధారంగా తీసుకొని సినిమా తీస్తున్నప్పుడు సెన్సార్ సర్ట్ఫికెట్‌తోపాటు, భారతదేశంలో చారిత్రక పరిశోధనలు చేసే అతి గొప్ప సంస్థ ఏదైనా ఉంటే, ఆ సినిమా స్క్రిప్ట్ వారి ఆమోదం కూడా పొందే విధంగా నిబంధనలు సవరిస్తే బాగుణ్ణు..! ఎందుకంటే, ఇలాంటి చిత్రాల్లో జరగలేని సంఘటనలు జరిగినట్టు చూపిస్తే.. భవిష్యత్తులో ఒక చరిత్ర పుస్తకాన్ని రిఫరెన్స్‌గా తీసుకున్నంతగా.. ఒక భారతీయ సినిమాలో చూపించే చరిత్రను రిఫరెన్స్‌గా తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఏమంటారు?
సినిమాను చూసి అదే వాస్తవ చరిత్ర అని నమ్మే మూర్ఖులు బహుశా ఉండరు. సినిమాకు వినోదం ప్రధానం. ప్రేక్షకులను ఆకట్టుకోవటానికి తగుమాత్రం కల్పనలు తప్పవు. చచ్చుపుచ్చు మసాలా ఫార్ములా చెత్త సినిమాల కంటే ఎంతో కొంత చారిత్రక అంశాలను స్పృశించే చిత్రాలు చాలా నయం. వాటిని చూసిన వారెవరికైనా ఆయా అంశాల యధార్థ చరిత్రను తెలుసుకోవాలన్న ఆసక్తి రేకెత్తితే ఆ సినిమా సార్థకమైనట్టే. ప్రామాణిక చరిత్ర గ్రంథాలుగా చలామణిలో ఉన్నవే తప్పుల కుప్పలు అయినప్పుడు చారిత్రక సినిమాల్లో ప్రామాణికతను ఆశించడం వెర్రితనం.

సి.ప్రతాప్, శ్రీకాకుళం
ఇటీవల జరిగిన రెండు రాష్ట్రాల మండలి ఎన్నికలలో అభ్యర్థులు మద్యం, ధనం ఏరులై పారించారు. అధికార దుర్వినియోగం పెద్దఎత్తున జరిగింది. అసలు ఎటువంటి క్రియాశీలక పాత్ర పోషించని, రాజకీయ జీవులకు ఆశ్రయం కల్పించడానికే నిర్దేశించిన శాసనమండళ్ల నిర్వహణ మనకు అవసరమా?
శాసనసభలు మాత్రం అవసరమా?

**
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా

మనలో మనం,
ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక,
36 సరోజినీదేవీ రోడ్,
సికిందరాబాద్ - 500003.
: email :
sundaymag@andhrabhoomi.net