S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జ్ఞాపకాలు

ఈ మధ్య కవి మిత్రుడు వఝల వూరుని వదిలిపెట్టిన మిత్రులతో ఓ వాట్సప్ గ్రూపు తయారుచేశాడు. దానికి ‘‘వేములవాడ యాదిలో...’’ అని పేరుపెట్టాడు. అంటే అందరూ ఊరు జ్ఞాపకాల్లో పడిపోయారు. పాత ఫొటోలు, అప్పటి ఊరు చిత్రాలు - ఇట్లా ఎన్నో పంచుకోవడం మొదలుపెట్టారు.
జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన మిత్రుడు రాజేందర్ పెట్టిన ఓ పోస్ట్ మెదడుని ఆలోచింపచేసింది. రోజురోజుకీ ఊరు యుక్త వయస్సురాలవుతుంది. మనం ముసలివాళ్ళం అవుతున్నాం. ఇంకో మిత్రుడు వూరు గురించి ఓ కవితని ఇలా చెబుతాడు.
‘ఒకప్పుడు
నేను
మా ఊర్లో నివసించాను

ఇప్పుడు
మా ఊరు
నాలో నివసిస్తుంది
వాట్సప్‌లలో

కొన్ని అరుదైన ఛాయాచిత్రాలు. వాటిని చూస్తుంటే మనసు ఎక్కడికో పోతుంది. కుంటి పంతులు సార్ బడి, డాక్టర్ సుబ్రమణ్యం దవాఖాన, జాతర, నగుబోతు వాళ్ళ దుకాణాలు, వాళ్ల దుకాణాల్లోని నగుబోతు. రాజేశ్వరుని నిశిపూజ, వాగులో స్నానాలు, చెరువులో ఈతలు. ఒకటేమిటి ఎన్నో జ్ఞాపకాలు. జ్ఞాపకాల గురించి నేను రాసిన కవితలో ఇలా అంటాను.

జీవితంలో
అందం ఎక్కడుందంటావ్?
అందం జ్ఞాపకాల్లోనే వుందని నేనంటా
నా మనస్సే నా ‘డైరీ’
నా హృదయమే నా ‘ఆల్బమ్’
నా మెదడే నా ‘కేసెట్’
నా జ్ఞాపకాలన్నీ
కన్పిస్తూ... విన్పిస్తూ...
జ్ఞాపకాలు
కరవరపెట్టినా...
బాధపెట్టినా...

అందం గొప్పదనం జ్ఞాపకాల్లోనే
మూడుపాళ్ళ జీవితం తరువాత
జీవితం నుంచి రిటైర్ అయ్యేంతవరకు
మనం మననం చేసుకోవాల్సింది
జ్ఞాపకాల్నే!

మనిషి జీవితం రెండింటితో ముడిపడి వుంటుంది. ఒకటి జ్ఞాపకాలు, రెండవది సెంటిమెంటు. ఊరు అనేది ఈ రెండింటితో ముడిపడి వుంది. అందుకే ఇంత ఉద్వేగం. ఇంత ఉల్లాసం.

- జింబో 94404 83001