S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎగిరే కప్పలు దిగేదెప్పుడు?

చెట్లపై చిటారుకొమ్మన ఉండి ఆహారం కోసం లేదా ప్రమాదం ఎదురైనప్పుడు మరో చెట్టు శిఖరాన ఉన్న కొమ్మలపైకి చటుక్కున ఎగిరే కప్పలు బోర్నియో, మలేసియాల్లో కనిపిస్తాయి. నాలుగు అంగుళాలు మాత్రమే ఎదిగే ఈ కప్పలు తడవకు 50 అడుగుల దూరం అమాంతం ఎగరగలవు. జతకట్టేందుకు, గుడ్లను పొదిగేందుకు మాత్రమే నేలపై కొద్దిసేపు ఉండే ఈ కప్పలు జీవితాంతం చెట్లపైనే నివసిస్తాయి. ప్రఖ్యాత ప్రకృతి పరిశోధకుడు వాలెసెస్ పేరుకు గుర్తుగా వీటిని వాలెసెస్ ఫ్లయింగ్ ప్రాగ్స్‌గా పిలుస్తున్నారు. గాలిలో తేలికగా ‘గ్లైడింగ్’ చేసే ఈ కప్పల శరీర నిర్మాణం అందుకు అనువుగా ఉంటుంది. కాళ్లవేళ్ల మధ్య ‘వెబ్’, ఉదరం వద్ద పలుచగా ఉండి, వ్యాకోచించే చర్మం అది ఎగరడానికి వీలుగా ఉంటుంది.

ఎస్.కె.కె. రవళి