S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కళాఖండం

ఓ బండరాయికి రూపం ఇచ్చేందుకు ప్రయత్నించిన ఈ కళాకారుడి పేరు అబ్రహం పాయించెవల్. ఈ లైమ్‌స్టోన్ బండలో గాలి పీల్చుకునే వెసులుబాటు ఉంచుకుని లోపల దొలుస్తూ వారంపాటు అందులో ఉండి మనిషి పట్టేలా ఆ రాయిని తీర్చిదిద్దాడు. అత్యవసర పరిస్తితుల్లో వాడేందుకు ఓ ఫోన్, లాగ్‌బుక్, కొన్ని పరికరాలను తనతోపాటు ఆ లోపల ఉంచుకున్నాడు. రెండుముక్కలుగా ఆ రాతిని చీల్చి మళ్లీ వాటికి అతకబెట్టినట్లు ఓ కళాఖండాన్ని రూపొందించి మన్ననలు పొందాడు. పారిస్ మ్యూజియంలో అతడి షో అందర్నీ కట్టిపడేసింది. ఇంతకీ అతడి వయసెంతో తెలుసా! 44. పాలెస్ డి టోక్యో మ్యూజియంలో నిర్వహించిన ఓ షో కోసం అతడు
ఈ సాహసం చేశాడు.

- భారతి