S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సంక్రాంతి దీప్తి

ప్రతి పండుగకు నిర్దేశింపబడిన సంప్రదాయాలు, వాటి అంతరార్థాలను గ్రహించి, ఆరోగ్యం, ఆహ్లాదం, ఆత్మానందాన్ని అనుభవిస్తూ, సాంఘిక, నైతిక, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలను ప్రజా శ్రేయస్సుకు ఉపకరించాలని హితవు పలికేవి పండుగలు. చైతన్య స్ఫూర్తి.. సంక్రాంతి దీప్తి.. అంటూ మా ఇంట సంక్రాంతి శోభను వెల్లివిరిసేట్టు చేశారు - ఈ వారం స్పెషల్ ద్వారా.
-పి.బాబ్జీ (తెనాలి)
వినదగు
భగవద్గీతలోని ‘ఘర్షణలు - సంఘర్షణలు’ వివరణ ఓ రీసెర్చ్ టాపిక్‌ని తలపిస్తోంది. ‘వినదగు’ శీర్షిక ద్వారా భగవద్గీత మర్మాలను వివరిస్తున్నందుకు డా.వాసిలి గార్కి ధన్యవాదాలు. గీతలోని శ్లోకాలు అవే అయినా, వాటిలోని అంతరార్థం చదివిన కొద్దీ కొత్త విషయాలు గోచరించడం.. అవి మానసిక, శారీరక, ఆధ్యాత్మిక, మేనేజ్‌మెంట్ రంగాలకు స్ఫూర్తిదాయకం కావడం గీతలోని గొప్పదనం. గీతను సైకలాజికల్ స్టార్మింగ్ సెషన్‌గా చెప్పొచ్చుననే రచయిత అభిప్రాయంతో విభేదించేవారుండరు. మహాత్మాగాంధీ అంతటివాడే సమస్యల పరిష్కారానికి ‘్భగవద్గీత’ను ఆశ్రయించాడు.
-ఎన్.పద్మావతి (హైదరాబాద్)
మానవ తప్పిదం
నదులలోని, సముద్రాలలోని నీటిని తోడి, కాంక్రీట్ భవనాలు నిర్మించడం, చెట్లను అదే పనిగా నిర్మూలించడం, అంతరిక్ష ప్రయోగాల పేరిట ఓజోన్ పొరను చీల్చడం, అధిక కాలుష్యాన్ని విరజిమ్మే రసాయనాలు, ధూళి, దుమ్ములవల్ల ఉష్ణోగ్రతలు పెరిగి ఉపద్రవాలు ఉద్భవించి ఊళ్లను, ప్రజలను, పాడి పంటలను సర్వనాశనం చేస్తున్నాయి. ఇది ముమ్మాటికీ మానవ తప్పిదమేనని గ్రహించి కళ్లు తెరచిన ప్రపంచ దేశాధీశులు పారిస్ సదస్సులో ఒకటై భూతాపాన్ని కొంతవరకైనా తగ్గించాలనే సంకల్పం చేయడం మంచి పని.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
మూర్తిమత్వం
సి.వి. గారు చెప్పిన ‘మూర్తిమత్వం’కు సంబంధించిన అంశాలు ఆచరిస్తే విజయం తానంతట తానే వరిస్తుందని చెప్పవచ్చు. అలాగే ‘అక్షరాలోచనాలు’ చదువుతూంటే తీయటి అనుభూతి కలుగుతోంది. ‘సింహావలోకనం’ కవిత మమ్మల్ని గత అనుభవాల్లోకి తీసుకెళ్లింది. ‘అమ్మ’ కవిత ఎవర్‌గ్రీన్.
