S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మంచితనం (సండేగీత)

ఈ మధ్య రెండు మూడు రాష్ట్రాలు పర్యటించాను. పర్యాటక ప్రాంతాల్లో మోసాలు ఎక్కువగా వుంటాయి. అట్లా అని అందరూ మోసం చేస్తారని అనుకోవడానికి వీల్లేదు.
మూడు కుటుంబాల వ్యక్తులం కలిసి వెళ్లాం. ఈశాన్య రాష్ట్రాల్లో ఇన్నోవాలో ప్రయాణం చేశాం. డ్రైవర్లు అన్ని ప్రాంతాలు చూపించడానికి ఇష్టపడలేదు. కోపగించుకుంటే తప్ప వాళ్ళు అన్ని ప్రాంతాలకి రాలేదు. అందుకని గౌహతికి వచ్చిన తర్వాత వాళ్లని మాన్పించి వేరే వాళ్లని ఎంపిక చేశాం. వాళ్ళు బాగానే వున్నారు. కానీ కొంత మోసం చేసే బుద్ధి వాళ్లలో వుంది. మేం రెండు కార్లలో ప్రయాణం చేశాం. ఎయిర్‌పోర్టు దగ్గరికి వేరువేరు కార్లలో వచ్చాం. ఎవరి కారు ముందు వస్తుందో తెలియదు కాబట్టి కారు కిరాయి ఏ కారు వాళ్ళు ఆ కారు వాళ్ళకి ఇచ్చేయాలని అనుకున్నాం. మాకన్నా మా మిత్రుల కుటుంబం ప్రయాణం చేసిన కారు ముందుగా చేరింది. వాళ్ళు కిరాయి డబ్బులు ఇచ్చేశారు.
ఓ ఐదు నిమిషాల తరువాత మేం కూడా ఎయిర్‌పోర్టుకి చేరుకున్నాం. మా డ్రైవర్‌కి డబ్బులు ఇచ్చేశాను. అతను ఇంకో కారు డ్రైవర్‌తో మాట్లాడి అతనికి డబ్బులు ఇవ్వలేదని చెప్పాడు. నేను ఇవ్వడానికి సిద్ధమయ్యాను. అంతలోనే మా మిత్రుడు ఫోన్ చేసి డబ్బులు ఇచ్చానని చెప్పాడు. ఆ ఇద్దరు కారు డ్రైవర్లు ఓ చిన్న అబద్ధం చెప్పి ఓ ఆరు వందల రూపాయలు సంపాదించాలని అనుకున్నారు. మా డ్రైవర్‌పై కోపగించుకొని పంపించాను.
ఈ సంఘటనతో అక్కడి వ్యక్తుల మీద చెడు అభిప్రాయం ఏర్పడింది.
ఆ తరువాత మరో ప్రాంతానికి వెళ్ళాం. ఎప్పటికప్పుడు వాహనాలని కిరాయికి తీసుకున్నాం తప్ప ఒక్కరినే మొత్తం టూర్ కోసం తీసుకోలేదు. ఈ పద్ధతి వల్ల కొంత ఇచ్చింది వున్నా డబ్బుల ఖర్చు తక్కువ.
భోజనం కోసం ఓ సౌత్ ఇండియా హోటల్‌కి వెళ్ళాం. అది మేమున్న గెస్ట్‌హౌజ్‌కి దూరం. భోజనం చేసి హోటల్‌నుంచి బయటకు వచ్చేసరికి రాత్రి పదకొండు అయ్యింది.
బయట టాక్సీలు కన్పించలేదు. మా పరిస్థితిని గమనించి ఓ యువకుడు కాస్త దూరం వెళ్ళి రెండు టాక్సీలు తెచ్చాడు. మా నుంచి ఏమీ ఆశించలేదు. అతనికి థాంక్స్ చెప్పాం. అతను రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశాడు.
అన్ని ప్రాంతాల్లోనూ మంచివాళ్ళూ, చెడ్డవాళ్ళూ వుంటారు. అది ప్రాంత సమస్య కాదు. మనుష్య నైజం.

- జింబో 94404 83001