S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గుర్తింపు

‘మీరెవరు’ అని ఎవరైనా అడిగితే చాలామంది తాను డాక్టర్‌నని, ఇంజనీర్‌నని, అధికారినని, వ్యాపారవేత్తనని చెబుతారు. జీవితంలో ఎంతో కొంత విజయం సాధించిన వ్యక్తులకి ఇలా చెప్పుకునే పరిస్థితి వుంటుంది. అలా లేని వ్యక్తులు చాలామంది వుంటారు. అలాంటి వ్యక్తులు ఎలాంటి జవాబు చెప్పకుండా తటపటాయిస్తారు. జీవితంలో ఓడిపోకపోయినా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మామూలు వ్యక్తిగా వుండే పరిస్థితి ఏర్పడి వుండవచ్చు.
అయినా, ప్రతి వ్యక్తి ఒక గుర్తింపుని కోరుకుంటాడు. ఇది మనిషి సహజ లక్షణం. వివాహ సమయంలో ప్రతి వ్యక్తికి గుర్తింపు ఉంటుంది. మిగతా సమయాల్లో అలాంటి గుర్తింపు ఉండకపోవచ్చు. కానీ ప్రతి వ్యక్తి ప్రతిసారి గుర్తింపును కోరుకుంటాడు. మిగతావాళ్లకి వున్న ప్రత్యేకతలు తమకి ఎందుకు లేవని కొంతమంది బాధపడవచ్చు. ఆలోచించవచ్చు. అందం వల్ల, తల్లిదండ్రుల వల్ల కొంతమందికి శారీరకంగా కొన్ని ప్రత్యేకతలు వాళ్లలో ఏర్పడి వుండవచ్చు. ఓ రచయితగా, ఓ కవిగా, చిత్రకారుడిగా వాళ్లు మారి ఒక ప్రత్యేకతని ఏర్పరచుకొని వుండవచ్చు.
ఇతరులతో పోల్చుకుని మనలో చాలామంది వ్యక్తులు బాధపడుతూ వుంటారు. సృష్టి తమకి అన్యాయం చేసిందని ఆలోచిస్తూ వుండవచ్చు. సృష్టి కొంతమందిని అలా సృష్టించడానికి కారణాలు ఏమైనా ఉన్నాయో లేదో తెలియదు కానీ ప్రతి వ్యక్తి జీవితానికి ఓ ప్రయోజనం వుంటుంది. ఆ పని కోసం అతను జన్మించి వుంటాడు. ఈ విషయాన్ని చాలామంది గుర్తించరు.
మనిషి గుర్తింపు అతని పేరులో వుంటుంది. మన దగ్గర పనిచేసే వ్యక్తుల్ని పేరుతో పిలిస్తే వాళ్లు చాలా సంతోషిస్తారు. మనపట్ల అభిమానంగా కూడా వుంటారు. ఈ విషయాన్ని గమనించక చాలామంది ఒక్కొక్కరిని ఒక్కోలా పిలుస్తూ వుంటారు. కొంతమందిని నెంబర్లతో పిలుస్తారు. మరికొంతమందిని వాళ్లు చేసే పనులతో పిలుస్తారు. అది సరైంది కాదు.
కోర్టులో ముద్దాయిలను మాత్రమే ఎ1 (ముద్దాయి-1), ఎ2లుగా పిలవడం సమంజసమేమో కానీ మిగతా సందర్భాల్లో మాత్రం అది అసమంజసంగా అనిపిస్తుంది.
కొంతమంది తండ్రి ద్వారా గుర్తించబడాలని కోరుకుంటారు. అది వాళ్ల ఇష్టం. అది వాళ్లు తమ తండ్రికి ఇస్తున్న గౌరవం. కె.ఎన్.వై.పతంజలి తన కూతురు వివాహ పత్రికని ఇలా మొదలుపెట్టాడు. పలాని గ్రామంలోని పలానా వ్యక్తి కుమారుడైన పతంజలి... అని రాశాడు. పతంజలికి సాహిత్యంలో, పత్రికల్లో, సమాజంలో గొప్ప గుర్తింపు వుంది. అయినా ఆయన తండ్రి ద్వారా గుర్తింపబడాలని అనుకున్నాడు. తండ్రికి ఆయన ఇచ్చిన గౌరవం.
నేను మా తండ్రి గురించి రాసిన కవితని ఇలా ముగించాను.
‘ఎప్పటికీ
నేను నీ కేరాఫ్‌నే
ఎన్నటికీ నువ్వు నా కేరాఫ్ చిరునామావి కాదు’
ప్రతి వ్యక్తిని మనిషిగా గుర్తించడం, అతని పేరుతో గుర్తించడం చాలా అవసరం.

- జింబో 94404 83001