-పెయ్యల శ్రీనివాసరావు (అలికాం)
రణక్షేత్రం
‘రణక్షేత్రం’ సీరియల్ మా ఇంటిల్లిపాదినీ అలరిస్తోంది. ఆయా పాత్రల నేపథ్యాలూ.. సంఘటనలూ చదివింపజేస్తున్నాయి. అలాగే ‘వినదగు’ శీర్షిక బాగుంటోంది. పోరుబాటలో మానసిక భ్రమల నుండి బయటపడాలనుకుంటాడు. యుద్ధం చేయటమే అన్ని విధాల అర్జునుడి ధర్మం.. మనమూ అంతే. గొప్పగొప్ప చదువులు చదివి వృత్తిని చేపట్టనంటే ఎలా? కాబట్టి వృత్తి ధర్మాన్ని కాదనటం కార్యాచరణ నుండి తప్పుకోవటమే! జీవితంలో పోరాడాల్సిందే! జీవితమంతా పోరాడుతుండాల్సిందే! అన్న జీవిత సత్యాన్ని తెలియజెప్పింది.
-గుండు రమణయ్య (పెద్దాపూర్)
స్ఫూర్తిదాయకం
‘మీలో సృజనాత్మకత ఎక్కువగానే ఉంటుంది’ వ్యాసం స్ఫూర్తిదాయకంగా ఉంది. అలాగే కొత్తగా గమ్మత్తుగా.. కవర్‌స్టోరీ నూతన సంవత్సర కానుకగా భావిస్తున్నాం. ‘హిట్ అండ్ రన్’ ఆసక్తిదాయకంగా ఉంది.
-వాండ్రంగి కొండలరావు (పొందూరు)
మీకు తెలుసా?
ఈ శీర్షిక ద్వారా ఎనె్నన్నో తెలీని అంశాలను తెలుసుకో గలుగుతున్నాం. వారానికోసారి 30వేల గుడ్లు పెట్టే చేపల గురించి చదివి ఆశ్చర్యపోయాం. ఇక ‘ఓ చిన్న మాట’ గురించి ఎంత చెప్పినా తక్కువే. ‘కొత్త సంవత్సరం’ అంటూ - మనం ఏం సాధిద్దామని అనుకుంటున్నామో దాని గురించి కలగనాలి. కల లేకుండా మనం ఏదీ సాధించలేం. అందుకని కలగనాలి. మనం ఏం కలగన్నామో అది మనకు ఎప్పుడూ కన్పిస్తూనే ఉండాలి. దాన్ని సాధించడానికి మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. ఎప్పుడూ నిరుత్సాహపడకూడదు. ఇది మొదటి అడుగు - అంటూ కలల గురించి... వాటిని సాధించుకోవాల్సిన ఆవశ్యకతను గురించి బోధించింది.
-కాళహస్తి వెంకట శేషగిరిరావు (నెల్లూరు)
సండే గీత
ఈ శీర్షిక ద్వారా అందిస్తున్న కథనాలు మాలో నూతన స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. ‘ఊహించలేం’ అంటూ జీవితంలో ఏదీ ఊహించలేం.. ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకండి అని చక్కగా తెలిపారు. ఓ చిన్న మాట ‘మంత్రం’ జీవితం అంటే చాలా కష్టాలతో కూడినదని నిరంతరం శ్రమించాలని అంటూ ఆలోచింపజేశారు. సిసింద్రీలో ‘ఎవరి గొప్ప వారిది’ అని వాదులాటలకు దిగక ఎవరి పని వారు చేసుకోవడం ఉత్తమం అన్న నీతిని బోధించారు.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)
లోకాభిరామమ్
చిన్నతనంలో మనకు చక్కగా విద్య నేర్పిన ఉపాధ్యాయులను జీవితాంతం గుర్తుంచుకోవడం సహజం. అందునా మనతో ఆత్మీయంగా ఉంటూ, వివిధ కార్యక్రమాలను నిర్వహించే వారు మరీ గుర్తుంటారు. ‘లోకాభిరామమ్’లో గోపాలంగారు గురువులు శీర్షికన తన చిన్నతనంలో చదువు చెప్పిన ఎంతో మంది గురువులను స్మరించుకోవడం, సైన్స్‌ఫేర్ సందర్భంగా తనను ప్రోత్సహించిన రావుగారు, ఇంకా తనపై ఎంతో ఆప్యాయత చూపించిన ఇతర గురువులను పేరుపేరునా తలచుకోవడం అభినందనీయం. -సరికొండ శ్రీనివాసరాజు (హైదరాబాద్)