S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బ్రకోలి తింటే ఆకలి పెరుగుతుంది!

క్యాబేజీ కుటుంబానికి చెందిన ఒకరకమైన ఆకుకూర బ్రకోలి. ఇటలీకి చెందిన ఈ బ్రకోలీ నిజానికి పుష్పగుచ్చపు పైభాగం అన్నమాట. గాఢమైన ఆకుపచ్చని వర్ణంలో ఉండే పుష్పగుచ్చాన్ని పచ్చిగాను, ఉడకబెట్టి తింటారు. వీటిలో ఉండే గ్లుసినోలేట్స్ కళ్లకు మేలు చేస్తాయి. గ్లుకోమా వ్యాధి రాకుండా అడ్డుకుంటాయి. మిగతా కూరల్లో లేనంత విటమిన్ సి, ఎ, కె వీటిలో ఉంటాయి. వంద గ్రాముల బ్రకోలిలో ఉండే విటమిన్ సి, ఒక కమలాపండు రసంలో ఉన్న సి విటమిన్ పరిమాణానికి సమానంగా ఉంటుందంటే విషయం అర్థమవుతుంది. వీటిలో ఉండే ఫ్లవనాయిడ్స్ కరోటినాయిడ్స్ జీర్ణాశయ గోడలు, రక్తనాళాల లోపలి పొరలను సురక్షితంగా ఉంచుతాయి. బ్రకోలి కాయగూరను అమెరికన్లు ఎక్కువగా ఇష్టపడి తింటారు. కానీ ప్రపంచంలో వీటిని అత్యధికంగా పండిస్తున్నది చైనా, రెండోస్థానం ఇండియాదే. భోజనానికి ముందు ఆకలి పెరగడానికి దీనిని ఎక్కువగా తినడం పాశ్చాత్య దేశాల్లో ఆనవాయితీ.

- ఎస్.కె.కె. రవళి