S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సరైన పాత్రలపైనే దృష్టి!

బ్యూటీ శ్రుతి హాసన్ ఇక తను చేసే క్యారెక్టర్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలనుకుంటోందిట. ఏ వయసులో చేయాల్సిన పాత్రలు ఆ వయసులోనే చేయాలన్నది ఈ అమ్మడి ఆశ. ఆ దిశగానే పయనిస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్‌తో ‘కాటమరాయుడు’లో జోడీ కట్టింది. ఈ చిత్రం ఆమెకు అనుకున్నంతగా పేరు తెచ్చిపెట్టలేకపోయింది. విడుదలకు ముందు ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. తన క్యారెక్టర్‌కు బాగానే గుర్తింపు వస్తుందని భావించింది. ప్చ్.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయలేకపోయింది ఈ చిత్రం. తను చేసే చిత్రాలకు, పోషించే క్యారెక్టర్స్‌కు ఏ మాత్రం పొంతన లేకుండాపోతోంది. చేస్తున్న పాత్రను గాలికొదిలేస్తుండటంతో ఆయా పాత్రలు ఆమెకు అనుకున్నంత గుర్తింపును తెచ్చిపెట్టలేకపోతున్నాయన్నది నిజం. ఈ విషయం గురించి శ్రుతిని కదిలిస్తే- ‘‘నేను ఇప్పటి వరకు పోషిస్తున్న పాత్రలు అన్నీ నాకు నచ్చినవే. ఏ వయసులో చేయాల్సిన పాత్రలు ఆ వయస్సులోనే చేయాలి. నేను అదే చేస్తున్నాను. ఈ విషయంలో మా నానే్న నాకు ఆదర్శం. యువకుడిగా వున్నప్పుడే ముసలివాడుగా, మరుగుజ్జుగా నటించి నాన్నగారు అందర్నీ మెప్పించారు. అలా వెరైటీ పాత్రలను చేయాలనుంది. అలాంటి పాత్రలే మన కెరీర్‌లో నిలిచిపోతాయి’’అని చెబుతోంది.